బొడ్డురాయి పండుగ

పాట!



పల్లవి :నాభిశిల రాయికి నేడే పుాజాచేయ్యా

ఊరంతా కదలాలి మల్లన్న
పూజాలే చేయాలి ఎల్లన్న

1.చరణం:
తాత తండ్రుల నుండి తలపండిన రాయి
ఊరి మద్యలో తెచ్చి ఉత్సహం  చేయ్యాగా
ఊరంతా ఏకమై ఎల్లన్న
సంబరం జరపాలి మల్లన్న..:నాభిశిల:

2.చరణం: దొరల కాలం నాటి బొడ్డు రాయి అది
ఊరు పెరుగుతూ వచ్చి
వెనకబడి పోయేన

పార్టీలుపక్కన పెట్టాన్న
పండుగే మనదాని నడవన్నా..:నాభిశిల:

3.చరణం: కులమేమి అడ్డురా
గుణ మెుక్కటే చాలు

అమ్మలంటి ఊరు బాగుకే పోరాడు!
వలస బతుకులొ వున్న మారన్న
ఊరు పయనం కట్టే  చుాడన్నా..:నాభిశిల:

:✍🏻వెల్మజాల నర్సింహ.

బట్టలకోట్టు సత్యం



మగ్గలకు పగ్గాలేసి
 ముాలన పడేసి

ఆచారం సంచీలోపెట్టి
సామాను సర్దుకోని

పని కోసం బైలుదేరే బస్తీకి
"బట్టలకోట్టు సత్యం

చదువేమే అబ్బలేదు
చేతిలో డబ్బే లేదు

అమ్మకు జబ్బేమే గబ్బవుతుంది

అలోచనతో అడుగేసేన
 బట్టల కోట్టు సత్యం

ముంబయిలో పనికోసం
ముందస్తుగా అమ్మకు చెప్పి
బస్సులో బయలుదేరే
బట్టలకోట్టు సత్యం

చద్ది ముాట చప్పగా కొట్టే
చలేమే సంకను చేరే

అమ్మను తలుచుకు కనీరైయే
బట్టలకోట్టు సత్యం

గుండెమే బరువై పొయే
అమ్మ భాద్యత యాదికి వచ్చే
బస్సులోనే భగవంతుని చేరెన
బట్టలకోట్టు సత్యం
 
