Duppalli Sri Renuka Yellamma Festival - దుప్పల్లి ''శ్రీ రేణుక ఎల్లమ్మ పండుగ ప్రత్యేకత.

 రేణుకా హృదయానందం
 భృగవంశ తపస్వినం
 క్షత్రియాణాం అంతకం పూర్ణం
 జమదగ్న్య్ం నమామ్యహం!

సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలి కలయికే పండుగ. సాధారణంగా పండుగలన్నీ ఏదో ఒక దేవుడు లేదా దేవత ఆరాధనకు సంబంధించి జరుపుకోవడం మన ఆనవాయితీ.


పల్లె తల్లులు – గ్రామ దేవతలు

గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటువ్యాధుల నుండి రక్షిస్తూ, పంటలు పచ్చగా ఉండేలా దీవిస్తూ, ఊరిని భూతప్రేతాదుల నుండి కాపాడుతూ పొలిమేరల్లో సదా కాపుకాసే దేవతలే ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మారమ్మ, పోచమ్మ మొదలైన పల్లె తల్లులు.

 శ్రీ రేణుకా ఎల్లమ్మ’ నామ విశిష్టత
హేమలాంబ నుండి ఎల్లమ్మగా: ‘హేమలాంబ’ (హేమం అంటే బంగారం, బంగారుతల్లి) అనే సంస్కృత నామమే, గ్రామీణుల వ్యవహారంలో కాలక్రమేణా 'ఎల్లమ్మ'గా స్థిరపడిందని పండితులు విశ్లేషిస్తారు.

రేణుక అంటే పుట్ట: ‘రేణుక’ అనే మాటకు పుట్ట అనే అర్థం కూడా ఉంది. పూర్వకాలంలో అమ్మవారి ఆలయ పరిసరాల్లో పాముల పుట్టలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ పేరు వచ్చి ఉండవచ్చు.



  
దుప్పెల్లి – ప్రత్యేకమైన రైతుల పండుగ
తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని దుప్పెల్లి గ్రామంలో జరిగే శ్రీ రేణుకా ఎల్లమ్మ పండుగ ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక రైతుల పండుగ.

ప్రత్యేకత: సాధారణంగా ఆలయాలు వేరేలా ఉంటే, ఇక్కడ ఒక వ్యవసాయ బావినే గుడిగా మలచడం ఈ క్షేత్రం యొక్క అత్యంత అరుదైన ప్రత్యేకత.

ఉత్సవాల వైభవం & బోనాల సమర్పణ
సమయం: ప్రతి ఏటా ఆగస్టు నెలలోని రెండవ వారంలో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

బోనం ఆచారం: 'భోజనం' అనే పదం నుంచే 'బోనం' అనే మాట వచ్చింది. మహిళలు భక్తిశ్రద్ధలతో వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం (కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన నైవేద్యం) మట్టి లేదా రాగి కుండలలో సిద్ధం చేస్తారు.

అలంకరణ: బోనం కుండలను వేప రెమ్మలు, పసుపు, కుంకుమ, కడి (తెల్ల ముగ్గు)తో సుందరంగా అలంకరించి, దానిపై ప్రమిదలో దీపం వెలిగిస్తారు.

ఆలయానికి ఊరేగింపు: తలపై బోనం ధరించిన మహిళలు, డప్పు వాయిద్యాలు మరియు ఆటగాళ్ల కోలాహలం మధ్య భక్తిపరవశంతో ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పిస్తారు.

భక్తుల ప్రవాహం
ఈ పండుగకు కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర (ముంబై), తమిళనాడు (చెన్నై) వంటి ప్రాంతాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు


రామాయణంలోన ఒక పేజీ
రాశాడు వాల్మీకి అమ్మ చరితం!

పేదల పాలిట పెద్దమ్మవు నీవై,
పల్లెలను కాపాడే ఎల్లమ్మవు నీవే!

ఊరి తల్లులకూ బిడ్డవు నువ్వే,
కోరికలు తీర్చే మాతంగివి నువ్వే!

జమదగ్ని ముని కోపానికి బలియై
అడుగడుగునా పొందావు అవమానాలెన్నో!

పరశురాముని తల్లిగా నోచుకొని,
ఆ తనయుని చేతిలోనే మరణాన్ని పొంది...

తిరిగి జన్మించిన మహాతల్లివి నువ్వే!
మా కష్టాలు తీర్చే లోకమాతవు నువ్వే

*****


మీ...

వెల్మజాల నర్సింహ
తేది:23-8-2016, మంగళవారం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి