పేదల బతుకు చిత్రం

 అద్దాల మేడలు ఒక్క వైపు
 మురుగు నీటి ప్రక్కల గుడిసెలు
 మరోవైపు
 ఇదే బస్తీ జీవనం పేదల బతుకు చిత్రం
 భారత్ అభివృద్ధి చెందుతోంది
 బడాబాబులా జేబులు నింపడానికి


వెల్మజాల నర్సింహ✍🏻

మానవత్వం


 

 మీరు ఈ ఫొటో జాగ్రత్తగా చూడండి ఆ పాప చేతిలో ఆహారం వుంది వెనకాల రాబందు వుంది ఆ పాప అనుకుంటుంది, రాబందు వచ్చి ఆహారాన్ని ఎత్తుకుపోతుందని దాచుకొంటోంది. కానీ, పాపకు తెలియని విషయం ఏంటంటే, రాబందు చూసేది ఆహారం కోసం కాదు ఆ పాప కోసమే అని ఎందుకంటే తిండి సరిపోక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే తిందామని...*

*ఈ ఫొటో కెవిన్ అనే ఫొటో గ్రాఫర్ సూడాన్ లో 1990 లో అక్కడి కరువు కాలంలో తిండి లేక ఎంతో మంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజెయ్యాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్ళి తీసిన ఫొటో ఈ ఫొటోకి గాను కెవిన్ కు చాలా గుర్తింపు వచ్చింది సన్మానాలు చాలానే జరిగాయి ప్రపంచంలో కెవిన్ పేరు మారు మ్రోగిపోయింది*

*ఆయనను అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి సన్మానాలు చేసుకోడానికి కూడా సమయం చాలక బిజీగా తిరుగుతున్న కెవిన్ కు ఒక సారి ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తగానే అవతలి వ్యక్తి... ఆ పాప ఏమయ్యింది సార్, బ్రతికుందా చనిపోయిందా అని అడిగాడు. అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు... ఏమోసార్ ఫొటో తీసి వచ్చిన తరువాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు లేదు, ఆ పాప ఏమయ్యందో అని/ అప్పుడు అవతలి వ్యక్తి ఇలా అన్నాడు... ఆ రోజు అక్కడ వున్నవి రెండు రాబందులు, ఒకటి పాప చనిపోతే తినేద్దాం అనిచూస్తుంటే ఇంకొకటి కెమేరా పట్టుకొని కూర్చుంది... అని ఫోన్ పెట్టేసారు... ఆ మాట ఆయన మీద ఎంత ప్రభావం చూపిందంటే, 1993 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత...*

*అప్పటికి ఆయన వయస్సు 33 సంవత్సరాలే... ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, సమాజంలో ఇప్పుడు కెవిన్ లాంటి వారు చాలా మంది వున్నారు‌. ప్రతీది ఫొటో తీయడం, అక్కడ మన అవసరం వున్నా సహాయం చేయకుండా కెవిన్ లాగా పదిమంది మెప్పు గురించి బ్రతికేవారే ఎక్కువ... ఆరోజు అక్కడ కెవిన్ మరిచింది ఏంటంటే మానవత్వం. ఈరోజుల్లో మనం మరుస్తుంది కూడా మానవత్వమే.*

*కాబట్టి మీలో వున్న కెవిన్ ని చంపండి..👍*

( వాట్స్ ఆప్ నుండి సేకరణ)