నాదేశం నా జెండా


 నాదేశం' భరతవంశ గడ్డ

పలు సంస్కృతుల అడ్డా

సింధూ నది ఒడ్డున 

హిందూ దేశం  గా  పిలువబడుతుా

ఆసేతు హిమాచలం

మనకుండే రక్షణ కవచం 

గంగ, యమున,కృష్ణ లే కాదు 

 బ్రహ్మపుత్ర,  గోదావరి జలాలతో 

పచ్చని పంటలు పండిస్తుా

అన్నపుార్ణ గా వెలుగొందే 

నాదేశం మా కెంతో గర్వం 

బహు భాషాల మనుషులు

సర్వ మతా కులాలు 

 భిన్నత్వంలో ఏకత్వం

వందేమాతరమే మా నినాదం 

వసుధైక కుటుంబం 

 నాదేశం గొప్పదనం 


నాదేశానికి త్రివర్ణజెండా 

మా గుండెలల్లో నిండా 

పింగళి వెంకయ్య గారు 

 రూపొందించేనా జెండా  

భారత జాతి మది నిండా

మధ్యలో అశోక చక్రంతో 

కాషాయం, తెలుపు, పచ్చ

 రంగుల మిళితమై 

నేడు రెపరెపలాడే గగనంల లో

 నాజెండా

నాదేశం నాజెండా 

ప్రతి భారతీయుడి యేద నిండా


వెల్మజాల నర్సింహ 

Mob:9867839147

కవన కిరణం కందికొండ

 తన ఊపిరి పాట 

తన బ్రతుకే కవిత్వం

అమ్మా అయ్య లా మాటలతో

అల్లిన కవితాల సుమహారం

బతుకమ్మ పాటలతో

 పల్లె గొంతులను వినిపించే

పల్లె ప్రజల నాడీ బాణీ 

తెలిసిన వాడీ కలం

తెలంగాణ యాస 

సినిమా తెరపై మన భాషా

మళ్ళీ కూయవే గువ్వా

మనసుకు తాకిన మువ్వ

చక్రి గారి మైత్రి 

అందమైన పాటల తోట

V6 బతుకమ్మ పాటలు

పల్లె గొంతులో కూతలు

తెలంగాణ బిడ్డావ్వని

తెగ మురిసే పల్లె జనం

తంగేడు పువ్వుల లాంటి

పదాల పాటే మన కందికొండ

కాన్సర్ ను జయించి

కానరాని లోకాలకు

 పయనమైతివి

కవన కిరణం కందికొండ

జనం నాలుకల పై కొలువుండ

   

**

వెల్మజాల నర్సింహ

దుప్పల్లి


చరవాణి.9867839147.



గుడ్డి దీపం

తాటాకు పై గంటాతో

తాపత్రయ పడ్డారు

రాయడానికి

వారు రాశారు ఎన్నో

 గొప్ప పురాణాలు

రాతి పై ఎక్కేన శాసనాలు

ఇంకు బాటిల్ పెన్ను

గుడ్డి దీపం కన్ను

రాశారు ఎన్నో గొప్ప కావ్యాలు

తెల్ల పేపర్ వచ్చే

 సులభమైన కలం

ప్రేమ పాటలు రాసినా

 కవులకు సలాం

కంప్యూటర్ కాలం

 కావ్య

ముద్రణ రాజ్యం


లక్షలో పుస్తకాలు,

 చదవడం లేదుగా

ఓప్పిక లేని జనం

కానరాని కవులూ ,

ఇదే నేటి తరం

సొంతంగా ఆలోచనలు

 లేని జనం.

చరవాణి పెత్తనం

 నేడు

 నడిపించే గుడ్డి దీపం

*****************

వెల్మజాల నర్సింహ✍🏻