పచ్చిగా ఉండాల్సిన పొలంలో
తెలుగు -Telugu
జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే.
వాన జాడే లేదు!
అమ్మ మాటే జోల పాట
అమ్మ మాటే జోల పాట
స రి గ మ ల తో జగతికి పూల తోట
మురిపంగా ముర్రు పాలతో
అంగిట గోరు ముద్దుల తో
అపురూపమైన దేవత అమ్మ
మొదటి మాటే అమ్మా
ఆ పిలుపుతో జన్మ ధన్యం అమ్మ
బెజ్జ మహాదేవి చరిత్రలో అమ్మా
శివునికి సేవలు చేసిన ఆ అమ్మా
నేటి కి పాఠ్యాంశంగా నిలిచేనా అమ్మా
పేరుగాంచిన మరో తల్లి యశోదమ్మ
మన్ను తిన్నాడని ఆ అమ్మ
కృష్ణుడు చెవిని మేలిపిన చరితం కదా అమ్మ
కడుపులో నే ఉన్నప్పుడు ప్రహ్లాదుడు
నారాయణ మంత్రం విన్న లీలావతమ్మ
అమ్మ మాటే జోల పాట
స రి గ మ ల తో జగతికి పూల తోట
చందమామ కోసం చిలిపి రాముడి గోలా
అద్దం లో ప్రతి బింబం చూసి ఆనందం వేళ
కౌసల్యామ్మా మురిసేనా ఆ అమ్మా
ఛత్రపతి కోసం జిజియాబాయి అమ్మా
శివాజీ వీరుని చేసిన మహా తల్లి ఆ అమ్మా
అమ్మా మాటే జోల పాట
స రి గ మ ల తో జగతికి పూల తోట
రెండు అక్షరాల పిలుపే అమ్మ
నడిచే దైవం ఆ అమ్మ
ప్రేమను పంచే అమ్మా
లోకంలో సరిలేరు నీకెవ్వరు కదామ్మ
పిల్లల భవిష్యత్తుకై నిత్యం తెప్పించే
మహా జన్మ అమ్మా!
అమ్మ మాటే జోల పాట
స రి గ మ ల తో జగతికి పూల తోట
బద్రీనాథ్ పాట సాహిత్యం
అలకనందా జలపుణ్యఫల నమో నారాయణాయ
బద్రీకాశ్రమానివాస దేవా నమో నారాయణాయ
నీ నామమెంత మధురమో నమో నారాయణాయ
అరవింద వల్లి అమ్మ దయతో నమో నారాయణాయ
దర్శించుకున్న కలుగు పుణ్యం నమో నారాయణాయ
ఆలోక్య సర్వ శాస్త్రాణి విచార్యచ పునః పునః
ఇదా మేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!!
కన్నీళ్లు కొబ్బరికాయ నీళ్ళు
కన్నీళ్లు కొబ్బరికాయ నీళ్ళు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
కష్టపడే శ్రమజీవుల
పని గంటల కోసం
జరిగిన పోరాటలేన్నో
బతుకు దేరువు కోసం
జరిగిన పరిణామాలెన్నో
ఎర్ర జెండా రెపరెపల కోసం
ప్రాణాలు వదిలిన
మనుషులేందరో
నేడు ' ప్రపంచ కార్మిక దినోత్సవ
పోరాట యాదిలో
వెల్మజాల నర్సింహ ✍🏻
మంచి వాక్యం!
కష్టపడుతూ ఒక్కోక్క మెట్టు ఎక్కుతూ పైకి
ఎదిగినా వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది.
అడ్డదారులో ఒక్కసారిగా పైకి ఎదిగే వాడికి
నువ్వెంత అనే అహంకారం ,గర్వం ఉంటుంది.
వెల్మజాల నర్సింహ ✍🏻
ప్రతిసారి క్షమిస్తున్నారు కదా
ప్రతిసారి క్షమిస్తున్నారు కదా
అని మంచివాళ్ళని మళ్ళీ మళ్ళీ చులకన గా చూడకు
వాళ్ళు ఒక్కక్షణం మంచితనాన్ని మర్చిపోయారంటే
వేరేలా మారడానికి నిమిషం కూడా పట్టదు
ఉగాది పాట
అల్లంత దూరాన
ఆ చల్లని గాలులతో
వినిపించే గానాలే
కోయిలమ్మ రాగాలంటా
ఆ పచ్చని పైరు లో
సాయంత్రం వేళల్లో
పూసిన వేపల పై
కనిపించక వినిపించే
మన మనసును దోచే టి
పక్షుల రాగాల టా
అల్లంత దూరాన
ఆ చల్లని గాలులతో..
