మన చుట్టూ ప్రక్కల జనం

 మన చుట్టూ ప్రక్కల జనం

 మరియు పుస్తకాలు ,సమయం 

ఎన్నో జీవిత పాఠాలు నేర్పుతాయి 

అయినా ఎప్పటికీ నేర్చుకున్నే 

విద్యార్థులుగా ఉండటానికే ఇష్టపడుతాం.

చిరునవ్వు!



జీవితం ఆగిపోవచ్చు
ఎదో గాలికి రాలిన ఆకుల
ఎవ్వరో తెంపిన కాయల
పుణ్యం కొద్ది
తొడిమె ఊడిన
పండులా

అయినా జీవితం
సాగిపోవచ్చు
ఎవరో నడుపుతున్న వాహనంలా
గాలికి ఎగిరే పక్షిలా
అబద్ధాలకు సాక్షిలా

రాత్రి పగలు నిత్యం
పుట్టుక చావు సత్యం
బంధాలే నటనలు కావా
డబ్బుకు దాసోహం లోకమని తెలిసి
ముందుకు సాగడమే సుఖం
ముఖం పై చిరునవ్వే
మనిషికి ఆశ కాదా!

వెల్మజాల నర్సింహ ✍🏻

ఉపాధ్యాయులు!



వారంతా జ్ఞాన వృక్షాలు
 ఎదిగే మొక్కలకు విజ్ఞానం
 పంచడమే వారి పని.

             
                వెల్మజాల నర్సింహ ✍🏻

కోట్లకు అధిపతైనా

కోట్లకు అధిపతైనా
 ఆయుష్షుకు పేదోడే,
 కొడుకులు కోడళ్లున్నా
 భార్య లేకుంటే
 బంధాలకు బలహీనుడే

               

ఒంటరి జీవితం!

 

నల్లని చీకటి తెల్లని గోడలు
గోడువినే నాథుడు లేడు
దుప్పటి తోనే ముచ్చట్లు
మసక కన్నులతో ఇక్కట్లు

పది రోజుల పండుగ పెళ్ళి
కొడుకులు బంధువుల లొల్లి
అంతా సజావుగానే, మరల
కొడుకులు పట్నం పొయారు


సముద్రమంతా అనుభవం  
ఏదరికో తెలియని పయనం
 సాగుతోంది ఒంటరి జీవితం!


వెల్మజాల నర్సింహ ✍🏻

పేదల బతుకు చిత్రం

 అద్దాల మేడలు ఒక్క వైపు
 మురుగు నీటి ప్రక్కల గుడిసెలు
 మరోవైపు
 ఇదే బస్తీ జీవనం పేదల బతుకు చిత్రం
 భారత్ అభివృద్ధి చెందుతోంది
 బడాబాబులా జేబులు నింపడానికి


వెల్మజాల నర్సింహ✍🏻

మానవత్వం


 

 మీరు ఈ ఫొటో జాగ్రత్తగా చూడండి ఆ పాప చేతిలో ఆహారం వుంది వెనకాల రాబందు వుంది ఆ పాప అనుకుంటుంది, రాబందు వచ్చి ఆహారాన్ని ఎత్తుకుపోతుందని దాచుకొంటోంది. కానీ, పాపకు తెలియని విషయం ఏంటంటే, రాబందు చూసేది ఆహారం కోసం కాదు ఆ పాప కోసమే అని ఎందుకంటే తిండి సరిపోక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే తిందామని...*

*ఈ ఫొటో కెవిన్ అనే ఫొటో గ్రాఫర్ సూడాన్ లో 1990 లో అక్కడి కరువు కాలంలో తిండి లేక ఎంతో మంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజెయ్యాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్ళి తీసిన ఫొటో ఈ ఫొటోకి గాను కెవిన్ కు చాలా గుర్తింపు వచ్చింది సన్మానాలు చాలానే జరిగాయి ప్రపంచంలో కెవిన్ పేరు మారు మ్రోగిపోయింది*

*ఆయనను అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి సన్మానాలు చేసుకోడానికి కూడా సమయం చాలక బిజీగా తిరుగుతున్న కెవిన్ కు ఒక సారి ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తగానే అవతలి వ్యక్తి... ఆ పాప ఏమయ్యింది సార్, బ్రతికుందా చనిపోయిందా అని అడిగాడు. అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు... ఏమోసార్ ఫొటో తీసి వచ్చిన తరువాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు లేదు, ఆ పాప ఏమయ్యందో అని/ అప్పుడు అవతలి వ్యక్తి ఇలా అన్నాడు... ఆ రోజు అక్కడ వున్నవి రెండు రాబందులు, ఒకటి పాప చనిపోతే తినేద్దాం అనిచూస్తుంటే ఇంకొకటి కెమేరా పట్టుకొని కూర్చుంది... అని ఫోన్ పెట్టేసారు... ఆ మాట ఆయన మీద ఎంత ప్రభావం చూపిందంటే, 1993 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత...*

