ఉపాధ్యాయులు!వారంతా జ్ఞాన వృక్షాలు
 ఎదిగే మొక్కలకు విజ్ఞానం
 పంచడమే వారి పని.

             
                వెల్మజాల నర్సింహ ✍🏻

కోట్లకు అధిపతైనా

కోట్లకు అధిపతైనా
 ఆయుష్షుకు పేదోడే,
 కొడుకులు కోడళ్లున్నా
 భార్య లేకుంటే
 బంధాలకు బలహీనుడే

               

ఒంటరి జీవితం!

 

నల్లని చీకటి తెల్లని గోడలు
గోడువినే నాథుడు లేడు
దుప్పటి తోనే ముచ్చట్లు
మసక కన్నులతో ఇక్కట్లు

పది రోజుల పండుగ పెళ్ళి
కొడుకులు బంధువుల లొల్లి
అంతా సజావుగానే, మరల
కొడుకులు పట్నం పొయారు


సముద్రమంతా అనుభవం  
ఏదరికో తెలియని పయనం
 సాగుతోంది ఒంటరి జీవితం!


వెల్మజాల నర్సింహ ✍🏻