మహా శివుడు "(Maha Siva)

శివుడుకాడు దేవుడు
శివతత్వం కాదు మతం
శివ కేశవులు వేరుగా లేరు
లింగం కాదు పూజించుకునేది
నీ ఆత్మ లింగంమే
నీకు పుాజనీయం
శివుడంటే ఆదర్శం
శివతత్వం ఆచరణ
మనిషి మనుగడకు
దిక్సూచి
సంపాదన కాదు సమాజం
బిక్షాటన తొ నిరూపించే
సంసారం ప్రాముఖ్యత
అర్థనారీశ్వరుడై చాటి చెప్పే
పులితోలే కవచంగా
సాదాసీదాగా జీవించే

  బొళాశంకరుడు
కాదు శివుడు

కోరిన వారి కోర్కెలు తీర్చ
తండ్రియే కాదా వారందరికీ

నమఃశివాయ అనగానే
అయ్యగా ఆదుకొను

యెాగ ముద్రనే జీవితమని
భొగాలనే వదలమనే

వ్యకిత్వం వికాస పురుషుడిగా
జనంతొనే మనంమనే
గరళం కంఠమందున
గంగను పంచే మనందరికీ

చివరకు మిగిలేది బూడిదని
పరమ సత్యం గ్రహించిమనే

శివుడు కాదు దేవుడు
మహా శివుడు

శుభోదయం మిత్రమా - Good morning Friend


శుభోదయం మిత్రమా
చుాస్తు వురుకొదు కిరణామా
కదిలే కాలం గమనమా
కనిపించే రవి నిత్యమా

పగలు పనితో జీవనమా
రాత్రిరి మేలుకువ అవసరమా

నిద్రే నీకు సుఖమా
వేకువఝామునే లేవుమా

ఉదయం నీవు కుశలమా
 పలకరింపే మరువకుమా
బంధం జన్మకే పరిమితమా

బాధ్యతతో రోజు చెప్పుమా
 శుభోదయం మిత్రమా

కెరటానికి ఆలసట లేదు

కెరటానికి ఆలసట లేదు
హృదయానికి బదులే లేదు
కాలానికి మలుపే లేదు
తలంపుకు వయసే లేదు
మరణానికి మందే లేదు
మంచికి వంచెన లేదు
పంతాలకు పొంతన లేదు
గగనాన్నికి హద్దే లేదు
గమ్యన్నికి ఆలుపే లేదు

పం "కడలిపాదం



నిప్పుల కొలిమిలో
కరిగిన  ఇనుము
పొందేన చక్కని రుాపం

మీనాలను భుజించుటకు
కొక్కేర చేసేన జపం

ఉషొదయం కోసం
పొద్దు తిరుగుడు
ఉండేలే తపం

సోమరి వాడు పని
తప్పించుటకు వెతికేన నెపం

జలకాలాటలొ మునిగి
 తేలితే వచ్చేన కఫం

ఆడంగి మగవారిని
పిలిచేదురు లఫం


నడి ఎండలొ నాట్యమడితే
వచ్చేన తాపం

తనకంటె చిన్న వారిపై
చుాపెదరు కోపం

దైవకణం"Divine Cell"



దైవకణం నేలకు వచ్చి అక్షరమై మొలకెత్తేన

మొలకెత్తి ఆకులు తొడిగి
ఆకాశమే అలుకుపొయే

ముాగభాషతొ ముచ్చటపడి

 ముల్లోకాలు  వ్యాపించేన

జ్ఞానమే విత్తనమై పదిమందికి
పనినిచ్చెన

దైవకణం అక్షరమై
తలంపుకు తాళంతీసే

నాగరికతకు నాంది
పలికి
విజ్ఞానం పెంపొందించే

జాబిల్లితొ జత్త కట్టి
భుాగొళం చుట్టి వచ్చేన

దైవకణం అక్షరమై
పొత్తముగా పెంపొదేన
చరిత్రనే ముద్రించి
భావితరాలకు అందించేన

దైవకణం అక్షరమై
అజ్ఞానం తొలిగించేన

జ్ఞానమనే భాండగారంతొ
సంతోషనే పంచేన

అంబేద్కర్- అందరివాడు -Dr. BR Ambedkar- everyone



అంబేద్కర్ కాదుగా  ఆలయంలో దేవుడు
పూజలతో కాదుగా  పునీతమైయేదీ

 అవమానమే ఆయధంగా మలిచిన వాడు
అంటరానితనాని మంటలలో వేసినా వాడు

అంబేద్కర్ కాదుగా  ఒక జాతికి పితామహుడు

సకలజనుల
 మేలుకోలుపిన  సుార్యుడు

ఫొటో పెట్టుకు పూజలు చేస్తే
పెరిగేన నీ జ్ఞానం

మనవాడేనని డప్పులుకొట్టితే వచ్చేన సమానత్వం

చదివే తన ఆయుధమని
సమాజానికే సమాధానం చేప్పి

రాజ్యంగానే రాసిన గీతా చార్యుడు

అంబేద్కర్ కాదుగా అణాగారిని కులంవాడు

పెన్నుతొ రాజకీయాలను
పెకిలించిన వాడు
అంబేద్కర్ కాదుగా  ఒక వర్గం వాడు

భారత యువతకు చదువుల గురువే వారు

అంబేద్కర్ కాదుగా  విప్లవజ్యోతి

మేధావులకే గురువైన  విజ్ఞానజ్యోతి

కవిత్వo! (Poetry)



ఊటబావిలా ఉరిస్తావు
ఉహకందని నీరిస్తావు
కలలో నువ్వే  కవ్విస్తావు
 కనిపించక మురిపిస్తావు
మస్తిష్కంలొ కల్లోలం సృష్టిస్తావు
పదిమందిలో మెప్పిస్తావు
నలుగురిని నవ్విస్తావు
చదువుల బడినె
వలెస్తావు
పిల్లల కోసం తల్లి వౌతావు
తెలుగు కవుల సరిగమలౌవుతావు
కవిత్వమా కాసేపు కవ్వించుమా. .


రాగాలలో గానమౌతావు
రాసే యువకుల ప్రేమౌవుతావు
విరహం, సరసాలాలతొ
సాదిస్తావు
అవధానలతొ అలరిస్తావు
అష్ట దిగ్గజాలనే ఆటాడిస్తావు
కవిత్వమా కాసేపు లాలించుమా

కాలం పరిగెడుతుంది!

కాలం పరిగెడుతుంది
 రెండు చక్రాల బండిలో
వెనుకంజ వెయ్యాని
 రేయి పగలు చక్రాలతొ

కాలం పరిగెడుతుంది
ముాడు కాలాలలో
వేసవి శీత చలి వర్ణాలతొ

కాలం పరిగెడుతుంది
కష్ట సుఖాలతొ
కాడికి రెండేద్దుల
జీవిత పోరాటంలో

కాలం పరిగెడుతుంది
తన గమ్య దారిలో
దారి తప్పిన వారికి
 గుణపాఠలతొ

కాలం పరిగెడుతుంది
జనన మరణలతొ
పుట్టుట గిట్టుట కోసమై

కాలం పరిగెడుతుంది
మంచి చెడులతొ
చేసుకున్నా వారికి
 చేసుకున్నంతలొ

కాలం పరిగెడుతుంది
మహానుభావులతొ
వారి కోసం వచ్చే
సుార్య చంద్రులతొ

కాలం పరిగెడుతుంది
తన పరిధిలో
నిను నన్ను పరీక్ష పెడుతూ. .