అంతం లేని కథ వుంటుందా

 అంతం లేని కథ వుంటుందా

పందెం లేని ఆట వుంటుందా 

స్వార్ధం  లేని ప్రేమ వుంటుందా

ఆశ లేని జీవి వుంటుందా 

నిశా లేని పగలు వుంటుందా

మరణం లేని జననం వుంటుందా

జేబుకు పెట్టిన జెండా

  పల్లవి:జేబుకు పెట్టిన జెండా

జనం గుండెలో నిండా

వందేమాతర పిలుపు  

మనందరి బాధ్యత  తెలుపు 

త్రివర్ణ వర్ణపు జెండా 

నేడు రెపరెపలాడే చుాడు 

 వందేమాతరం... వందేమాతరం 


చరణం: 

అంగడి పాట

పల్లవి: ఆదివారం అంగడి 

ఆటో బస్సుల సందడి

బావ పోదామా అంగడి 

సంతలో చుాడ సందడి(2)

                                                                                  :ఆదివారం"


చరణం: వారం వారం అంగడి 

ఆటో అన్నల సందడి 

అమ్మ అక్కల అంగడి 

అందమైన సింగిడి 

బావ పోదామా అంగడి 

పట్టు చీరల సందడి (2)


                                                                      :ఆదివారం  :

చరణం :నగలు నకిలేస్స్ ల అంగడి 

ముత్యాల దండల పందిరి 

బావ పోదామా అంగడి 

పండుగ సామానులకై సంతకి (2)


                                                :ఆదివారం :

కృష్ణాష్టమి -పాటపల్లవి:బుడి బుడి అడుగుల కిష్టయ్య 
మేము పిలిచినా వెలా రావయ్య 

ద్వారకా నగరిలో నువ్వు య్య 

మా ద్వారం తెరిచితి 
రావయ్య

చరణం: చిన్ని పాదాల కిష్టయ్య 

మా చింతలు తీర్చ రావయ్య
పాయసం వండితి రావయ్య

మా పాపాలను కడుగేయాయ్య

                                                        :బుడి బుడి:

చరణం: అటుకుల కాలం కాదయ్య
కుచేలుడు ఇక్కడ లేడయ్య 
వెన్న దొంగవని నేను 
అనానైయ్య 
గోపికనై పిలిచితి నైయ్య

                                                               :బుడి బుడి: 

చరణం: గీతను చెప్పిన కిష్టయ్య 
మా తల రాతలు మార్చ రావయ్య 
బుడి బుడి అడుగులు వేయ్యయా 

మాఇంటిని నందన వనం చెయ్యయా

వెల్మజాల నర్సింహ. 9.8.20

కొత్త లుంగీ కట్టి :పాట

పల్లవి: కొత్త లుంగీ కట్టి కట్ట పైన 

కదిలేటి బావయ్య 

నన్ను ఒక సారి చుాడయ్య 

గట్టు మీద గడ్డి పరకలు 

గుబురుగా వుండే బావయ్య 

నా గుండె లదిరే రావయ్య 

:కొత్త లుంగీ కట్టి:

చరణం :కట్ట పైన కముజు పిట్ట క

లవర పెట్టె బావయ్య 

నా గుండెలదిరే రావయ్య

 వరి చేల ఎండ్రిగాడు 

నా ఏంటా పడే చుాడయ్య 

నీవు కట్ట దిగి రావయ్య 

 :కొత్త లుంగీ కట్టి:

చరణం: మిణుకు మనే 

మిడతలు 

వరి చేలో ఉడుతలు 

తాటి మీద కోతులు 

టిక్ టిక్ మని పిట్టలు 

నేను తట్టుకోలేక వున్న బావయ్య 

కట్ట దిగి రావయ్య 


:కొత్త లుంగీ కట్టి:


చరణం: మేన మరదలని అలుసా 

కొత్త లుంగాని బిరుసా 

నా గుండె నిండా నువ్వుయ్య 

నన్ను కట్ట పైకి తోలుక  

 పోవయ్య

 :కొత్త లుంగీ కట్టి :

********

వెల్మజాల నర్సింహ

స్నేహితులు


స్నేహితులు ఎంతో మంది
 జీవితంలోకి వస్తుా పోతుంటారు 
కానీ చిన్నప్పటి బడి
 దోస్తులే బ్రతుకంతా గుర్తుంటారు