జీవితం ఆగిపోవచ్చు
ఎదో గాలికి రాలిన ఆకుల
ఎవ్వరో తెంపిన కాయల
పుణ్యం కొద్ది
తొడిమె ఊడిన
పండులా
అయినా జీవితం
సాగిపోవచ్చు
ఎవరో నడుపుతున్న వాహనంలా
గాలికి ఎగిరే పక్షిలా
అబద్ధాలకు సాక్షిలా
రాత్రి పగలు నిత్యం
పుట్టుక చావు సత్యం
బంధాలే నటనలు కావా
డబ్బుకు దాసోహం లోకమని తెలిసి
ముందుకు సాగడమే సుఖం
ముఖం పై చిరునవ్వే
మనిషికి ఆశ కాదా!
వెల్మజాల నర్సింహ ✍🏻
జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం.. గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే
చిరునవ్వు!
Subscribe to:
Post Comments (Atom)
-
పండుగ అంటే : సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయికే పండుగ (Festival). సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సం...
No comments:
Post a Comment