శుభోదయం

రవికిరణం ధరణి చుంబన వెలా
నవ జననం పోందే పత్రం
 పీతాంబరం తోడిగే వెలా

పిచ్చుక పిల్లలు గానం కై
గోంతు సవరించు వెలా

లోక కళ్యాణం కై ప్రకృతి
పురుడు పోసుకునే వెలా
ప్రతిదినం నవ శుభోదయమే

సామెతలు

౧.అమ్మ చెయ్యికి చెప్పనవసరం  లేదు కొడుకు ఆకలి..

౨.నాగరాజు పెళ్లిలో తోక  రాజు పోచ.

కరోనా(వలస కూలీలు) పాట


పల్లవి:ఒక్కరా  ఇద్దరా వలస కూలీలు

భవన నిర్మాణా పనులో బతికే  అన్నలు (2)

చరణం : ఊరిలో తల్లి దండ్రులు తన వెంటే భార్య  పిల్లలు

సమిష్టి కష్టమే రోజు భోజనం

రోజు రొక్కమే వారి జీవనం

  ఆస్తి అంతస్థుల ఆలోచన లేదు


        :ఒక్కరా  ఇద్దరా:

చరణం: ఎండలు వానలు చుట్టాలు
కష్టాలు కన్నీళ్లు పక్కలు

ప్రపంచంతో పనిలేదు
రోజు పని వుంటే పదివేలు

పూరి గుడిసెలలో నివాసం

అందమైన భవనాల కోసం సాహసం

      :ఒక్కరా  ఇద్దరా:

చరణం:వారి శ్రమ దోచుకునే పెద్దలు

వారి కష్టాలు పట్టించుకోని నేతలు

వారి తల రాసిన దేవుళ్ళు

వారి కుటికేసరు పెట్టిన కరోనా వైరస్..
     :ఒక్కరా  ఇద్దరా:

చరణం.లాక్ డౌన్ వెలా
కాలం
రోజు గడువని కాయం

కనబడాని నేతల సహకారం
పూటా గడువని వైనం
  హలహాలమే శరణ్యం

 :ఒక్కరా  ఇద్దరా:


వెల్మజాల నర్సింహ

నిప్పుకణం (పాట)                      పల్లవి:నిప్పుకణం నిప్పు కణం నిప్పుకణం(2)

మనుస్మృతినే తగులా పెట్టినా
మనవ రూపం నిప్పుకణం( 2)

చరణం:బడిలో గుడిలో అవమానం
     బాల్యమంతా అతనికి బాధలమయం 

అడుగడుగున అవరోధాలకు 

చదువే ఆయుధమని నమ్మిన
చదువులకె  మహా మనిషి

             :నిప్పుకణం:

                చరణం: శంభుక వధ కథతో చలించిన 

తరాల రాతలతో విసుగెత్తి

                      కులాల కురుక్షేత్రంలో నలిగిన పేదలకై

ముక్ నాయక్ పత్రిక తో
జనజాగృతికై  పోరాడిన

              :నిప్పుకణం:

చరణం: రాజ్యాంగా
  రాచనలో మేటైనా వారు

  తన జాతి జాగృతి కోసం 
                                   తన పదవినే తృణ ప్రాయంగా  వదిలిన వారు

భారత జాతి గుండెల్లో
                                    నిత్యం వెలుగులదీపాన్నీకే అతడే నిప్పుకణం

              :నిప్పుకణం:

లేగదూడ(Calf)


 పచ్చని గరికలు వెచ్చని క్షీరమూలు
ప్రక్కనా గోలుసు  పందిరి చప్పుడు
ఉడుతాల గోల పిచ్చుక ఈల
యేదలో సుధా ఎందుకో రాముడు ఆలిగాడు

బుంగమూతి , ఋరద కాళ్ళు
ఎతైనా ముపురం ఎర్రని నోసలు చుక్క
తెల్లని వర్ణం తలుపులా చెవులు
గంగమ్మ కోడె...
ఎందుకో రాముడు ఆలిగాడు

మురిపాలపై అలక
పచ్చని గరక పై మక్కువ
నెమరు వేయడం రాక
ఎందుకో రాముడు ఆలిగాడు

లాక్ డౌన్" శుభోదయంమార్నింగ్ రవికి మహోదయం
ఉదయం చూసిన వెలా
ఆనందోదయం
కరములు జోడించిన
వెలా అరుణోదయం
గడప దాటని మాకు
శిరోధార్యం

లాక్ డౌన్ వెలా
శుభోదయం

న కాంక్షే విజయం కృష్ణ !(Na kāṅkṣē vijayaṁ kr̥ṣṇa)


ఆకాశంలో  మబ్బులు
మనుషులు దాచ్చే డబ్బులు
తీరని  కోర్కెల జబ్బులు
జీవన పయనం లో
న కాంక్షే విజయం కృష్ణ !


వదలని చేసినా మరకలు
పూజకు తెచ్చిన గరికలు
బతుకుకై  మిగిలిన నూకలు
న కాంక్షే విజయం కృష్ణ !


మంచికై పోరాడే మనసు
వద్దనా పెరిగే వయసు
కర్మల వలన వచ్చే యశస్సు
న కాంక్షే విజయం కృష్ణ !