*అప్పటికి ఆయన వయస్సు 33 సంవత్సరాలే... ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, సమాజంలో ఇప్పుడు కెవిన్ లాంటి వారు చాలా మంది వున్నారు‌. ప్రతీది ఫొటో తీయడం, అక్కడ మన అవసరం వున్నా సహాయం చేయకుండా కెవిన్ లాగా పదిమంది మెప్పు గురించి బ్రతికేవారే ఎక్కువ... ఆరోజు అక్కడ కెవిన్ మరిచింది ఏంటంటే మానవత్వం. ఈరోజుల్లో మనం మరుస్తుంది కూడా మానవత్వమే.*

*కాబట్టి మీలో వున్న కెవిన్ ని చంపండి..👍*

( వాట్స్ ఆప్ నుండి సేకరణ)

ఊరకనే !

ఉడకపోత మా ఇంట్లో ఫ్యాన్ మోత
చరవాణి లో  మీడియా కథలు
అయోమయంలో అందరూ చిందులు
మా గల్లీ లో డీజే కూత
అది చేరాలి ఢిల్లీకి తాత

ఉదయాన్నే వాట్సాప్ లో గోలగోల
ఫేస్బుక్ లో ముఖాలు తలతల
నెటుంటే ఫోన్ తో కలకల
డేటా అయిపోతే మనసంతా విలవిల

ఆకాశంలో చుక్కల లెక్క
ఎప్పుడూ తీరునో సందేహం అక్క
రామారావు ఇంటి దగ్గర కుక్క
అది ఊరకానే మొరగదు పక్క 



వెల్మజాల నర్సింహ ✍🏻

నేటి బతుకు చిత్రం

ఎంప్లాయీస్ ఎదలో వేట
నెలజీతం డబ్బుల మూట
ఖర్చులా నోరు తెరిచిన బాట
కష్టంగా గడుపుతున్న పూట
మధ్య తరగతి మనుషులమాట 

*************

వెల్మజాల నర్సింహ

జీవితమంటే ?

 

 

 

 

జీవితమంటే
ఆత్మకథ లాగా అందమైన
 పుస్తకమేమి కాదు

ఎన్నో ఆటుపోట్ల అనుభవాల
ప్రయాణం..
గమ్యం తెలిసిన
ఆశల పేజీ అసంపూర్ణమే.

 

 

 

వెల్మజాల నర్సింహ 


அது தான் வாழ்க்கை
சுயசரிதை போல அழகு
 புத்தகம் அல்ல

பல அலை அனுபவங்கள்
பயணம்..
சேருமிடம் தெரியும்
அசலா பக்கம் முழுமையடையவில்லை.

வேல்மஜால நரசிம்மா

అక్షర శోధకుడు

  కవి ఆలోచనలు ఎప్పుడు యవ్వనమే
 ప్రియురాలి పైనుంచి ఆకాశం వరకు
 అలల నుండి  అగ్గిపుల్ల వరకు
  దేనిపైనా నైనా కవిత రాయగలడు
 నిత్య యవ్వనుడు అక్షర శోధకుడు

***************
    

 ಕವಿಯ ಆಲೋಚನೆಗಳು ಯಾವಾಗಲೂ ಚಿಕ್ಕದಾಗಿರುತ್ತವೆ

 ಪ್ರೀತಿಯ ಮೇಲಿನಿಂದ ಆಕಾಶದವರೆಗೆ
 ಅಲೆಗಳಿಂದ ಪಂದ್ಯಗಳಿಗೆ
  ಅವನು ಯಾವುದರ ಮೇಲೂ ಕವಿತೆ ಬರೆಯಬಲ್ಲ
 ನಿತ್ಯ ಯವ್ವನ ಅಕ್ಷರ ಶೋಧಕ

         ವೆಲ್ಮಜಲ ನರಸಿಂಹ

 

మన స్నేహం !

