నలుగురు కొడుకులు ఉన్నా
ఇంటికంటే ఒక కూతురు వున్న
ఇల్లే సందడిగా ఉంటుంది*
జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం.. గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే
ఓ మనిషి!
అండ మో కణ మో కలయిక
అమ్మ గర్భ మో అంధకార మో
పిండ మో
శిశువో ప్రాణివో సకల జీవ ప్రాణులకు అధికారి
ఓ మనిషి!
చివరకు పిడికెడు బూడిద అవుతావు
లేదా మట్టిలో కలిసిపోవడమే
వెల్మజాల నర్సింహ ✍🏻
దేవుడు!
కదలని బొమ్మకు బంగారు
వలువలు
కటిక పేదరికంలో ఉండే
అమ్మకు చిరిగిన చీర
తిన్నని రాయికి పరమాన్నాలు
తిండి లేని భిక్షగాడికి
పావలా దానం
పూటగడవని ఇంట్లో
అన్నమే పరమాన్నం
కోట్లాది పతికి చక్కెర రోగం
వెల్మజాల నర్సింహ
మన అలిశెట్టి ప్రభాకర్ గారు
ప్రకృతి పై కవిత్వం
రాయవచ్చు
నోబెల్ పొందవచ్చు
ప్రేమ పై కవితలు
రాయవచ్చు
సినిమాలో చూపించి
ఆనందం పొందవచ్చు
కానీ కాలే కడుపుతో
ఆకలినే ఆయుధంగా
పేదల కోసం కవిత్వం రాసి
వారిని నాడు నేడు ఉత్తేజ
పరుస్తున్న జన భాస్కరుడు
మన అలిశెట్టి ప్రభాకర్ గారు
వెల్మజాల నర్సింహ ✍🏻
నదికి ప్రవాహమే
నదికి ప్రవాహమే ఇతరుల జీవనాధారం.
మనిషికిరోజువారి పనుల్లో కొత్తదనాన్ని వెతికే వాడు ముందుకు పోతాడు
సముద్రంలో అలలు
సముద్రంలో అలలు
సంసారంలో కష్ట సుఖాలు కాలానుగుణంగా
మారుతుంటాయి వాటిని ఆహ్వానించడం
తప్ప ఏమి చేయలేము
సర్పంచ్ కుర్చీ
కండువా వేసి ఠీవిగా వచ్చి
కూర్చోవడానికి
పల్లె వెలుగు బస్సు కాదు
సర్పంచ్ కుర్చీ
జనం తో ఉండాలి
వారికి సేవలు చేయాలి
కాలం మారింది, మర్యాదలు
కూడా మారుతాయి.
( తొందరలోనే ఎలక్షన్స్ ఆలోచించు)
వెల్మజాల నర్సింహ ✍🏻
నాలుగు అక్షరాలు
నాలుగు అక్షరాలు లక్ష మెదళ్ళకు కదలిక
అలాగే మంచి నాయకుడు లక్షలాది జన్నానికి ఆదర్శం
అక్షరం జనం నాలుకల పై, నాయకుడు జనం గుండెలపై
చిరస్ధాయిగా ఉంటారు.
కొత్త చెరువు!
అనగనగా ఒక ఊరికి ప్రక్కనున్న కొత్త చెరువు లో ఏపుగా పెరిగిన తుమ్మ చెట్లు కనిపిస్తున్నాయి.చెరువు నిండా నీళ్ళు ఉండడం వలన కీచురాళ్ళ శబ్దం సాయంత్రం నాలుగింటికి మొదలు చీకటి వరకు చేస్తూనే ఉంటాయి.రెండు దశాబ్దాల క్రితం మనుషులకు ఆ శబ్దాలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉండేది.
కాలక్రమంలో ఎంతో అభివృద్ధిని సాధించాము చరవాణి ప్రపంచంలో దూరవాణి మాయం. అప్పటి కాలంలో తుమ్మ చెట్ల వలన చాలా ఉపయోగాలు ఉండేవి నాగళి మొదలు తలుపుల వరకు ,ఇప్పుడు వీటి స్థానంలో ట్రాక్టర్స్ మరియు అందమైన కలప మార్కెట్లో దొరుకుతుంది.
కానీ ఈ తుమ్మలే చెరువులో తిష్ట వేసుకొని ఉన్నాయి
చిన్న చితక చెట్లని ఎదగానివ్వవు.ముళ్ల చెట్టు కాదండీ
వాటి సహజ లక్షణం.
