పూర్వ జన్మ సుకృతం"

కథగా కల్పనగా
 సాగేనా మన జీవనం

కడుపు నింపడం కోసం
 కష్టం సుఖం కావడి

గతం ఒక పాఠంగా గమ్యం
సాగేనా
ముందుకు

సందుంటు ఏమి లేదు
సంసార నావ  సాఫీగా
సాగడానికి

భూమికి   లేదు ధనిక ,పేద
 
మనుషులకు ఎందుకో
కులం గొడవ?

ఏ పుట్టలో ఎముందో !
 స్వార్థపువాంఛలు నరులకే ఎందుకో

  రేపటి రోజుకు లెక్కేంటి?

వేసే అడుగుకు ఇతరుల
సలహా ఎందుకు

నీవు రాసే రాతకు విలువెంతో

నీ జీవితమనే గుడికి
నీమనసే తాళపు చెవి

ప్రతి మంచి పనికి చేబుతావు

పూర్వ జన్మ సుకృతమని

కరోనా నామ సంవత్సరం!
కాలానికి కళ్లెం వేసి
 కవితోకటి రాసేద్దామా

శర్వారి నామ సంవత్సరాని
 కరోనాగా పిలిచేద్దామా

గృహానికే అంకితమై గంటలను లెక్కిద్దామా

కరోనా వైరస్ తో
 ప్రపంచమే కకావికాలం

ఆధునీకరణ అక్కెరకు
 రాని చుట్టం
పాత పద్దతులకే పట్టం

రోజు రోజకు పెరుగుతున్న భ‌యం
నయం కాని నయా రోగం

దిక్కుతోచని  దేశ పాలకులు
మాటే వినబడాని
మహా బాబాలు

నిత్యా కులీలా పొట్టకు వేటు
కనికరించాని దైవ కణం

పురోగతితో ఆధోగమనం
అంటువ్యాధులతో
 జనం అయోమయం

కాలానికే పరీక్షల కాలం
వేచి చూడాడమే
తప్పని వైనం

మానవ జన్మ!


దీపం వెలుగుతోంది
 దేహం సాగుతోంది
హద్దులు ఏమంటే?
పుట్టుక దాని మరణం!

కోపం పెరుగుతోంది
సహనం తగ్గుతోంది
సమాజంలో నీగౌరవం
గర్వంగా మారుతోంది

ఆకాశం హద్దుకాదు
మితిమీరిన ముద్దుకాదు
అవకాశం వరం కాదు
 కాలం గుణపాఠం కాదు


నీలో నువ్వు ఒక ప్రత్యేకం !

నీకే నువ్వు ఒక వారధి, సారధి !
పదిమందిలో నీవు కాదు
పదిమందికి దిక్సూచి

ఇదే మానవ జన్మ
నిత్యం! సత్యం!

నవ పంచాంగం !


కరణం గారి కూతురు
కరవాలం లాగ చూపులు
 కురులకు కుచ్చుల ఫగిడి
కంఠం కనకపు భరణం
కరములకు కంచుక  కడియాలు
కండ్లలకు కాసింత కాటుక
కాలం ముందే బయళ్ళు దేరే
నవ పంచాంగం తేవడానికి

ప్రతి రోజు శుభోదయమే

బానుడి కిరణాలు ధరణి
చుంబన వెలా

సిగ్గుతో సిగ్గరి పువ్వు రెమ్మలు
తుంపర జంపాలు చేసే వెలా
కందిపోవున సుకుమారి
ధరణి నా కిరణాల తపంకు

కదిలే కాలంకు ప్రతి రోజు
శుభోదయమే


వెల్మజాల నర్సింహ ✍🏻
 
巴努的光芒是陀罗尼
接吻时间

害羞的花芽

表演 Tumpara Jampa 的时间

Kandipovuna Sukumari
陀罗尼是我的希望之光

搬家期间的每一天
早上好
 
 
维尔马贾拉纳西姆哈
 
 

కరోనా!Corona

ఆణుబాంబు కాదది
కనిపించని వైరస్

ప్రపంచ యుద్ధం కాదది
ప్రాణభయం దానితో

సొషల్ మీడియా పుణ్యం
 ఏది నీజమెు నమ్మని జనం

తప్పుడు వార్తలతొ
T V'ల యాజమాన్యం

తప్పని తిప్పిలు సామాన్యుడికి
మాస్కులు ముాతికి మనుషులు కోతిల

కరచలనం వద్దు
నమస్కారమే సంస్కారం

మరణం అంచున మనుషుల చదరంగం

ప్రపంచమే కు గ్రామం
 కరోనా!ప్రాణభయం

పరిసరాల పరిశుభ్రతా
నీ భద్రతా

భయపడితే మరణం
ఐక్యంగా పోరాడితే

కరోనా పై కరవాలమే
 
******************

వెల్మజాల నర్సింహ ✍🏻

బావను పచ్చని పొలాలలో వెతుకుతూ మరదలు పాడే సరదా పాట


పల్లవి:చెరువు కింద
గిలక  బావి

బావి పక్కకు చింత చెట్టు

 చింత తొర్రలొ చిలకామ్మ

నా బావ జాడ చెప్పామా(2)

