చురకలునీవు బాల్ కొడుతూ వుండాలి

మేము నోరు తెరిచే చుస్తుండాలి

కొట్ల ఆస్తులు మీరు సంపాదించాలి

అమ్మ నాన్న ఎంత సంపాదించారు అని నేను...చుస్తుండాలి

పక్కొని పనితనం మడి కట్టుకొని   కొనియాడాలి

నీ జీవితం పై ఎవరిదొ పెత్తనం అని నిందేయాలి

చదువులు సరిగా లేవని
చచ్చే దాక గాడిద కష్టం చేయాలి

మనిషికి మనిషికి తేడా
సోమరి తనమే కాదా

నిప్పుకు నింగికి నీకు నాకు తేడా లేనే లేదుగా

అమ్మ కొట్టింది


గుమ్మం లో అమ్మను చూస్తే
మౌనం విడిన మునిలా వుంది
వేకువ జామున నదీజలాంల పోతుంది
బుంగముతి బొమ్మల వుంది
లంగా పరికిణీ లొ మా తల్లి
ఎమైనాదే చిన్ని ....
అమ్మ కొట్టింది

నా చిన్న నాటి ఆటలు


 
 
కొమ్మకు పూసిన పువ్వుల లేలేత ప్రాయం

అమ్మ చనుబాలతొ పెరిగిన కాయం

సిరగొనే ఆటలతొ
కోతి కొమ్మచి పాటలతో

పెరిగిన మా బాల్యం బంగారమే కదా. ..

.పొద్దున్నే గొళ్లిల ఆటలతొ

సాయంత్రం గిజిగాడి పాటలతో

సీమసింతకాయ వగరుతొ

చెడ్డికి వున్నా రెండు చిల్లులతొ గడిచిన మా కాలం. .

ఒంటి పూట బడి
కంటికి వుండదు నిద్ర

ఇదమ్మ బావిలో ఈత

ఇంటికి వచ్చినంక వీపు పై దెబ్బల మెాత

మరవరాని మాబాల్యపు గురుతులు.

.తాటి ముంజల జోడి

తరగదు తుమ్మల బంక

అష్టచెమ్మ ఆట ఆడితే
తెలవదు టైమేంతొ

ఆ..ఆటలు కనుమరుగైయేన. .

5.వీడియో గేమ్స్ ఇచ్చెన అ.. ఆనందం

ఆలొచించాలి మనమందరం

బయటి ఆటలతొ బాల్యపు గొప్పదనం

బాలల బంగారు భవిష్యత్తు కై
 

*******

వెలుమజాల నర్సింహ.

మా ఊరి చెరువులో దొంగలు పడ్డారు.

ఆ మధ్య ముంబయి నుండి ఊరికి దసరా సంబురాలకు రైలులో
 బైలుదేరాను   పక్కన ఆంధ్రవారు వున్నారు.

పిచ్చపాటి లొ భాగంగా కొంత గర్వంతో నాది
తెలంగాణా మా ఊరు
దుప్పెల్లి మాకు ముాడు
చెరువులునా, మాఊరిలొ అందరు వలస పోతున్నాం
అని చెప్పాసాగాను దానికి వారు గొళ్లున నవ్వడం తొ ఒకింత నానా పడ్డ.

అందులొ ఒక్కడు. ...ఒరేయ్ మా ఊరులొ సెరువుల్ లేవు కాని
ఊరంతా ఐక్యంగా వుంటూ ఎంతో అభివృద్ధి సాదించాము అని చెప్పసాగాడు.

అప్పుడు నాకు సిగ్గుగా అనిపించింది.


అవును" మా ఊరినిండా రాజకీయ గబ్బిలాలు  సంచరిస్తూ తమ స్వార్థ కొసం  జనాలను వాడుకుంటారు.

ఏ..రాజకీయ నాయకుడు ఊరి బాగు గురించి మాట్లాడాడు

ముాడు చెరువులునా
రెండు పంటలు పండించాడానికి కృషి చేస్త అని చెప్పాడు.

చెరువుల అనుసంధానం
గురించి

ప్రజలు అడుగాలేరు ఏందుకంటే పార్టీ ముఖ్యం .

"చదువుకున్నవారున్నా
ఊరు కొసం ఆలొచించే వారు సున్న "

రోడ్డులు సరిగా వుండావు
ఇంటికొక నేత వుంటాడు
ఆరుగులపై కూర్చొని "
చచ్చిన బర్రె బుడ్డేడు పాలిచెదాని  చెప్పుకుంటారు.

పక్క ఊరులో మార్కెట్ యార్డు వచ్చిన

మన ఊరికి దవఖాన, సరైన రోడ్డు తేస్తానని
"
ఏ రాజకీయ నాయకుడి  మేనిఫెస్టో లొ వుండాదు "
నాయకుడంటే తాటి వనంలో దవత్ ఇచ్చాడా లేదా బీర్ దుకాణం లొన.
 ఆది వార్త కావాలి

"సిగ్గు లేని జనం "

ఊరికి మురికి కాలువ
నిర్మాణము లేదు.