అలా ప్రతి ఊరిలో కొందరు పెద్ద మనుషులు ఉంటారు కులం పేరుతో ఒక్కడు, తాత ముత్తాతలు గొప్పవారని
మరొక్కడు తుమ్మ చెట్టులా తిష్ట వేశారు.ఊరిని బాగు చేయారు . గొంగడి గొంగడి ఎక్కడ నీవంటే నిన్న నీవు వేసినా కాడనే ఉన్న అందట.
..
to be continued..
వెల్మజాల నర్సింహ ✍🏻
కొత్త క్యాలెండర్ 2024
ప్రపంచమే ఇంటర్నెట్ తో కుగ్రామం
జన జీవనమే నాటకరంగం
సూర్యుడి గమనం లెక్కలు వెస్తు
గ్రెగోరియన్ క్యాలెండర్ ముందుకు తెస్తు
నూతన సంవత్సర సంబరాలు
మనుషుల సంతోషాలకు ఆనవాలు
వెల్మజాల నర్సింహ ✍🏻01.01.2024
మన చుట్టూ ప్రక్కల జనం
మన చుట్టూ ప్రక్కల జనం
మరియు పుస్తకాలు ,సమయం
ఎన్నో జీవిత పాఠాలు నేర్పుతాయి
అయినా ఎప్పటికీ నేర్చుకున్నే
విద్యార్థులుగా ఉండటానికే ఇష్టపడుతాం.
చిరునవ్వు!
జీవితం ఆగిపోవచ్చు
ఎదో గాలికి రాలిన ఆకుల
ఎవ్వరో తెంపిన కాయల
పుణ్యం కొద్ది
తొడిమె ఊడిన
పండులా
అయినా జీవితం
సాగిపోవచ్చు
ఎవరో నడుపుతున్న వాహనంలా
గాలికి ఎగిరే పక్షిలా
అబద్ధాలకు సాక్షిలా
రాత్రి పగలు నిత్యం
పుట్టుక చావు సత్యం
బంధాలే నటనలు కావా
డబ్బుకు దాసోహం లోకమని తెలిసి
ముందుకు సాగడమే సుఖం
ముఖం పై చిరునవ్వే
మనిషికి ఆశ కాదా!
వెల్మజాల నర్సింహ ✍🏻
కోట్లకు అధిపతైనా
కోట్లకు అధిపతైనా
ఆయుష్షుకు పేదోడే,
కొడుకులు కోడళ్లున్నా
భార్య లేకుంటే
బంధాలకు బలహీనుడే
ఒంటరి జీవితం!
నల్లని చీకటి తెల్లని గోడలు
గోడువినే నాథుడు లేడు
దుప్పటి తోనే ముచ్చట్లు
మసక కన్నులతో ఇక్కట్లు
పది రోజుల పండుగ పెళ్ళి
కొడుకులు బంధువుల లొల్లి
అంతా సజావుగానే, మరల
కొడుకులు పట్నం పొయారు
సముద్రమంతా అనుభవం
ఏదరికో తెలియని పయనం
సాగుతోంది ఒంటరి జీవితం!
వెల్మజాల నర్సింహ ✍🏻
పేదల బతుకు చిత్రం
మురుగు నీటి ప్రక్కల గుడిసెలు
మరోవైపు
ఇదే బస్తీ జీవనం పేదల బతుకు చిత్రం
భారత్ అభివృద్ధి చెందుతోంది
బడాబాబులా జేబులు నింపడానికి
వెల్మజాల నర్సింహ✍🏻
మానవత్వం
మీరు ఈ ఫొటో జాగ్రత్తగా చూడండి ఆ పాప చేతిలో ఆహారం వుంది వెనకాల రాబందు వుంది ఆ పాప అనుకుంటుంది, రాబందు వచ్చి ఆహారాన్ని ఎత్తుకుపోతుందని దాచుకొంటోంది. కానీ, పాపకు తెలియని విషయం ఏంటంటే, రాబందు చూసేది ఆహారం కోసం కాదు ఆ పాప కోసమే అని ఎందుకంటే తిండి సరిపోక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే తిందామని...*
*ఈ ఫొటో కెవిన్ అనే ఫొటో గ్రాఫర్ సూడాన్ లో 1990 లో అక్కడి కరువు కాలంలో తిండి లేక ఎంతో మంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజెయ్యాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్ళి తీసిన ఫొటో ఈ ఫొటోకి గాను కెవిన్ కు చాలా గుర్తింపు వచ్చింది సన్మానాలు చాలానే జరిగాయి ప్రపంచంలో కెవిన్ పేరు మారు మ్రోగిపోయింది*