మామిడి తోటలో
మధ్యాన్నపు వేళల్లో
మామిడి పిందెల పై
చిలుకలు సందడి చేయగా
కనువిందుగా ఉండేనా
మామిడి తోటంతా
అల్లంత దూరాన
ఆ చల్లని ని గాలులతో
వినిపించే గానాలే
కోయిల రాగాలంట
కొత్తగా పెళ్లైన
యువజంట లా ముచ్చట్లు
పరీక్షల కోసం పిల్లలు ఇక్కట్లు
వేసవి ఎండల తో
కులీ అన్న లా సతమతం
అల్లంత దూరాన
ఆ చల్లని గాలులతో
వినిపించే గానాలే
కోయిల రాగాలు
ఇల్లంతా బంధువుల తో
ఊరంతా సందడి తో
పచ్చడి ఫలహారం తో
పసందైన వంటకాల తో
పంచాంగం వినడం కై
మనసంతా ఉబలాటం
కవులు కవితా లతో
ఆనందంగా గడిపేది
ఉగాది పండుగే నంటా
అల్లంతదూరానా
పచ్చని పల్లెలో
ఆ చల్లని ని గాలులతో
వినిపించే గానాలే
ఉగాది కవితా లేనంటా
జీవితంలో స్నేహితుల కంటే
జీవితంలో స్నేహితుల కంటే శత్రువులే
ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే వారి బుద్ధి అలాంటిది.
నూతన సంవత్సరం @2025
పన్నెండు ఆకుల కాలం చెల్లింది
కొత్త ఆకులు చిగురించాయి
వాటిని రోజు చూస్తూ
గడపడమే నూతన జీవితం.
వెల్మజాల నర్సింహ ✍🏻
కొత్త సంవత్సరం !
ప్రపంచమే మన గుప్పిట్లో
ప్రస్తుతం మనం చూస్తున్నాం
వింటున్నాం, వీక్షిస్తున్నాం
ఆచారాలు మారాయి
కొత్త సంప్రదాయాలు ఇంట్లో చెరాయి.
కట్టు బొట్టు తో పాటు వస్త్రాధారణ మారింది
నాగరికత అభివృద్ధి చెందింది
అని పండుగలు మనయే
ఆనందంతో జీవించడమే ఉత్తమం.
తేది మారితే జీతాలు వస్తాయి
జీవితాలు గడుస్తాయి
వేతన జీవుల ఆశ.
క్యాలెండర్ మారితే జీవితలేమి మారవు
కాకుంటే ఆనందంగా కొత్త సంవత్సరంలోకి
అడుగుపెడితే తప్పేముంది.
పాత సంవత్సరానికి వీడ్కోలు
నూతన సంవత్సరానికి ఆహ్వానం
అదే ఆనందదాయకం.
వెల్మజాల నర్సింహ ✍🏻
31.12.2024
Father of the Constitution రాజ్యాంగ పితామహుడు
ఇతిహాసాలలో లాగా
మోసాలు లేవు
రాజకీయ నాయకుల లాగా
కుతంత్రాలులేవు
నేటి పాలకుల లాగా
మాయ మాటలు లేవు
తాతలతండ్రులు నాటి ఆస్తులు లేవు
తాను నమ్మిన సిద్ధాంతం కోసం
అక్షరానే నమ్మకోని ఎవరు సాధించలేని
విజయాలతో
రాజ్యాంగ పితామహుడు గా
ఎదిగిన ఒక మహోన్నత
మనిషి 69 వ మహా పరినిర్వాన్
దివస్ ఈరోజు.