తారలు తిరిగే వేళా
మన ముచ్చట్లకేది మౌనం
అమావాస్య రాత్రుల్లో
మన మాటలకేది చీకటి
నీవు నేను కలిస్తే
ఆకాశం లో
ఇంద్ర ధనుస్సే
 మన ముచ్చట్ల తో

పక్కింటి వనజా
ఊరి చివరి సుజాత
మల్లేశం చెల్లెలు
ఎవరిని వదలని కబుర్లు

సర్పంచి మొదలు
చాకిరేవు బండ వరకు
తాటి వనం నుండి
చేపల చెరువు వరకు
ఇవే కదా మన ముచ్చట్లు

రాజకీయాలు సరే సరి
సినిమా కబుర్లు భలే భలే
హీరోలా పిచ్చి అభిమానం
ఏమైపోయే మిత్రమా

చరవాణి చేతి కొచ్చే
మాటాలేమో మూగబోయే
సమయం లేదు మిత్రమా
మరల తిరిగిరాని కాలం తో


           వెల్మజాల నర్సింహ ✍🏻

మౌనం మాట్లాడుతుంది !

 ఒక మౌనం ఎన్నో ప్రశ్నల జవాబు
ఒక మౌనం ఎన్నో బాధల ఓదార్పు
ఒక మౌనం ఎన్నో అవమానాల
సహనం
 మౌనం కాదు శూన్యం
అది ఒక నిత్య పరమానందం
అందులో వెతికితే జీవితానందం
మౌనం మాట్లాడుతుంది.
వేగంతో కాదు ఓర్పుతో విను
మౌనం మాట్లాడుతుంది
మనుషులతో కాదు
మనసు తో విను





મૌન ઘણા પ્રશ્નોના જવાબ આપે છે
મૌન એ ઘણા દુ:ખનું આશ્વાસન છે
એક મૌન ઘણા અપમાન છે
ધીરજ
 મૌન એ શૂન્યતા નથી
તે શાશ્વત આનંદ છે
જો તમે તેને શોધશો, તો તમને જીવનમાં આનંદ મળશે
મૌન બોલે છે.
ધીરજથી સાંભળો, ઝડપથી નહીં
મૌન બોલે છે
માણસો સાથે નહીં
 તમારા હૃદયથી સાંભળો

టెంగ్లీష్(英语)

 పేరుకు మాత్రమే ఇరవై ఆరు
ప్రపంచమే ఏలుతుంది
పొట్టిగా కొన్ని పదాలతో
అలవోకగా మరిన్ని మాటలతో
చమత్కారం గా, వెటకారం గా
అని భాషలలో దూరి
అలుకు పోతుంది.

సంస్కృతం మరిచాం
సంస్కృతి విడిచినాము
క్షమించు వదిలేసి
సారీ 'నే సొంతం చేశాం
ఎన్నో కొత్త పదాలు
మరెన్నో వాక్యాలు
ఏది సరైనదో
నిర్ధారణ కష్టమే సుమా!

చెప్పే వారు కరువాయే
వినేవారికి ఒప్పిక లేదు
బడిలోను అదే తంతు
సినిమా లో అదే గొంతు
ఇంగ్లీష్ భాష నువ్వే నేటికి బాషా !
తెలుగు భాష వెలగాలని ఆశ! 

नाममात्रे षड्विंशतिः
जगत् शासनं करिष्यति
कतिपयैः लघुशब्दैः सह
अधिकाधिकं शब्दैः सह
पेचीदा, प्रतिशोधकारी
तत् भाषासु
तरङ्गः गच्छति।

वयं संस्कृतं विस्मृतवन्तः
वयं संस्कृतिं त्यक्तवन्तः
क्षमस्व त्यजतु
क्षम्यतां, मम स्वामित्वम् अस्ति
अनेकाः नवीनाः शब्दाः
अनेकानि अधिकानि वाक्यानि
यत् सम्यक् अस्ति
सुमायाः निर्धारणं कठिनम् अस्ति!

ये तद् वदन्ति ते दरिद्राः
श्रोतारः न प्रत्ययन्ते
विद्यालये अपि तथैव भवति
चलचित्रे एव स्वरः
आङ्ग्लभाषा अद्यत्वे बाशा!
आशासे तेलुगुभाषा बहिः आगमिष्यति!
वेल्मजला नरसिंह  



 

రఘు 拉古

 కాశ్మీర్ లో గజేంద్ర అనే చిన్న గ్రామం.అక్కడ ఎప్పుడూ
ప్రతి ఉదయం మంచు కురుస్తుంటుంది .
చుట్టూ పర్వతాలు మధ్య లో
పచ్చని తివాచీలు పరుచుకొని
ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండే అక్కడ
సూర్యోదయం  ఇంద్ర ధనుస్సుల చాలా కాంతులతో వస్తుంది.