*ఆయనను అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి సన్మానాలు చేసుకోడానికి కూడా సమయం చాలక బిజీగా తిరుగుతున్న కెవిన్ కు ఒక సారి ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తగానే అవతలి వ్యక్తి... ఆ పాప ఏమయ్యింది సార్, బ్రతికుందా చనిపోయిందా అని అడిగాడు. అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు... ఏమోసార్ ఫొటో తీసి వచ్చిన తరువాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు లేదు, ఆ పాప ఏమయ్యందో అని/ అప్పుడు అవతలి వ్యక్తి ఇలా అన్నాడు... ఆ రోజు అక్కడ వున్నవి రెండు రాబందులు, ఒకటి పాప చనిపోతే తినేద్దాం అనిచూస్తుంటే ఇంకొకటి కెమేరా పట్టుకొని కూర్చుంది... అని ఫోన్ పెట్టేసారు... ఆ మాట ఆయన మీద ఎంత ప్రభావం చూపిందంటే, 1993 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత...*
*అప్పటికి ఆయన వయస్సు 33 సంవత్సరాలే... ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, సమాజంలో ఇప్పుడు కెవిన్ లాంటి వారు చాలా మంది వున్నారు. ప్రతీది ఫొటో తీయడం, అక్కడ మన అవసరం వున్నా సహాయం చేయకుండా కెవిన్ లాగా పదిమంది మెప్పు గురించి బ్రతికేవారే ఎక్కువ... ఆరోజు అక్కడ కెవిన్ మరిచింది ఏంటంటే మానవత్వం. ఈరోజుల్లో మనం మరుస్తుంది కూడా మానవత్వమే.*
*కాబట్టి మీలో వున్న కెవిన్ ని చంపండి..👍*
( వాట్స్ ఆప్ నుండి సేకరణ)
ఊరకనే !
ఉడకపోత మా ఇంట్లో ఫ్యాన్ మోత
చరవాణి లో మీడియా కథలు
అయోమయంలో అందరూ చిందులు
మా గల్లీ లో డీజే కూత
అది చేరాలి ఢిల్లీకి తాత
ఉదయాన్నే వాట్సాప్ లో గోలగోల
ఫేస్బుక్ లో ముఖాలు తలతల
నెటుంటే ఫోన్ తో కలకల
డేటా అయిపోతే మనసంతా విలవిల
ఆకాశంలో చుక్కల లెక్క
ఎప్పుడూ తీరునో సందేహం అక్క
రామారావు ఇంటి దగ్గర కుక్క
అది ఊరకానే మొరగదు పక్క
వెల్మజాల నర్సింహ ✍🏻
నేటి బతుకు చిత్రం
ఎంప్లాయీస్ ఎదలో వేట
నెలజీతం డబ్బుల మూట
ఖర్చులా నోరు తెరిచిన బాట
కష్టంగా గడుపుతున్న పూట
మధ్య తరగతి మనుషులమాట
*************
వెల్మజాల నర్సింహ
జీవితమంటే ?
జీవితమంటే
ఆత్మకథ లాగా అందమైన
పుస్తకమేమి కాదు
ఎన్నో ఆటుపోట్ల అనుభవాల
ప్రయాణం..
గమ్యం తెలిసిన
ఆశల పేజీ అసంపూర్ణమే.
వెల్మజాల నర్సింహ
அது தான் வாழ்க்கை
சுயசரிதை போல அழகு
புத்தகம் அல்ல
பல அலை அனுபவங்கள்
பயணம்..
சேருமிடம் தெரியும்
அசலா பக்கம் முழுமையடையவில்லை.
வேல்மஜால நரசிம்மா
అక్షర శోధకుడు
కవి ఆలోచనలు ఎప్పుడు యవ్వనమే
ప్రియురాలి పైనుంచి ఆకాశం వరకు
అలల నుండి అగ్గిపుల్ల వరకు
దేనిపైనా నైనా కవిత రాయగలడు
నిత్య యవ్వనుడు అక్షర శోధకుడు
***************
ಕವಿಯ ಆಲೋಚನೆಗಳು ಯಾವಾಗಲೂ ಚಿಕ್ಕದಾಗಿರುತ್ತವೆ
ಪ್ರೀತಿಯ ಮೇಲಿನಿಂದ ಆಕಾಶದವರೆಗೆ
ಅಲೆಗಳಿಂದ ಪಂದ್ಯಗಳಿಗೆ
ಅವನು ಯಾವುದರ ಮೇಲೂ ಕವಿತೆ ಬರೆಯಬಲ್ಲ
ನಿತ್ಯ ಯವ್ವನ ಅಕ್ಷರ ಶೋಧಕ
ವೆಲ್ಮಜಲ ನರಸಿಂಹ
మన స్నేహం !
