జేతలబావి(జలతార బావి

 

సృష్టిలో పుట్టిన లేదా పుట్టించిన ప్రతి దానికి చరిత్ర వుండదు కొ

న్నింటికీ మాత్రమే వుంటుంది. 

పుట్టిన ఊరు కన్న తల్లితో సమానం

 కొన్ని గ్రామాలు కట్టడాల  వలన ఫేమస్ అవుతాయి. 

అలా దుప్పెల్లి గ్రామంలో వున్న జేతలబావి(జలతార బావి)  గురించి చెప్పాలంటే 

జలం అనగా నీరు 

తార అనగా నక్షత్రాలు 

స్వచ్చమైన నీటితో రాత్రిలో నక్షత్రాలు స్పష్టంగా కనిపించే విధంగా వుండేవి. 

అలాగే రాత్రి వేళలో దేవ కన్యాలు వచ్చి స్నానాలు 

చేసేవారేమెు శబ్ధాలు వచ్చేవి అని అక్కడ పని చేసిన పెద్దలు అంటుంటారు. ..

బావి గురించి చెప్పాలంటే కాకతీయుల 

చివరి రాజు ప్రతాప రుద్రడి కాలంలో తవ్వ

బడిన స్థానిక దొర గారిది 

అప్పటి కాలం సువర్ణ యుగామని చెప్పవచ్చు  ఎందుకంటే 

తిన్న డానికి సరైన ఆహారం లేకున్నా 

వ్యవసాయ క్షేత్రాలలో దొరికే పండ్లు కాయలతో 

హాయిగా జీవించేవారు. 

దొరగారు ఎంతో ఇష్టంగా తవ్వించి చుట్టూ బండాలపై దేవతా ప్రతిమలను వేయించారు.

నీరు చాలా తీయగా వుండి వ్యవసాయానికి వాడేవారు. 

చుట్టూ ప్రక్కల రావి మరియు పెద్ద ఊడలమర్రి చెట్టు వుండేది. 

ఇరవై ముప్ఫై మంది జీతాగాండ్ల తో నిత్యం 

కళకళలాడుతుండేది.

ప్రక్కనే పెద్ద పశువుల దొడ్డి తో సంతల రద్దీగా వుండేది. 

కానీ నేడు దొరలు లేరు బావులా శోభలేదు 

మా చిన్నతనంలో అని చెపే తాతయ్య తప్ప 


 *వెల్మజాల నర్సింహ*26.5.21

కామం కాదు లోకమనేది


 కామం కాదు లోకమనేది 

సృష్టిలో తీయనైనది 

సృష్టికే ముాలమైనది 

యవ్వనంలో పరుగులైనది 

యద లో పొంగే ప్రేమైనది 

క్షణ కాలం బొంగారమైనది

క్షణమీడని జీవన మైనది

రతి సతి తో  ఐక్యమైనది

 లోకమంతా మైకమైనది 

కామం గెలిచితే వీరుడనది 

ప్రపంచ శాంతికి 

మార్గ మనది

కామం కాదు లోకమనేది

యవత తెలుసుకుంటే భవితనది