*************

**వెల్మజాల నర్సింహ. ..

నిరుద్యోగం: Unemploymen




నువ్వే ఒక ఆయుధమై
నిలువుగా చీల్చు
నిరుద్యోగాని


నువ్వే ఒక నిప్పు కణికవై
నిలువుగా కాల్చు నిరుద్యోగాని

మడిదున్నుక బతుక వచ్చు

మరేందుకు నిరుద్యోగం

దేవుడేవ్వడొ రాడు

 నిరుద్యోగ భృతి తీసుకా

రాజకీయ నాయకులు
మాటల పుాటకులే

యువత మేలుకో
నిరుద్యోగాని తరుముకొ

నువ్వే ఒక యాజమనివి
కొత్త సృష్టికి ఉద్యోగివి

జీవన సమరం లో రారాజువు నువ్వే

శమైక జీవన సౌందర్యం లో
నిరుద్యోగానికి తావే లేదు

ఒడలు వంచి  కష్టిసై
నిరుద్యోగం నీదరి చేరాదు

సంక్రాంతి:@2020




అదిగో చుాడు సంక్రమణం

మకర రాశిలో పునరాగమనం

పాడి పంటల పర్వదినం
బసవన్నల పుాజదినం

బోగి పండ్లతో వచ్చేను
భొగి మంటలే కాల్చేరు


కోడి పందేల కొంటే రాయులు

సత్తు పిండితో సకేనాలు

పడతి చేతిలో పట్నల ముగ్గులు

ప్రపంచంలో మనకే సొంతం

బొమ్మరిల్లతొ చిన్నమ్మలు


రంగులలో పతంగుల గగన గింగరాలు

గంగిరేద్దుల కోలహలం

హరి దాసుల భక్తి పారవశ్యం

పండుగంటేనే సంబరాలు
🔥💥🎋🌱

పర్వదినం నాడు పెద్దలకు వందనాలు

మిత్రులందరికి
సంక్రాంతి  పండుగ
శుభాకాంక్షలు

వెల్మజాల నర్సింహ. ✍🏻

యువత మేలుకో-Wake up youth

యువత మేలుకో 
సమాజాన్ని మార్చుకో

నవయుగం కోసం

 సంకల్పం ఏంచుకో

నీ గమ్యం తెలుసుకో
లక్ష్యంతో సాదించుకో

పగటి కలలు మానుకో 
 ప్రగతి బాట వెతుకో

నీ తెలివిని పెంచుకో

సంఘం కోసం వాడుకో

చరిత్రను చదువుకో
వీరత్వం  పెంచుకో 

నీ పుట్టుక గొప్పదని 
సమాజమే చాటుకో
-వాలని 

నేడే నిర్ణయం తీసుకో 
యువత మేలుకో. .


వెల్మజాల నర్సింహ. 12.1.20

నిజమైన నేస్తాలు (True friends)

పొద్దున్నే  స్యుారుడిని కబురేట్టి  పిలిచామా

గడియారం ముల్లుకు గతమేంత అవసరం

వాన నీటికి చెరువు గట్టుకు విడాకుల బంధమేదొ

చేప కడుపులో పిల్లకు
 సముద్రంలో ఈదటం కష్టమా

ఎగసిపడే అలలకు అలసట తేలిసేన

సంసారం నడిపే తండ్రికి
సంతోషం ఎన్ని రాత్రు
లో

పగలు రేయి అని పనిగట్టుకు లెక్కేడు తామ

ఆనందం అంగిలొ వుంటే మవసరమేదో మరిచితిమ

వయసులొ వున్నా తలంపు వడలిన పనికివచ్చేన

నడుస్తున్న చరిత్ర




నీ హృదయం స్మశానంమైతే

నీ ఏద పై చదరంగ మేనొయ్

అగ్గి రవ్వల తలంపుతో
ఆనందం పొందాలేవొయ్


నీ మనసు నీండు కోవెలైతే

భక్తి మార్గం మెండుగానొయ్

 కలియుగంలో మనుషులకు

కఫటానికి కొదవే లేదోయ్

మరణానికి భయపడితే

 జీవనం ముందుకు  సాగదోయ్

భయాలను విడితే బతుకు బంధం బలపడునొయ్

ఒడిపోవడం లో
 అనుభవం గేలుపుకు దారులు తెరుచుకునొయ్

గమ్యనికి లెక్కల బదులుగా

అడుగేసి ముందుకు సాగవొయ్

గతాన్నికి గజ్జెలు కట్టి
ఆటడడం అవసరం లేదోయ్

కోట్లు సంపాదించిన కోరికలకీ
ముగింపు లేదోయ్

నిందా సుత్తి

రోజుకు పుట్టుకతో ఉషొదయం మెుదలైయొన

రోజుకు ముగ్గింపు తొ నీ వయసే తరిగి పోయేన

దీపంలొ తైలమే
నీఆయుషు పెంచేంత

నీ మరణం తరువాత
పెట్టే దీపం కొరివి తుంచేత

మంచిని పెంచిన దీపం
మరొక్కరికి వెలుగైతే

పుణ్యమనే తైలం తొ
పెంచేన నీ ఆయుషు

గాలికి పెట్టిన దీపంలా
పిల్లలను పెంచింతే

ఆరిపొతుంటే ఆపగలవా

అందుకే అంటారు పెద్దలు

దీపం వుండగానే ఇల్లు
చక్క దిద్దుకొ

వయసులొ వున్నపుడే
మంచి పనులతో పుణ్యం పెంచుకొ


నిందా సుత్తి



తెప్పలాగ తేలియాడలి

తెలుగుకు రోగం వచ్చి
ఖండాలకు వ్యాపించాలి

తెలుగుకు కాంతి వొచ్చి
దీపంలా వెలుగొందాలి

తెలుగుకు తెగువొచ్చి
తెలుగులోనే మాట్లాడాలి

మా ఊరి కోసం"