:చెరువు కింద :

చరణం:  చెరువు పక్కకు
గుబురు కంచే
కంచేలొపల కముజు తాత

కముజు తాత పలుకుమా

నా బావకు కబురేట్టుమా

జొన్నచేనులొ కంచే రేగి
కంచే రేగి పై గిజిగాడా
గిజిగాడా నా మాట వినవా

నా బావ ఎక్కడొ జర చెప్పుమా
                         ":చెరువు కింద "

చరణం: పల్లె రేగడి కాయలేమే
పడుచు
 కొనేనా బాట మెుత్తం

పడుచు జంట పావురాలు
బాటలో సై ఆటలడు తుండే

మంచి చుాపే పాల పిట్ట
కంటికి కనబడాదాయే

మామిడి పిందే పై కొయ్యిలా
నా బావ నీకోసం వచ్చేన

          :చెరువు కింద :

చరణం: వరిచేలలో
వెంకీ పిట్ట

పిల్లగాలికి మనసు జల్లున

మోటార్ వేసే బావయ్య
 నా గుండె నిండ నువ్వ య్య

పంచే కట్టులొ బావయ్య
పంచి ఇచ్చేదా
 ప్రేమయ్య

:చెరువు కింద :

వెల్మజాల నర్సింహ ✍🏻

గడ్డి కొసేటి బావతో మరదలు! (పాట-15)పల్లవి:పచ్చిగడ్డి కొసేటి
 పచ్చిగడ్డి కొసేటి

పర్వతాలు బావ. ..
పర్వతాలు బావ. ..

గడ్డి మెాపు ఏత్త గంగాని
 పిలువు

నా పేరెటి పెట్టి పిలువు

లేలేత గరకలొ గురక చపుడే
గుబులైయే బావ

కుందేలు కూర్చోని గడ్డి
తింటున్నాది
సై ఆట ఆడుతున్నాది

: పచ్చిగడ్డి :

చరణం :వరిచేల మధ్యల వగలడిని చుాడు

గొల్లభామని చుాడు

నా కడియాల చపుడుకు
కదలకుండా వుండే
కన్నుమిటుతుండే
:పచ్చిగడ్డి :


చరణం: ఒడ్డొరం మద్యలో
పద్మల
గడ్డి పరవళు తొక్కే

నా పట్టు పరికిణీ చుాసి

పాల కంకులు పాల కంకులు

పడుచు పరికిణీపై
 వరుగభొయేన
వలపు బాణం వేసేన

:పచ్చిగడ్డి :

చరణం:నీళ్ళ కాలువ మధ్య
నిలుచున బావ
నిలుచున బావ

నీ వేళ్లు పట్టుకు పొలు తిరిగుతా బావ

నాను యేలు కున్నేవా

  :పచ్చిగడ్డి  :

అక్కరకు రాని చుట్టామా!ఆందోళన ఆప్తుడై నిన్నటి
  రోజును తీసుకు  వచ్చునా

ఆందోళన దైవమై ఈరోజున 
శుభములౌవున

ఆందోళన జాతకమై రేపటి
 నీ తలరాతనే మార్చున

ఆందోళన సందేహమై
గుండె పొట్టుకు గురి పెట్టును

ఆందోళన  అవసరమా
అక్కరకు రాని చుట్టామా

పల్లే హొలీ

వసంత ఆగమన హొలీ
మెాదుగ పువ్వుల కేళీ

వీరన్న బలి కొడే
 వీరగంధం పూసుకొని
హొలాడా అరుదేంచే

జాజిరి జాజిరి కోలటం
పిల్లలచే పాడించ

హొలీ రంగుల పాటలు
బావ మరదలు సై ఆటలు

నాజుకు  పువ్వుల
రంగులు

పల్లెలో హొలీకి చేసేరా
సందడి

తాటి కల్లుతొ తందాన
చెరువు చేపలు తిందాము

పశువుల శుద్ధి నేడేగా
రంగులతో పల్లే జోరేగా

మహిళా దినోత్సవం"అందుకే. .!Woman's day-That's why

తను మరణం అంచులు చుాసి
మరో జీవికి జన్మ నిచ్చును

తన రక్తం చనుబాలై
పసి బిడ్డను  పెంచేను

అమ్మగా ఒక రూపం
ఆలి గా మరో రుాపం
ఆది గురువుగా అవతరం
అన్నపుార్ణ గా మమకారం

నీ ఎదుగుదలలొ వెన్నెముక

నీను సుఖ పెట్టడంలో
 అప్సరస

నీ కష్ట సుఖాలలొ
సగభాగం

అందుకే!

అమ్మను పుాజించు
ఆలిని ప్రేమించు
ఆడవారిని గౌరవించు
 
************

నర్సింహ వెల్మజాల ✍🏻