గా చదువులుమీకేందుకాని
బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గారు ఆంగ్లేయుల
కాలంలో పుట్టింది మంచిదైంది ఇప్పుడుంటే పాలకులే
గా చదువులుమీకేందుకాని
అనే వారేమో
మా గ్రంథాలలో లేదాని
సనాతన ధర్మం కాదాని వాదించే వాళ్ళు
వెల్మజాల నర్సింహ ✍🏻
అక్షర ప్రవాహం మన సురవరం
మూగవోయిన తెలంగాణాకు తొలి ములుగై
గోలకొండ కవుల సంచిక తో తొలి వెలుగై
భాషాభిమానం తో దేశాభిమానం ఎక్కువేనని
గోలకొండ పత్రిక ప్రస్థానం మన భాష గొప్పదనం
చారిత్రాత్మక నిర్ణయం తొలి సంచిక అమోఘం
సంస్కృతం లో తొలి'అలం మహీపాల తవశ్రమేణ..
ఆగలేదు ఆ కలం సాగింది నిత్యం అక్షర ప్రవాహం
యువ కవులైన దాశరథి, కాళోజీ, రామరాజుల
రచనలను ప్రోత్సహించి మంచి మనసు చాటుకునే
హంవీర సంభవం'మే కాదు'ఆంధ్రుల సాంఘిక చరిత్ర
నిత్యం రచనలే రామాయణంతో కొత్త కోణాలే
ఆ కలంకు లేదు అలుపు, కవిత్వం,నవల, ఏదైనా
అప్పటి రాజకీయాలు సరేసరి, నైజాం పాలన కొరి
రెడ్డి హాస్టల్ బాధ్యత యువత భావితరాలకు బాసట
తన మాట తన బాట తన బతుకు మనకోసం
నిరంతరం 'అక్షర ప్రవాహమే మన సురవరం
వెల్మజాల నర్సింహ.29.09.24
చరవాణి.9867839147.
దుప్పల్లి.
అర్థరాత్రి స్వతంత్రం
మట్టి మనుషుల బతుకు చిత్రం - తంగలాన్
పా.రంజీత్ గారి దర్శకత్వంలో విలక్షణ నటుడు విక్రమ్ గారు నటించిన అద్భుతమైన చిత్రం 'తంగలాన్
ఇది సినిమా కాదు జీవితాలు,అణాగారిన జనం యొక్క బతుకులు.
మాకు మంచి రోజులు వస్తాయి.మా గురించి కూడా
సినిమాలు వస్తాయి అని చాటి చెప్పిన గొప్ప సినిమా.
తంగలాన్ పాత్ర పేరు అతడే యోధుడు నలుగురు పిల్లలను పోషించే దళిత తండ్రి.రెక్కల కష్టం దొచుకునే కాలం నాటి పరిస్థితులు.
భూమి కోసం భుక్తి కోసం పోరాడి గెలిచిన యోధుడి కథ.అప్పటి దొరలు నిమ్న జాతి కులాల వారిని ఏవిధంగా వాడుకున్నారొ కండ్లకు కట్టినట్లు చూపించారు. చియాన్ విక్రమ్ నటన సహజంగా మరియు సాహసోపేతంగా ఉంది.
చచ్చి బతికే కంటే పోరాడి చవడయే గొప్ప అని
నిరూపించిన సినిమా .
పుట్టిన వాడు చావక తప్పదు కానీ రోజు భయపడుతూ బతికే బతుకు కాదాని
తన వారు చనిపోతున్న పోరాటమే జీవితమని
నిరూపించిన కథ.
తెల్లదొరలు వారి పేరుని వాడుకోని స్థానిక దొరలు
భూములు లాక్కొని దౌర్జన్యంగా వెట్టిచాకిరి ఎలా చేయించుకున్నరో చరిత్రలో రాయని నిజం
ఈ సినిమాలో ఉంది.
ప్రకృతి లో కష్టించి పనిచేసే వారికి ప్రకృతే దేవుడిని
అదే సహకరిస్తుంది .
ఈ దశాబ్దకాలంలో జై భీమ్ తరువాత అంత గొప్ప సినిమా 'తంగలాన్.
వెల్మజాల నర్సింహ.18.8.24.
అక్షర సుతుడు !
నిలువెత్తు ధనమే వద్దులే
నీకున్న అక్షర జ్ఞానము చాలు
శ్రీనాథుడులా పాండిత్యం అవసరం లేదులే
పోతన లా పొలం పనులైనా పర్వాలేదు
పెద్దింటాని సుద్దులు అవసరం లేదులే
నేడున్న నీ మంచితనం చాలునే
అక్షరం నమ్ముకొని ముందుకు
సాగిన వారి జీవితం చారిత్రాత్మకం
అన్నమయ్య లా అలతి పదం
యోగి వేమన లా పామరుడి పద్యం
చాలును జీవిత పరమార్థం
వారి మాట,పాటే ప్రజలో అజరామరం
వారి అక్షరమే వారి నిజమైన సుతుడు
వెల్మజాల నర్సింహ ✍🏻
చిరునవ్వే శాశ్వతమా!
