పల్లవి: కొత్త లుంగీ కట్టి కట్ట పైన
కదిలేటి బావయ్య
నన్ను ఒక సారి చుాడయ్య
గట్టు మీద గడ్డి పరకలు
గుబురుగా వుండే బావయ్య
నా గుండె లదిరే రావయ్య
:కొత్త లుంగీ కట్టి:
చరణం :కట్ట పైన కముజు పిట్ట క
లవర పెట్టె బావయ్య
నా గుండెలదిరే రావయ్య
వరి చేల ఎండ్రిగాడు
నా ఏంటా పడే చుాడయ్య
నీవు కట్ట దిగి రావయ్య
:కొత్త లుంగీ కట్టి:
చరణం: మిణుకు మనే
మిడతలు
వరి చేలో ఉడుతలు
తాటి మీద కోతులు
టిక్ టిక్ మని పిట్టలు
నేను తట్టుకోలేక వున్న బావయ్య
కట్ట దిగి రావయ్య
:కొత్త లుంగీ కట్టి:
చరణం: మేన మరదలని అలుసా
కొత్త లుంగాని బిరుసా
నా గుండె నిండా నువ్వుయ్య
నన్ను కట్ట పైకి తోలుక
పోవయ్య
:కొత్త లుంగీ కట్టి :
********
వెల్మజాల నర్సింహ
No comments:
Post a Comment