నా చిన్న నాటి ఆటలు


 
 
కొమ్మకు పూసిన పువ్వుల లేలేత ప్రాయం

అమ్మ చనుబాలతొ పెరిగిన కాయం

సిరగొనే ఆటలతొ
కోతి కొమ్మచి పాటలతో

పెరిగిన మా బాల్యం బంగారమే కదా. ..

.పొద్దున్నే గొళ్లిల ఆటలతొ

సాయంత్రం గిజిగాడి పాటలతో

సీమసింతకాయ వగరుతొ

చెడ్డికి వున్నా రెండు చిల్లులతొ గడిచిన మా కాలం. .

ఒంటి పూట బడి
కంటికి వుండదు నిద్ర

ఇదమ్మ బావిలో ఈత

ఇంటికి వచ్చినంక వీపు పై దెబ్బల మెాత

మరవరాని మాబాల్యపు గురుతులు.

.తాటి ముంజల జోడి

తరగదు తుమ్మల బంక

అష్టచెమ్మ ఆట ఆడితే
తెలవదు టైమేంతొ

ఆ..ఆటలు కనుమరుగైయేన. .

5.వీడియో గేమ్స్ ఇచ్చెన అ.. ఆనందం

ఆలొచించాలి మనమందరం

బయటి ఆటలతొ బాల్యపు గొప్పదనం

బాలల బంగారు భవిష్యత్తు కై
 

*******

వెలుమజాల నర్సింహ.

1 కామెంట్‌: