వాన జాడే లేదు!

 పచ్చిగా ఉండాల్సిన పొలంలో

నాగలి కర్రు దిగనే లేదు  
దుక్కి దున్నిన ఏమి లాభం
గింజలలో జీవం పోయడానికి
నీళ్ళే ప్రాణాధారం
నారుమడి పచ్చదనం ఎక్కడ
చిగురుటాకులాకు అదే చివరి రోజు
గిజ్జిగాడి గొంతు ఎప్పుడో ఎండింది
నల్లని రేగడులు నెర్రలతో
గొంతెండిన   పిల్లలా కనిపిస్తున్నాయి
ఎర్రని రేగడిలో కనిపించే
ఆరుద్ర పురుగుల జాడే లేదు
పత్తి చేలో మొక్కలు అమ్మ నాన్న
లేని అనాధల కనిపిస్తున్నాయి
కంది,పెసర ఊసే లేదు
ఆముదాల ఆశ లేదు
నువ్వులు ,మిరప గింజలు
నువ్వా నేనా అంటున్నాయి

మృగశిర కార్తె లో మురవలసిన చినుకు
ఆరుద్ర కార్తె వరకు కు జాడ లేదు

పరమేశ్వర గంగను విడువుము
మా ప్రాణాలు కాపాడుము
మబ్బులోన దాగున్న చినుకమ్మ
మా మొర విని ఇక్కడ కురువమ్మ


వెల్మజాల నర్సింహ.
  గ్రామము.దుప్పల్లి.
చరవాణి.9867839147.

  


No comments:

Post a Comment