చిన్నప్పటి మిత్రుడు

 మధ్యాహ్నం ఒంటి గంట

కావస్తోంది కడుపులో ఎలుకల పరుగులు  మెుదలైనవి.

అప్పుడే వచ్చిన ఫొన్ మీరు మా ఆఫీసుకు రాగలరా పది 

నిముషాలలో.

సరే తొందరగా పని ముగించుకుని వచ్చి లంచ్ బాక్స్ 

తినవచ్చు లే అని 

నాలో నేను అనుకొని 

బయటకు వెళ్ళాను. 


లాక్ డౌన్ వచ్చి ఆరు నెలలు కావస్తోంది. 

మాస్క్ పెట్టుకొని  బయటకు 

పోయి

 ఆటో కోసం వేచి వున్నాను 

ఆటో మన సమయానికి రాదు. 

 *నీవ్వు ఎక్కవలసిన బస్సు  అది నీజీవిత కాలం 

మీస్సు అని ఆరుద్ర గారి మాట 

అనుకుంటు వుండగా ప్రక్క జేబులో 

ఫొన్ కుదురుగా వుండదు. 

ఎక్కడ వున్న ప్రక్కనే నువ్వే పాట ఫొన్ లో

 రింగ్ టోన్ మ్రెాగుతుంది

చూస్తే బాస్. 

యస్ బాస్, ఒకే బాస్ 

సాయంత్రం వరకూ ఇ-మెల్ పంపుతా అని  

చెప్పి ఫొన్ కట్ చేసి

వెంటనే జేబులో వేసుకున్నాను. 


రాదు- రాదుగా ఆటో అనుకుంటునే తడవుగా 

ఆటో వచ్చింది. 

ఎమ్. ఐ.డి.సి.అదానీ ఆఫీసుకు ' చలో అన్నాను. 

ఆటో వాడు గేట్ ముందు 

ఆటో ఆపిండు, వారికి డబ్బులు ఇచ్చి 

గేట్ దాటి లోనికి ప్రవేశించిన నాకు

చుాస్తే చాలా పెద్ద భవంతి 

అద్దలతొ ఎండకు తళ తళ మెరుస్తుంది .

ముంగిట వాచ్ మెన్ దగ్గర రిజిస్టర్ లో పేరు 

మొబైల్ నెంబర్ రాసి 

మెుదటి అంతస్తు లోకి

 

వెళ్ళినా నాకు ఎవరు మనుషులు కనిపించ లేదు. 

వరండా విశాలంగా పెద్ద పెద్ద కుర్చీలతొ వుంది 

రెండవ అంతసు నుండి 

గుసగుసల శబ్దాలు వినబడుతున్నాయి 

కొంచెం భయం గా అనిపించింది

అటు ఇటు చుాస్తే ఎవరు కనిపించారే 

అని మనసులో అనుకుంటునా. 

రెండవ అంతస్తు పైకి

పోయే ద్వారం దగ్గర 

నిలువెత్తు అంబేడ్కర్ 

ఫొటో ఒకటి కనిపించింది.

మనసుకు ప్రశాంతంగా 

అనిపించింది. 

చిన్నప్పటి మిత్రుడుని 

చుాసిన అనుభుతి కలిగింది.  

ఎవరు లేకుంటే ఏమిటి 

 అని చిన్నప్పటి ఙ్ఞాపకాలు నెమరేసుకుంటూ 

కుర్చీ లో సాఫీగా కూర్చున్నాను. 

నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఊరి మధ్య లో వున్న 

అంబేడ్కర్ విగ్రహం చుట్టూ పిల్లలంతా కూర్చొని ఉదయం,

 సాయంత్రం కబుర్లు చెప్పుకునే వాళ్లం. 

అలా అంబేడ్కర్ విగ్రహం కానీ ఫొటో కానీ చుాస్తే 

 చిన్నప్పటి మిత్రుడులా ధైర్యం వస్తుంది. 


**********************

వెల్మజాల నర్సింహ.10.10.20