మన స్నేహం !

తారలు తిరిగే వేళా
మన ముచ్చట్లకేది మౌనం
అమావాస్య రాత్రుల్లో
మన మాటలకేది చీకటి
నీవు నేను కలిస్తే
ఆకాశం లో
ఇంద్ర ధనుస్సే
 మన ముచ్చట్ల తో

పక్కింటి వనజా
ఊరి చివరి సుజాత
మల్లేశం చెల్లెలు
ఎవరిని వదలని కబుర్లు

సర్పంచి మొదలు
చాకిరేవు బండ వరకు
తాటి వనం నుండి
చేపల చెరువు వరకు
ఇవే కదా మన ముచ్చట్లు

రాజకీయాలు సరే సరి
సినిమా కబుర్లు భలే భలే
హీరోలా పిచ్చి అభిమానం
ఏమైపోయే మిత్రమా

చరవాణి చేతి కొచ్చే
మాటాలేమో మూగబోయే
సమయం లేదు మిత్రమా
మరల తిరిగిరాని కాలం తో


           వెల్మజాల నర్సింహ ✍🏻

No comments:

Post a Comment