చెట్టు -Tree






 

మీ పురుటి నొప్పులు 

మా అమ్మలలాగే వుండవచ్చు 

మీ మెుగ్గలు మా పాప బుగ్గలు కావచ్చు 

మీ పిందెలు మా 

పసికందులు కావచ్చు 

మీ హృదయం చాలా విశాలం కావచ్చు 

ప్రకృతికే పెద్దమ్మా 

ప్రాణా వాయువులుండే చెట్టమ్మ

మీ తనువంతా ఔషధ మూలికలే కావచ్చు 

మీ కాండలే మా ఇంటి

ముందరా గడపలు కావచ్చు 

మీ వేళ్ళతొ ఎన్నో రోగాలు నయం చేయవచ్చు  

అడవిలో చెట్టమ్మ 

ఆది దైవం నువ్వేనమ్మ

మీ పై రాళ్ళు విసిరితే పండ్లను ఇస్తావు 

మీ బిడ్డలను అడ్డంగా నరికితే చూస్తూవుంటావు 

కీడు చేసినా వారికి కుాడా మేలు చేయడం 

మీ తరువాతే ఎవరైనా 

సృష్టికే పెద్దమ్మా పదిలమే చెట్టమ్మ

************************

 వెల్మజాల నర్సింహ ✍🏻

No comments:

Post a Comment