కప్ప రాయుడు (సరదాకి)


 

 

 

 

 

 

 

 

తను చెప్పిందే వేదం 

తను పలికితే భావం 

తను వున్నదే ప్రపంచం 

తను చుాసిందే బొమ్మ 

తను వలచిందే రంభ 

తను పాడిందే పాట 

తను ఆడిందే ఆట 

కాదంటివా....

  కప్ప రాయుడు చేతిలో

 ఖతం !

 

తానొక్క నుాతి లో కప్ప 

మాటలు కలపకు జఫ్పా

మౌనం  అలవర్చుకో అప్పా

అదే నీకూ మనశ్శాంతి

***

ఇది తప్పా😜

***************

 వెల్మజాల నర్సింహ ✍🏻

చెట్టు -Tree


 

మీ పురుటి నొప్పులు 

మా అమ్మలలాగే వుండవచ్చు 

మీ మెుగ్గలు మా పాప బుగ్గలు కావచ్చు 

మీ పిందెలు మా 

పసికందులు కావచ్చు 

మీ హృదయం చాలా విశాలం కావచ్చు 

ప్రకృతికే పెద్దమ్మా 

ప్రాణా వాయువులుండే చెట్టమ్మ

మీ తనువంతా ఔషధ మూలికలే కావచ్చు 

మీ కాండలే మా ఇంటి

ముందరా గడపలు కావచ్చు 

మీ వేళ్ళతొ ఎన్నో రోగాలు నయం చేయవచ్చు  

అడవిలో చెట్టమ్మ 

ఆది దైవం నువ్వేనమ్మ

మీ పై రాళ్ళు విసిరితే పండ్లను ఇస్తావు 

మీ బిడ్డలను అడ్డంగా నరికితే చూస్తూవుంటావు 

కీడు చేసినా వారికి కుాడా మేలు చేయడం 

మీ తరువాతే ఎవరైనా 

సృష్టికే పెద్దమ్మా పదిలమే చెట్టమ్మ

************************

 వెల్మజాల నర్సింహ ✍🏻

వాట్సాప్ -Whatsapp

నందికి మెడలో గంటలా 

నా చేతి లో నీవుంటావు 

ప్రతి నిమిషం సందేశంతో

 పలుకులను తెస్తుంటావు 

 ఊరంతా తిరిగినవి కొన్ని  అయితే  

పసలేనివి చాలా వుంటాయి 

తప్పుడు కథలు  కొన్నైతే

నకిలీ వార్తలు మరెన్నో 

పొద్దున్నే నీ చెలిమి 

మధ్యాహ్నం  కొంత బలిమి 

రోజంతా నాలో నేనే  

గడుపు తుంటా నీతోనే 

 కలియుగం లో  మనుషులు

శివుడి మెడలో పాములా

వాట్సాప్ లో మెలికలు

 *******************

 వెల్మజాల నర్సింహ

 

ナンディの首には鈴

あなたは私の手の中にいます

毎分メッセージ付き

 あなたは言葉を持ってきます

 街中に出回っているものもあります


甘くないものが多い


虚偽の話が買われた場合

フェイクニュースはもっと


早朝です

午後の犠牲


私は一日中私です

あなたと時間を過ごす


 カリユガの人々

シヴァの首に巻かれた蛇のように
 
ベルマジャラ ナルシンハ  

 

నీకు నీవే సాటి...


ఆకాశంలో మబ్బులు,

లక్షాధికారి చెంత డబ్బులు,

మనుషులకు వచ్చే జబ్బులు,

ఎండమావిలో వానలు,

యెదలో మెదిలే ఆశలు,

ఎప్పుడూ శాశ్వతం కావు.

 అసత్యపు పలుకులు,

సముద్రంపై పడిన చినుకులు,

ఎవరికీ ఉపయోగం కావు.

ప్రతి రోజూ ఒక్కసారైనా నవ్వు,

సహాయమంటే ముందుండు నువ్వు.

నీకెవ్వరు రారు పోటి,

కావాలి నీకు నీవే సాటి...


✍️వెల్మజాల నర్సింహ🙏