అక్కడికి ఎంతో మంది  సూర్యోదయం చూడడానికి టూరిస్టులు వస్తుంటారు.
రఘు అనే బాలుడు యవ్వనం లో కి వస్తున్న పది సంవత్సరాల పిల్లవాడు.
బుగ్గలలో పాలతో చాలా అందంగా పురి విప్పిన పువ్వుల ఉంటాడు.
ఎప్పుడూ ఇంటి దగ్గరే వుండి పెరిగిన వాడు అయినందున
ఎప్పుడైనా మార్కెట్ కు వాళ్ళ అమ్మ తో కలిసి వెళ్లేవాడు.భయంతో మరియు ఉత్సాహంగా వాళ్ళ అమ్మ వెనుకాలే నడిచే వాడు.రఘుకు అక్కడ వుండే రద్దీ చాలా వింతగా వుండేది ఏమిటో ఈ జనం ఉరుకుల పరుగుల జీవితం అనుకునేవాడు.

మార్కెట్ లో కొత్త మనుషుల్ని చూస్తే రఘుకు చాలా వింతగా వుండేది,అలా చూస్తూనే వుండేవాడు.
పోస్టర్లో బొమ్మలను చూసి వాళ్లా అమ్మను చాలా ప్రశ్నలు అడిగే వాడు.వారు గోడ పై ఎలా నిలిచారు
వాళ్ళకి కాలు నొప్పులురావా అని.
మార్కెట్ లో వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని నడవడం
రఘుకు ఇష్టం వుండేది కాదు.

అక్కడికి వచ్చే టూరిస్టులు విదేశాల వారు కూడా ఉండేవారు.
ఒక టూరిస్టు హెయిర్ స్టైల్ చాలా వింతగా అనిపించింది.
అతడిని చూపిస్తూ వాళ్ళ అమ్మను అడిగాడు.
ఏమి స్టైల్ అని.

అది నెత్తిని కాల్చితే వచ్చిన స్టైల్ అన్నది.

అది జ్ఞాపకం పెట్టుకున్న రఘు మరుసటి రోజు
అగ్గిపుల్ల తో నెత్తిని కాల్చడం మొదలెట్టాడు.
వాసనను గమనించినా వాళ్ళ అమ్మ
కాఫి క్యాట్ కాదు అలా వర్క్ అవుట్ అంది.
ఇద్దరు నవ్వుకున్నారు.

నవకవనం !

 నేటి కథలు కవితలు

రేపటికి మాసిన గీతలు
వాటిలో ఎన్నో తల రాతలు
కొన్నే పారే నది జలాలు
ఉప్పొంగే ఆలోచనలు
ఉప్పు లా చిటపటలు
కవికలం రవి కిరణం
ఉషోదయం నవకవనం
*************

వెల్మజాల నర్సింహ ✍🏻

ఉపాధ్యాయుడు (Teacher)老师

 మీరు నేర్పిన అక్షరం పదిలం

మీరు చెప్పిన మాటలు పదిలం

మీతో గడిపిన తరగతి గది

క్షణాలు ఎప్పటికీ గుండెలో పదిలమే

పంచతంత్ర కథలు కొన్నైతే

జీవిత అనుభవాలు మరిన్ని

ఉద్యమ చరిత్రలు కొన్నైతే

ప్రపంచ సంఘటనలు మరెన్నో 

లెక్కల గురువుగా ఒకరోజు

సామాన్య, సాంఘిక మరో రోజు

తెలుగు, ఆంగ్లం,తెలియని

 విషయాలు ఎన్నెనో

ఉపాధ్యాయ జీవితం

నడుస్తున్న విజ్ఞాన భాండాగారం


బాల్యం ఒక బహుమానం

జీవితం ఆశల ప్రయాణం 

గురువే దారికి మార్గనిర్దేశం

*************

వెల్మజాల నర్సింహ.✍🏻

 

Письмо, которое вы учили, твердое

Ваши слова тверды

Класс, проведенный с вами

Моменты остаются в сердце навсегда


Если истории Панчатантры куплены

Жизненный опыт более

Если истории движения покупаются

Мировые события и многое другое


День учителя математики

Просто еще один день нормальности и общительности

Телугу, Английский, Неизвестно

 Много вещей

жизнь учителя

Действующее хранилище знаний


Детство в подарок

Жизнь - это путешествие надежды

Сам Гуру является проводником на пути


Велмаджала Нарсимха.✍🏻

 

బతుకు చిత్రం !生活图片

ఊరు ఖాళీ అవుతుంది

గూడు మోడౌతోంది

బతుకు భారం మౌతుంది

పయనం తప్పదంటోంది

కాలధర్మం కమ్ముకోచ్చింది.

ఆగమనం ,అంతిమ యాత్ర

సృష్టి ధర్మమంటోంది.

