ఊరకనే !

ఉడకపోత మా ఇంట్లో ఫ్యాన్ మోత
చరవాణి లో  మీడియా కథలు
అయోమయంలో అందరూ చిందులు
మా గల్లీ లో డీజే కూత
అది చేరాలి ఢిల్లీకి తాత

ఉదయాన్నే వాట్సాప్ లో గోలగోల
ఫేస్బుక్ లో ముఖాలు తలతల
నెటుంటే ఫోన్ తో కలకల
డేటా అయిపోతే మనసంతా విలవిల

ఆకాశంలో చుక్కల లెక్క
ఎప్పుడూ తీరునో సందేహం అక్క
రామారావు ఇంటి దగ్గర కుక్క
అది ఊరకానే మొరగదు పక్క 



వెల్మజాల నర్సింహ ✍🏻

నేటి బతుకు చిత్రం

ఎంప్లాయీస్ ఎదలో వేట
నెలజీతం డబ్బుల మూట
ఖర్చులా నోరు తెరిచిన బాట
కష్టంగా గడుపుతున్న పూట
మధ్య తరగతి మనుషులమాట 

*************

వెల్మజాల నర్సింహ

జీవితమంటే ?

 

 

 

 

జీవితమంటే
ఆత్మకథ లాగా అందమైన
 పుస్తకమేమి కాదు

ఎన్నో ఆటుపోట్ల అనుభవాల
ప్రయాణం..
గమ్యం తెలిసిన
ఆశల పేజీ అసంపూర్ణమే.

 

 

 

వెల్మజాల నర్సింహ 


அது தான் வாழ்க்கை
சுயசரிதை போல அழகு
 புத்தகம் அல்ல

பல அலை அனுபவங்கள்
பயணம்..
சேருமிடம் தெரியும்
அசலா பக்கம் முழுமையடையவில்லை.

வேல்மஜால நரசிம்மா

అక్షర శోధకుడు

  కవి ఆలోచనలు ఎప్పుడు యవ్వనమే
 ప్రియురాలి పైనుంచి ఆకాశం వరకు
 అలల నుండి  అగ్గిపుల్ల వరకు
  దేనిపైనా నైనా కవిత రాయగలడు
 నిత్య యవ్వనుడు అక్షర శోధకుడు

***************
    

 ಕವಿಯ ಆಲೋಚನೆಗಳು ಯಾವಾಗಲೂ ಚಿಕ್ಕದಾಗಿರುತ್ತವೆ

 ಪ್ರೀತಿಯ ಮೇಲಿನಿಂದ ಆಕಾಶದವರೆಗೆ
 ಅಲೆಗಳಿಂದ ಪಂದ್ಯಗಳಿಗೆ
  ಅವನು ಯಾವುದರ ಮೇಲೂ ಕವಿತೆ ಬರೆಯಬಲ್ಲ
 ನಿತ್ಯ ಯವ್ವನ ಅಕ್ಷರ ಶೋಧಕ

         ವೆಲ್ಮಜಲ ನರಸಿಂಹ

 

మన స్నేహం !

తారలు తిరిగే వేళా
మన ముచ్చట్లకేది మౌనం
అమావాస్య రాత్రుల్లో
మన మాటలకేది చీకటి
నీవు నేను కలిస్తే
ఆకాశం లో
ఇంద్ర ధనుస్సే
 మన ముచ్చట్ల తో

పక్కింటి వనజా
ఊరి చివరి సుజాత
మల్లేశం చెల్లెలు
ఎవరిని వదలని కబుర్లు

సర్పంచి మొదలు
చాకిరేవు బండ వరకు
తాటి వనం నుండి
చేపల చెరువు వరకు
ఇవే కదా మన ముచ్చట్లు

రాజకీయాలు సరే సరి
సినిమా కబుర్లు భలే భలే
హీరోలా పిచ్చి అభిమానం
ఏమైపోయే మిత్రమా

చరవాణి చేతి కొచ్చే
మాటాలేమో మూగబోయే
సమయం లేదు మిత్రమా
మరల తిరిగిరాని కాలం తో


           వెల్మజాల నర్సింహ ✍🏻

మౌనం మాట్లాడుతుంది !

 ఒక మౌనం ఎన్నో ప్రశ్నల జవాబు
ఒక మౌనం ఎన్నో బాధల ఓదార్పు
ఒక మౌనం ఎన్నో అవమానాల
సహనం
 మౌనం కాదు శూన్యం
అది ఒక నిత్య పరమానందం
అందులో వెతికితే జీవితానందం
మౌనం మాట్లాడుతుంది.
వేగంతో కాదు ఓర్పుతో విను
మౌనం మాట్లాడుతుంది
మనుషులతో కాదు
మనసు తో విను





મૌન ઘણા પ્રશ્નોના જવાબ આપે છે
મૌન એ ઘણા દુ:ખનું આશ્વાસન છે
એક મૌન ઘણા અપમાન છે
ધીરજ
 મૌન એ શૂન્યતા નથી
તે શાશ્વત આનંદ છે
જો તમે તેને શોધશો, તો તમને જીવનમાં આનંદ મળશે
મૌન બોલે છે.
ધીરજથી સાંભળો, ઝડપથી નહીં
મૌન બોલે છે
માણસો સાથે નહીં
 તમારા હૃદયથી સાંભળો