.పచ్చని మెుక్కలు పైపైన పిచ్చుక
వెచ్చని గాలికి ఎగిరేనా గగనంలొ
కాంకులలొ గింజలను పింఛంతొ ఆడిస్తుా
పంట చేలలో పట్టణాలలో ఎక్కడ
చుాసినా అక్కడ మీరే
.గడ్డి పుల్లలతో గుాడు నిర్మింప
గాలి ఊపుకే కులేన
నీగుాడు చుాడ బ్రహ్మాకైన రిమ్మ తిరిగేన
ఊర పిచ్చుకి, గోరంత పిచ్చుక
గొప్ప ఇంజనీర్ నీవంట
.ఏనిమేలియా రాజ్యం
పేసరిడే కుటుంబం
పేరంటాలు రోజంతా
గుంపు గుంపుగా
వనభోజనాలు మీయాంట
పాల కాంకుల పాలు తాగుతూ
పారవశించేన గోరు పిచ్చుక
నది జలాల పై వంగిన చెట్టె
నవ పిచ్చుకకు పురుడు పొసేన
.ఈదురు గాలితో వచ్చిన వానలో
కొట్టుకు పొయేన చెట్లని
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం
లాగా పిచ్చుక గుాడే చెదిరెన
గుండె నిబ్బరాన్ని కొల్పొక మళ్ళీ గుాడు నిర్మించెన
***********
..
No comments:
Post a Comment