వయసు పై బడిన వారి పెన్షన్ పై రాజకీయం .

దొరల కాలమే సుమా
ముాడు చెరువులు తవ్వంచారు.

కొత్త చెరువులో నీటిని వుంచాలని ఎవరు ఆలొచించారు


"వనరులున్నా ఊరు వలసలు తప్పని తీరు"

యువత వున్నా పాడుబడ్డ రెక్కుల శబ్ధ ఫొన్ లలొ పాటలు వింటూ 
కాలం గడుపుతున్నారు.

యువత మేలుకో ఊరు బాగు కొసం ఆలొచించు
రాజకీయ ఆతితంగా.

వాట్సప్ లొ మాన ఊరు గురించి గొప్పగా రావాలని  ఆశతో


మన ఊరులో ఒక్కడిని.
******
(వెలుమజాల నర్సింహ) 

మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి(vemulakondagutta)

వైకుంఠంలొ  శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో  పాల సముద్రంలో ఆదిశేషుడి పైశయనించే సమయంలో.
మహావిష్ణువు నిద్రకు ఉపాక్రమిస్తుంటే లక్ష్మీదేవి  శ్రీహరి పాదసేవలొ వుండగా. అదే సమయంలో అక్కడికి విచ్చేసిన నారదుడు మహాలక్ష్మితో


అమ్మ ఎంత సంపాదన వున్న భర్త పాదసేవే తప్పదు కదమ్మా ఇంతకి  శ్రీహరి నిద్రలో వున్నడ లేదా నటిస్తున్నాడ నాకేందుకులే మళ్లీ వస్తా నారాయణ నారాయణ... అని వెనుదిరిగాడు. మహాలక్ష్మి పాదములు కొంచెం గట్టిగా నొక్కడంతొ, ఆది గమనించినా మహావిష్ణువు నారాదుల వారు కలహాభొజనుడు కడుపు నింపుకోని వెళ్ళినటుండుడాని తనూ ఒక వైపు తిరిగి పడుకోవడంతొ తన చేతికున్న ఉంగరం సముద్రంలో పడుతూవుండే అక్కడే సంచరిస్తూన చేప అంగుళీకంని మింగడం కోసం పైకి ఎగురువుతుంది.

శ్రీహరి ఉంగరం జారీ పోతుందని తన వేళ్ళను ఆడిస్తువుంటే చేపకు తాకి  నుదుట ముాడు వేళ్ళు, ముాడునామలుగా మారాయి.
పక్కనే వున్న మహాలక్ష్మి ఇదంతా చుాస్తు ఎవండి ఉంగరం చేప మిగింది.
స్వామి...వసుధ పై మత్స్యం అంగుళీకంతొ బతుకగలదా పైగా మన పెండ్లినాటిది  అనగా..
 దానికి నరసింహ స్వామి
లోక కల్యాణానికే లక్ష్మి 
ఏది జరిగిన ప్రజల
మేలుకే.

ధరణి పై వేములకొండ
 ప్రాంతంలో నేను శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహ స్వామి గా వేలసి నమ్మినవారికి అండగా వుంటాను నాఎదుట వున్న కొలనులో  ముాడునామల చేపల దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం కలుగును
 అని స్వామి చెప్పగ అమ్మ సంతోషం తొ వేములకొండ గుట్ట పై కొలువుదిరారు
జై... శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహ.
* **********

( వెల్మజాల నర్సింహ. దుప్పల్లి.)

వాగుడుకాయలు
పంది కాళ్ల "పాపా రావు మరియు గాడిద' గాంగ రావు మంచి మిత్రులు  ....


పాపారావు :ఒరేయ్ గాడిద గాంగ రావు "నేను చనిపోయేటపుడు
చేతిలో పెద్ద  ఫొన్ అందులో వాట్సప్ లొ మేనేజ్ లు
 చుస్తు చనిపోవాలని వుందిరా. .
 🤣🤣🤣🤣

దానికి బదులుగా


గాడిద గాంగ రావు:
ఒరేయ్ పంది కాళ్ల పాపా రావు

నేను చనిపోయేటపుడు
పేస్ బుక్ లో  అందమైన అమ్మాయ్ తొ చాటింగ్ చేస్తూ చావాలిరా

👻👻

దుప్పల్లి ''శ్రీ రేణుక ఎల్లమ్మ పండుగ (Duppelli '' Sri Renuka Yellamma Festival)


పండుగ అంటే :  సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయికే పండుగ (Festival). 

సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సంబంధించి పండుగ జరుపుకుంటారు

గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాధుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవతలు ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మారమ్మ, పోచ్చమ్మ మొదలగు పల్లె తల్లులు.
 
 శ్రీ రేణుక ఎల్లమ్మ :హేమలాంబ’ (హేమం అంటే బంగారం, బంగారుతల్లి) అన్న సంస్కృత నామమే, గ్రామీణుల వ్యవహారంలో ఎల్లమ్మగా స్థిరపడిందని పండితులు విశ్లేషిస్తారు. ఇక, రేణుక అన్న మాటకు - పుట్ట అనే అర్థం ఉంది. ఆరోజుల్లో అమ్మవారి ఆలయ పరిసరాల్లో పాముల పుట్టలుండేవేమో!

శ్రీ రేణుక ఎల్లమ్మ  పండుగ  ,యాదాద్రి'
 జిల్లా తెలంగాణా రాష్ట్రంలోని  దుప్పెల్లి  గ్రామంలో జరిగే  రైతు పండుగ.
వ్యవసాయ బావినే గుడిగా మలిచిన తీరు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతా


  ప్రతియేటా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. 

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించేసంప్రదాయం ఉంది. మహిళలు భక్తి శ్రద్ధలతో వండిన అన్నంతో పాటు పాలుబెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకొని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపుకుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం ఆనవాయితీ .


మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన చెన్నై,ముంబాయి  నుండి కూడా లక్షలాది భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 
 
అమ్మవారి పాదాలురామాయణం లో ఒక పేజీ
రాసిండు వాల్మీకి అమ్మ చరితం
పేదలా పాలిట పెద్దమ్మ
పల్లెలను కాపాడే ఎల్లమ్మ

ఊరు తల్లులకు బిడ్డవి నువ్వే
కోరికలు తీర్చే మాతంగి నువ్వే
జమదగ్ని కోపాన్ని కి బలియై
అడుగడుగునా అవమానాలేనో
పరశురాముడిని సంతానం పొంది
అతడి చేతిలో మరణం చెంది
మరలా జన్మించిన మహా ల్లివి
నువ్వే
 
*****

మీ...
వెల్మజాల నర్సింహ
తేది:23-8-2016, మంగళవారం

చిత్తాపురం చిన్నది ( -పాట 9.)పల్లవి: చిత్తాపురం చిన్నది చెట్టు చాటు కున్నది 
చెంతకు రమ్మంటే 
అది చేరలేను నన్నది 

చరణం: ముద్ద పురం చిన్నది మూల మలుపు నున్న ది ముద్దివ్వమంటె
ముతి ముడుచుకున్న ది
                                                   :చిత్తా పురం చిన్నది:

చరణం: నర్సపురం చిన్నది నడి రొడు మీద నున్న ది 
నావద్ద కు రమ్మంటే నగలు కావాలన్న ది

చరణం: వేంకట పురం చిన్నది బేరలాడుతునది

నన్ను కటుకొమంటె 
కోట్లు లేవనాది 

చరణం: రాఘవపురం చిన్నది రంజుగ భలే నున్నది 
రావే లేచి పొదామంటే 
రాను రాను నన్నది 

                                      :చిత్తాపురం చిన్నది:

వసంతంకొమ్మలొ కోకిలమ్మ కొత్త రాగం అందుకునేన 

వసంతం కు స్వాగతించెన 

మామిడి పూత పై  మనసై. .మనువడ తలచెన 
కొత్త రాగం తీసేన 

వసంతమా" మాసాంతం పెళ్ళిల గోల 

వలచిన వరుడు, వసంత వధువు 

నడిచే కాలం నవ వసంతం 

మళ్లీ కుయవే గువ్వ మరొ వసంతానికై

బుుతువుల రాణివై 
వచ్చిన వసంత'కు

పిచ్చుక

.పచ్చని మెుక్కలు పైపైన పిచ్చుక
వెచ్చని గాలికి ఎగిరేనా గగనంలొ
కాంకులలొ గింజలను పింఛంతొ ఆడిస్తుా
పంట చేలలో పట్టణాలలో ఎక్కడ
చుాసినా అక్కడ మీరే 

.గడ్డి పుల్లలతో గుాడు నిర్మింప 
గాలి ఊపుకే కులేన 

నీగుాడు చుాడ బ్రహ్మాకైన రిమ్మ తిరిగేన 

ఊర పిచ్చుకి, గోరంత పిచ్చుక 
గొప్ప ఇంజనీర్ నీవంట 

.ఏనిమేలియా రాజ్యం 
పేసరిడే కుటుంబం

పేరంటాలు రోజంతా 
గుంపు గుంపుగా 
వనభోజనాలు మీయాంట

పాల కాంకుల పాలు తాగుతూ 
పారవశించేన గోరు పిచ్చుక 

నది జలాల పై వంగిన చెట్టె 
నవ పిచ్చుకకు పురుడు పొసేన 

.ఈదురు గాలితో వచ్చిన వానలో 

కొట్టుకు పొయేన చెట్లని

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం
లాగా పిచ్చుక గుాడే చెదిరెన

గుండె నిబ్బరాన్ని కొల్పొక మళ్ళీ గుాడు నిర్మించెన 
 
***********
 
 ..

కంటికి కనిపించాని వాటితో నిత్యం యుద్ధం చేయడమే జీవితం


తెలుగు భాష

 
అమ్మలాగ కమనైన భాష
చెట్టు కొమ్మలాగ రమనీయమైన భాష
చెరకు గడ్డ లాగ తీయనైన భాష
దేశ భాషలందు లెస్స నైన భాష
నా తెలుగు భాష. .

***********


వెలుమజాల నర్సింహ.21.4.19