అమ్మ నాన్న లా బండి!

నవమాసాలు మోసిన అమ్మ

 తన బరువును నాన్న

 చేతిలో పెడుతుంది.

నాన్న ఆ భారాన్ని 

జీవితాంతం మోస్తూనే వుంటాడు

మంచి వస్తే పొంగిపోడు

చేడు వస్తే కుంగిపోడు

అమ్మ జాబిలి లాంటిది 

తన సంతానం చల్లగా

ఉండాలనుకుంటుంది

నాన్న సూర్యుడి వంటివాడు

నిత్యం కష్టపడుతూ

అందరూ సుఖంగా

 ఉండాలనుకుంటాడు

అమ్మకు సెలవు వుండదు

నాన్న కు భారం తగ్గదు

కాడి ఎద్దుల వారు సంసార

 బండి లాగుతుంటే

మనం బండి లో

 కుర్చోని ఆనందిస్తాం

బంధాల బండిలో 

బంధువులు

ఎందరో వచ్చే 

వారు వస్తుంటారు 

 పోయేవారు

 పొతుంటారు.

అయినా గమ్యం

 తెలియని ప్రయాణంలో

 అమ్మ నాన్నలా బండి లో

 ఆనందంగా

 విహారించే

 మనిషి 

తిరిగి వారికి ఏమి

 ఇవ్వాలో ఆలోచించాలి కదా


31st పార్టీ!

 మనోడే పిలిచాడు 

రారా అని అరిచాడు 

చలిగాలి వీస్తోంది

దుకాణం తెరిచి వుంది

డీజే  పాట మ్రోగుతుంది 

31st పార్టీ అంటా

 తగాలేయ్య డబ్బులు

అమ్మా నాన్నల గుండెలో గుబ్బులు