 పాట
************

పల్లవి : ఊరు చుాడమ్మ నా పల్లె చుాడమ్మ

అందాల కుందన బొమ్మ పచ్చని పల్లె సీమామ్మ


ఒ....రేల రేలారే......
రెళ్లు పువ్వు లో  దుప్పెల్లి


చరణం :ఘడ్డీల పాలనలో జీతలతో గడిపిన

బతుకు దెరువు కోసమని బస్తీ లో బతికిన

ఊరు పై మామకారం ఉవ్వేతు పొంగేన

సన్న జాజి పువ్వు వలె గుండెలో ఒదిగేన

ఒ....రేల రేలారే......
 రెళ్లు పువ్వు లో  దుప్పెల్లి

చరణం:ఎల్లమ్మ నదితో నే పంటలను అనుకుంటే
కడుపున ఆకాలిని తీర్చేటి ముాసినది వుండే న

సబండ జాతి  కొలిచే దేవత ఎల్లమ్మ

పతి సంవత్సరం పండుగ ఘనంగా జరిగేన

ఒ....రేల రేలారే......
రెళ్లు పువ్వు లో దుప్పెల్లి


చరణం: ఎర్ర గద్దె కాడ
ఎప్పుడు చుాసిన
పదిమందికి ఎక్కువనే  కుర్చొనే వుందురా

అంబేద్కర్ విగ్రహం అయేనా ఊరికి మధ్య

హనుమన్ గుడిలో
నిత్యం పుాజలు


చరణం. .కొత్త చెరువేమేా
కొప్పుల ఊరికి

నిండ నిండిదొ పంటలకు కొదవా లేదు

తాటి వనం కాడికి
చుట్టం తొ పొయేవా

కడుపు నిండ  కల్లు
వనమే ఇచ్చేన

గాలం పట్టుకొని ముాసికి
పొయేవా

ముాడు పూటల ముసురు కొని తినవచ్చు ఒ....రేల రేలారే......
రెళ్లు పువ్వు లో దుప్పెల్లి

చరణం: మసీదు బండపై కొలువైన కంఠమైయా

కొలచిన వారికి కొంగు బంగారమాయెనా

పొచ్చమ్మ, ముత్యాలమ్మ కఠ మైసమ్మ

ఊరిని కాపాడే మావురాల ఎల్లమ్మ


తల్లుల కొలువంగ చల్ల గా చుాసేన

ఊరు చుాడమ్మ నా పల్లె చుాడమ్మ

సరదాకి @వొడ్కొ

రాత్రి  తాగిన వొడ్కొ
ఇంకా లేవలే పడక
ఉదయైంది కొడకా
కొత్తగా వచ్చింది పొరక్క
కలగా వచ్చింది పండుగ
తాగింది పొయింది దండుగ
అయ్యే రామా ఏమిటి
ఈ తాగుడు కర్మ

నుాతన సంవత్సరం


ఆదేదొ మాయ, మనలో కొత్త ఉత్సహం ...

కొని గంటలే కాని  నరాలు జీవ్వు మనే సంతోషం

ప్రపంచమే పరమానందంతొ ఆటలాడును

మద్యంతో  నాట్య మడును

నిద్ర పోకుండా చిందులేసేను

పుాజలో కోందరైతే ,పుచ్చుకోవడం లో కొందరు

కొత్త వాగ్దానాలతొ కోందరైతే, గొంతెమ్మ కోర్కెలతొ కొందరు

కిక్కుతొ కోందరైతే, భక్తితొ కొందరు

క్యాలెండర్ పంచాంగం తొ కోందరైతే, బాతాఖానీ తొ కొందరు

లెక్కలతొ కోందరైతే,ఆశతో కొందరు
నవ్వులతొ కోందరైతే,
నమ్మకంతొ  కొందరు


వయసుతొ సంబంధం లేదు

చలితో చణువే లేదు

అదేకదా మనందరి సంతోషం

నుాతన సంవత్సర స్వాగతం

శుభాకాంక్షలతో @ 2020

✍🏻మీ..వెల్మజాల నర్సింహ.
 
01.01.2020