చివరికి నువ్వైనా నేనైనా



రేపటి కోసం ! for future

వారు పొలంలో కష్టించిన

భార్యాభర్తలు

రాత్రి బయట పడుకున్నారు

యజమాని మబ్బుల్ని

వారి భార్య నిద్రను

వారి కుమారుడు నక్షత్రాలను

వెతుకుతున్నారు.

రేపటి కోసం ఆశ.

为了未来
 

వెల్మజాల నర్సింహ ✍🏻

శుభోదయం


 ఎతైన కొండలు దాటుతూ 

సూర్యుడు ముందుకు వస్తున్నాడు 

నిద్రావస్థలో వున్న

యువతను మేల్కొలపడానికి 

తన కిరణాలతో వారి

 మెదడులను ఉత్తేజ పరచడానికి.


వెల్మజాల నర్సింహ ✍🏻

గెలుపు ఇచ్చిన ఆనందం

 

గెలుపు ఇచ్చిన ఆనందం కన్నా 

ఓటమి వలన వచ్చే బాధే ఎక్కువ కాలం వేధిస్తుంది.


The pain of defeat lasts longer than the joy of victory. 

పుష్పరాగ

ఏమిటో ఈ చంద్రుడు తిరుగు పయనం అయ్యాడు
పౌర్ణమి వేళ కూడా తోందరే
మా తోటమాలి లాగా.

కాసిన్ని కబుర్లు చెప్పోచ్చు కదా!
అయినా
జనాలకు ఈ మధ్య తీరికే లేదు
చరవాణి రాజ్యం ఏలుతుంది కదా.
విచ్చుకొన్ని నా రెమ్మల పై పొద్దున్నే  

వాడు నీళ్ళ చల్లి లేపుతాడు.
దేవుడి కోసమంటూ
సుప్రభాత పుష్పరాగ కోసం .

బదరికా గట్టు!

ట్రాక్టర్ దున్నిన పొలం

ఎద్దులు లేని హలం

పురుగు పుట్ర పదిలం

కొంగల అంగడి లా

 బదరికా గట్టు మా పొలం

*******************

వెల్మజాల నర్సింహ ✍🏻

చాతక పక్షి!

వాడు ఎవడో వెనుక బెంచి స్టూడెంట్

 వాలకం చూస్తుంటే కాదు డీసెంట్

కానీ ఎప్పుడూ అల్లరే నాన్ సెన్స్

 చాతక పక్షి వానికి లేదు కామన్ సెన్స్ 


 

وہ ایک طالب علم ہے جو
 کسی کے پیچھے بیٹھا ہے۔

 اگر آپ بادل کو دیکھیں تو یہ مہذب ہے۔

لیکن ہمیشہ ہنگامہ خیز بکواس

 چٹاکا پرندے کی عقل نہیں ہوتی

ویلماجالا نرسمہا ✍🏻

 

అమ్మ నాన్న లా బండి!

నవమాసాలు మోసిన అమ్మ

 తన బరువును నాన్న

 చేతిలో పెడుతుంది.

నాన్న ఆ భారాన్ని 

జీవితాంతం మోస్తూనే వుంటాడు

మంచి వస్తే పొంగిపోడు

చేడు వస్తే కుంగిపోడు

అమ్మ జాబిలి లాంటిది 

తన సంతానం చల్లగా

ఉండాలనుకుంటుంది

నాన్న సూర్యుడి వంటివాడు

నిత్యం కష్టపడుతూ

అందరూ సుఖంగా

 ఉండాలనుకుంటాడు

అమ్మకు సెలవు వుండదు

నాన్న కు భారం తగ్గదు

కాడి ఎద్దుల వారు సంసార

 బండి లాగుతుంటే

మనం బండి లో

 కుర్చోని ఆనందిస్తాం

బంధాల బండిలో 

బంధువులు

ఎందరో వచ్చే 

వారు వస్తుంటారు 

 పోయేవారు

 పొతుంటారు.

అయినా గమ్యం

 తెలియని ప్రయాణంలో

 అమ్మ నాన్నలా బండి లో

 ఆనందంగా

 విహారించే

 మనిషి 

తిరిగి వారికి ఏమి

 ఇవ్వాలో ఆలోచించాలి కదా


31st పార్టీ!

 మనోడే పిలిచాడు 

రారా అని అరిచాడు 

చలిగాలి వీస్తోంది

దుకాణం తెరిచి వుంది

డీజే  పాట మ్రోగుతుంది 

31st పార్టీ అంటా

 తగాలేయ్య డబ్బులు

అమ్మా నాన్నల గుండెలో గుబ్బులు