తారలు తిరిగే వేళా
మన ముచ్చట్లకేది మౌనం
అమావాస్య రాత్రుల్లో
మన మాటలకేది చీకటి
నీవు నేను కలిస్తే
ఆకాశం లో
ఇంద్ర ధనుస్సే
మన ముచ్చట్ల తో
పక్కింటి వనజా
ఊరి చివరి సుజాత
మల్లేశం చెల్లెలు
ఎవరిని వదలని కబుర్లు
సర్పంచి మొదలు
చాకిరేవు బండ వరకు
తాటి వనం నుండి
చేపల చెరువు వరకు
ఇవే కదా మన ముచ్చట్లు
రాజకీయాలు సరే సరి
సినిమా కబుర్లు భలే భలే
హీరోలా పిచ్చి అభిమానం
ఏమైపోయే మిత్రమా
చరవాణి చేతి కొచ్చే
మాటాలేమో మూగబోయే
సమయం లేదు మిత్రమా
మరల తిరిగిరాని కాలం తో
వెల్మజాల నర్సింహ ✍🏻
మౌనం మాట్లాడుతుంది !
ఒక మౌనం ఎన్నో ప్రశ్నల జవాబు
ఒక మౌనం ఎన్నో బాధల ఓదార్పు
ఒక మౌనం ఎన్నో అవమానాల
సహనం
మౌనం కాదు శూన్యం
అది ఒక నిత్య పరమానందం
అందులో వెతికితే జీవితానందం
మౌనం మాట్లాడుతుంది.
వేగంతో కాదు ఓర్పుతో విను
మౌనం మాట్లాడుతుంది
మనుషులతో కాదు
మనసు తో విను
મૌન ઘણા પ્રશ્નોના જવાબ આપે છે
મૌન એ ઘણા દુ:ખનું આશ્વાસન છે
એક મૌન ઘણા અપમાન છે
ધીરજ
મૌન એ શૂન્યતા નથી
તે શાશ્વત આનંદ છે
જો તમે તેને શોધશો, તો તમને જીવનમાં આનંદ મળશે
મૌન બોલે છે.
ધીરજથી સાંભળો, ઝડપથી નહીં
મૌન બોલે છે
માણસો સાથે નહીં
તમારા હૃદયથી સાંભળો
టెంగ్లీష్(英语)
పేరుకు మాత్రమే ఇరవై ఆరు
ప్రపంచమే ఏలుతుంది
పొట్టిగా కొన్ని పదాలతో
అలవోకగా మరిన్ని మాటలతో
చమత్కారం గా, వెటకారం గా
అని భాషలలో దూరి
అలుకు పోతుంది.
సంస్కృతం మరిచాం
సంస్కృతి విడిచినాము
క్షమించు వదిలేసి
సారీ 'నే సొంతం చేశాం
ఎన్నో కొత్త పదాలు
మరెన్నో వాక్యాలు
ఏది సరైనదో
నిర్ధారణ కష్టమే సుమా!
చెప్పే వారు కరువాయే
వినేవారికి ఒప్పిక లేదు
బడిలోను అదే తంతు
సినిమా లో అదే గొంతు
ఇంగ్లీష్ భాష నువ్వే నేటికి బాషా !
తెలుగు భాష వెలగాలని ఆశ!
नाममात्रे षड्विंशतिः
जगत् शासनं करिष्यति
कतिपयैः लघुशब्दैः सह
अधिकाधिकं शब्दैः सह
पेचीदा, प्रतिशोधकारी
तत् भाषासु
तरङ्गः गच्छति।
वयं संस्कृतं विस्मृतवन्तः
वयं संस्कृतिं त्यक्तवन्तः
क्षमस्व त्यजतु
क्षम्यतां, मम स्वामित्वम् अस्ति
अनेकाः नवीनाः शब्दाः
अनेकानि अधिकानि वाक्यानि
यत् सम्यक् अस्ति
सुमायाः निर्धारणं कठिनम् अस्ति!
ये तद् वदन्ति ते दरिद्राः
श्रोतारः न प्रत्ययन्ते
विद्यालये अपि तथैव भवति
चलचित्रे एव स्वरः
आङ्ग्लभाषा अद्यत्वे बाशा!
आशासे तेलुगुभाषा बहिः आगमिष्यति!
वेल्मजला नरसिंह
-
రేణుకా హృదయానందం భృగవంశ తపస్వినం క్షత్రియాణాం అంతకం పూర్ణం జమదగ్న్య్ం నమామ్యహం! పండుగ అంటే : సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావా...