రోహిణి కార్తె కొంచెం కోపంగానే ఉండే,
జనాలు విన్నరుగా... మొక్కలు నాటారు!
భూతల్లి పగిలిన చర్మంతో, వేయి కళ్ళ ఇంద్రుడిని తలపిస్తోంది.
మొక్కలు గుక్కెడు నీళ్లు లేక మాడిపోయాయి,
చెరువులన్నీ ఎండిపోయి నీళ్లే కరువయ్యాయి.
గొడ్డు గోదా కాంక్రీటు రోడ్లపై సంచరిస్తుంటే,
ఈ కలియుగంలో పిడికెడంత పిట్ట ప్రాణం ఎంత?
ఇప్పుడైనా కొంచెం ఉపశమనం కోసం,
కాలం చాపకింద నీరులా జారుకుంటోంది...
వేసవి తాపం నుండి వర్షపు జల్లుల్లోకి!
కాలగమనంలో.. మరింత ముందుకు,
పిల్లలు బడికి పోవాలి, పక్షి పిల్లలు ఆకాశాన ఎగరాలి!
వెల్మజాల నర్సింహ
12.06.26
12.06.26