నాలుగు డప్పులు ఏడుస్తూ
ముందు నడుస్తుంటే
నువ్వు తినలేని పేలాలు
నీ పైనుండి పడుతుంటే
చిల్లరే కదరా ఘల్లు ఘల్లు మని
నేలమీద పడేది
పాడే కదరా పాటకు నీకు సాక్ష్యం!
గోవిందాని పలుకుతారు
నీ చెవులకు చెరిందా!
లేవవయ్య అని విలపిస్తారు
నీ కన్నేమైన తెరిచింద!
బంధవులో కొందరు
బయలుదేరుటకు ఆరాటం
ఆస్తిలో వాటాల కోసం సంతన
మస్తిష్కంలో పోరాటం
సంతాప సభ ఖర్చుల
ఇంకొందరి ఉబలాటం
ఏమైంది ఉరుకుల
పరుగుల జీవితం
చివరకు తెల్లని చొక్కాతో
నవ్వడం రాని ముఖం తో
బతికినంత కాలం బిజీ బిజీగా
సంపాదనే ధ్యేయంగా తలచి
చచ్చేంత వరకు నీకు సమయం
లేదయే ,
హాయిగా నవ్వుకునే
దినం రాదయే
నవ్వుతూ బతుకు చచ్చేంత వరకు
అదే జీవిత పరమార్థం.
వెల్మజాల నర్సింహ ✍🏻24.05.24
జాలి దయ లేని
జాలి దయ లేని
బండరాయి అనుకున్న
వాటి మధ్యలో నుంచి
వచ్చిన మొక్కను చూశా
బండరాయి వంటి గుండెలలో
కూడా అమ్మతనం ఉంటుందని
మే - 🌞 జూన్ 🌝
మే - 🌞
ఏమిటో ఈ ఎండలు
భూమాత పై స్వేద రంధ్రాలు
కనిపించేంతగా
జూన్ 🌝
పచ్చదనంతో ఊపిరి
తీసుకుంటుంది భూమాత
నిన్ననే తొలకరి జల్లులు
మొదలయ్యాయి
వెల్మజాల నర్సింహ
శత మశక సంహార వీర
అనగనగా ఊరిలో రాజా అనే పిరికివాడు నివసిస్తుండే వాడు . అతనికి ఏదీ చూసిన భయమే.
చుట్టూ ప్రక్కల వారు రాజాను చూసి హేళన చేసే వారు.
పేరుకే రాజా ధైర్యం లేని కాజా అని!
తాను ధైర్యవంతుడని నిరూపించుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేసి నవ్వుల పాలయ్యాడు.
ఎన్నో సినిమాలు చూసినా ధైర్యం రాలేదు
నాకు ఒక రోజు వస్తుందిలే అనుకున్నాడు.
పాత సినిమాలలో లాగా వర్షం కురిసిన రాత్రి
దోమల దండు రాజా పై దండెత్తి ంది .
అక్కడ మగధీర క్లైమాక్స్ సీన్ ఒకోకరు కాదు షేర్ ఖాన్ వందమందిని ఒకే సారి పంపించు.
రాజా నరాలల్లో రక్తం ఉప్పొంగింది.
కళ్ళముందు మోత్కూరు బిక్కేరు కనిపించింది.
వెంటనే వంద దోమలనీ చంపి వాటి రక్తంతో " శత మశక సంహార వీర మీ రాజా అని రాసుకొని హాయిగా నిద్ర పోయాడు.
ఉదయం చూస్తే పేపర్ కనిపించకుండా పోయింది ఎవరు కొట్టేశారు అబ్బ'
వెల్మజాల నర్సింహ ✍🏻26.04.24
-
రేణుకా హృదయానందం భృగవంశ తపస్వినం క్షత్రియాణాం అంతకం పూర్ణం జమదగ్న్య్ం నమామ్యహం! పండుగ అంటే : సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావా...