మనసు ఉందని భావిస్తే మనశ్శాంతి

 మనసు ఉందని భావిస్తే మనశ్శాంతి 

ఉండదు జీవితంలో అంతా నటనే! 

కొందరు ఎక్కువగా నటనలో జీవిస్తారు అంతే

కొందరు డబ్బులు కూడా

 కొందరు డబ్బులు కూడా
 పెడతారు ఆనందం పొందుతారు
కొందరు ఆస్తులు సంపాదిస్తారు
 తన వారసులకు పంచుతారు

కానీ
నాలుగు అక్షరాలు పోగుచేసి
నలుగురికి పంచాలనే ఆలోచనతో ఇంటినే

 గ్రంథాలయం చేసిన మహానుభావులు 

ఇలా కొందరే ఉంటారు.





ఓ మనిషి!

 

అండ మో కణ మో కలయిక
అమ్మ గర్భ మో అంధకార మో
పిండ మో
శిశువో ప్రాణివో సకల జీవ ప్రాణులకు అధికారి

ఓ మనిషి!

  చివరకు పిడికెడు బూడిద అవుతావు
లేదా మట్టిలో కలిసిపోవడమే



వెల్మజాల నర్సింహ ✍🏻

దేవుడు!

 

కదలని బొమ్మకు బంగారు
వలువలు
 కటిక పేదరికంలో ఉండే
 అమ్మకు చిరిగిన చీర
తిన్నని రాయికి పరమాన్నాలు
తిండి లేని భిక్షగాడికి
 పావలా దానం
పూటగడవని ఇంట్లో
అన్నమే పరమాన్నం
కోట్లాది పతికి చక్కెర రోగం



వెల్మజాల నర్సింహ

మన అలిశెట్టి ప్రభాకర్ గారు

 ప్రకృతి పై కవిత్వం
రాయవచ్చు
నోబెల్ పొందవచ్చు
ప్రేమ పై కవితలు
రాయవచ్చు
సినిమాలో చూపించి
ఆనందం పొందవచ్చు

కానీ కాలే కడుపుతో
ఆకలినే ఆయుధంగా
పేదల కోసం కవిత్వం రాసి
వారిని నాడు నేడు ఉత్తేజ
పరుస్తున్న జన భాస్కరుడు
మన అలిశెట్టి ప్రభాకర్ గారు



వెల్మజాల నర్సింహ ✍🏻

నదికి ప్రవాహమే

 నదికి ప్రవాహమే ఇతరుల జీవనాధారం.
మనిషికిరోజువారి పనుల్లో కొత్తదనాన్ని వెతికే వాడు ముందుకు పోతాడు

సముద్రంలో అలలు

 సముద్రంలో అలలు
 సంసారంలో కష్ట సుఖాలు కాలానుగుణంగా 

మారుతుంటాయి వాటిని ఆహ్వానించడం

 తప్ప ఏమి చేయలేము

సర్పంచ్ కుర్చీ

 

 

కండువా వేసి ఠీవిగా వచ్చి
 కూర్చోవడానికి
 పల్లె వెలుగు బస్సు కాదు

 సర్పంచ్ కుర్చీ 

జనం తో ఉండాలి
 వారికి సేవలు చేయాలి
 కాలం మారింది, మర్యాదలు
 కూడా మారుతాయి.

 
( తొందరలోనే ఎలక్షన్స్ ఆలోచించు)



వెల్మజాల నర్సింహ ✍🏻

నాలుగు అక్షరాలు

 

 

 

 

 నాలుగు అక్షరాలు లక్ష మెదళ్ళకు కదలిక
అలాగే మంచి నాయకుడు లక్షలాది జన్నానికి ఆదర్శం
 అక్షరం జనం నాలుకల పై, నాయకుడు జనం గుండెలపై
చిరస్ధాయిగా ఉంటారు.

 

 

 

కొత్త చెరువు!

 

అనగనగా ఒక ఊరికి ప్రక్కనున్న  కొత్త చెరువు లో ఏపుగా పెరిగిన తుమ్మ చెట్లు కనిపిస్తున్నాయి.చెరువు నిండా నీళ్ళు ఉండడం వలన కీచురాళ్ళ శబ్దం సాయంత్రం నాలుగింటికి మొదలు చీకటి వరకు చేస్తూనే ఉంటాయి.రెండు దశాబ్దాల క్రితం మనుషులకు ఆ శబ్దాలు  వింటుంటే ఎంతో ఆనందంగా ఉండేది.
కాలక్రమంలో ఎంతో అభివృద్ధిని  సాధించాము చరవాణి ప్రపంచంలో దూరవాణి మాయం. అప్పటి కాలంలో తుమ్మ చెట్ల వలన చాలా ఉపయోగాలు ఉండేవి నాగళి మొదలు తలుపుల వరకు ,ఇప్పుడు వీటి స్థానంలో ట్రాక్టర్స్ మరియు అందమైన కలప మార్కెట్లో దొరుకుతుంది.

కానీ ఈ తుమ్మలే చెరువులో తిష్ట వేసుకొని ఉన్నాయి
చిన్న చితక చెట్లని ఎదగానివ్వవు.ముళ్ల చెట్టు కాదండీ
వాటి సహజ లక్షణం.

అలా ప్రతి ఊరిలో కొందరు పెద్ద మనుషులు ఉంటారు కులం పేరుతో ఒక్కడు, తాత ముత్తాతలు గొప్పవారని
మరొక్కడు తుమ్మ చెట్టులా తిష్ట వేశారు.ఊరిని బాగు చేయారు . గొంగడి గొంగడి ఎక్కడ  నీవంటే నిన్న నీవు వేసినా కాడనే ఉన్న అందట.
..
to be continued..

వెల్మజాల నర్సింహ ✍🏻

కొత్త క్యాలెండర్ 2024



             ప్రపంచమే ఇంటర్నెట్ తో కుగ్రామం
జన జీవనమే నాటకరంగం
  సూర్యుడి గమనం లెక్కలు వెస్తు
          గ్రెగోరియన్ క్యాలెండర్ ముందుకు తెస్తు
నూతన సంవత్సర సంబరాలు
   మనుషుల సంతోషాలకు ఆనవాలు



వెల్మజాల నర్సింహ ✍🏻01.01.2024