జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం.. గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే
బతుకే బతుకు
బతుకులు బత్తాయి బతుకులు
బతుకులు బతుకుతున్నామనే
సందేహం లో బతుకులు
బతుకులు మనవాళ్లు
వున్నారని భ్రమలో బతుకులు
బతుకులు చచ్చేదాక
సంపాదన ధ్యేయం బతుకులు
బతుకులు ఏవరి కోసం,
ఎందుకో బతుకులు
బతుకులు పుట్టామా
గిట్టామా బతుకులు
బతుకులు భుక్తి కోసం
పోరాట బ్రతకులు
బతుకులు భుామికోసం
బతకులు
బతుకులు భయం
భయం బతుకులు
కానీ సంతృప్తి చెందిన
బతుకే బతుకు కదా
అణగారిన జాతికే వెలుగంట
మీరు రాసింది మా తలరాతంట
ప్రపంచ మేధావి మీరంట
మీరాతలే గీతాగ నేడంట
అక్షరమే ఆయుధం నీదంట
అన్ని వర్గాలకు మేలంట
దీపం వెలుగులో చదువంట
అణగారిన జాతికే వెలుగంట
*********************
వెల్మజాల నర్సింహ 🙏🏻
ఉగాది @2021
వసంతాగమనం వచ్చింది
ఉగాది పండగ తెచ్చింది
చైత్ర మాసంలో వచ్చింది
చెట్టుకొమ్మ చిగురించింది
కాలగమనం మెుదలైంది
కోయిలమ్మ గొంతు విపింది
కొత్త సంవత్సరం వచ్చింది
యుగాదిపండుగ తెచ్చింది
కవులు కలాలు పట్టారు
కవిత్వం తో స్వాగతించారు
మామిడి కాయల సందడి
వేప పువ్వుల పందిరి
తీపి వగరు చేదు పులుపు
ఉగాది పచ్చడి చేయండి
ఊరంత పంచండి
పంచాంగాని వినండి
పరిపూర్ణంగా జీవించండి
******************
(వెల్మజాల నర్సింహ చరవాణి.9867839147)
-
రేణుకా హృదయానందం భృగవంశ తపస్వినం క్షత్రియాణాం అంతకం పూర్ణం జమదగ్న్య్ం నమామ్యహం! పండుగ అంటే : సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావా...