అమాయక ఆలుగడ్డ InnocentPotato

 

కోసుకుంటే  కూరలో 

కాకుంటే సమెాసా లో 

పాపం నిన్ను పావ్ బాజీ తో 

పిసికితే పానీపుారి తో 

ఎలాగైనా లాగించేస్తూ

ఉత్తర భారత దేశంలో 

ప్రతి వంటలో నువ్వే 

పరోటా గా కడుపు నింపుతుా

వేపుడు వేస్తే కరకరలాడుతు 

చిప్స్ ల రూపంలో ఒదుగుతావు

సగం వంటలు నీతోనే 

వంకాయ తో ఒకటై పోయి

ఎన్నో కార్యలు నిలబెడుతావు

 ముంబయి వాసులకు  

వడపావ్ లో వడాగా

చేరి 

ఆకలి తీరుస్తు 

బతుకునిస్తున్నావు

సులభంగా వండే

 వంటలు నీవే 

పేద కడుపులు నింపే 

ఆహారం నీతోనే 

అమాయక ఆలుగడ్డ 

నీవు లేనిదే గడువదు మా అడ్డా

****************

 వెల్మజాల నర్సింహ.27.01.22

అక్షర అక్షయపాత్ర

నా అక్షరం నడిచే నిప్పు కణికలై* 

లక్ష మెదడులో విజ్ఞానం వెలిగించాలి* 

అనాదిగా వస్తున్న ఆచారాలను

 పాతాళానికి తొక్కేయాలి* 

మీ చదవులను మీ పాలనను

 నా అక్షరం ముందుకు నడిపించాలి* 

అంబేడ్కర్ అంటే మనిషి కాదు 

అందరినీ  నడిపించే అక్షర నౌకావుతాను* 

నిత్యం వెలుగులు పంచే* 

అక్షర అక్షయపాత్ర అవుతాను


వెల్మజాల నర్సింహ. 26.01.22

చిన్న చిన్న పల్లెలు


చిన్న చిన్న పల్లెలు 

పల్లెలలో పిల్లలు 

పిల్లలతో తల్లులు

తల్లిదండ్రులే దేవుళ్ళు 

దేవుళ్ళలా పల్లె మనుషులు


చిన్న చిన్న పల్లెలు

పల్లెలను కలిపే దారులు 

దారుల వెంట నీడలు

నీడలో నిలిచే ఆవులు 

ఆవుల వెంట దుాడలు

దుాడల వెనుక రాముడు 

చిన్న చిన్న పల్లెలు 

పల్లెలలో పండుగలు 

పండుగ తో  సందడి 

సందడిగా మాపందిరి 

చిన్న చిన్న  పల్లెలు 

పల్లెలలో పచ్చని పైరులు

పైరులలో తిరిగే రైతులు 

రైతు మనసు వెన్నెల

************


వెల్మజాల నర్సింహ* 🖋️