జెండాలు - విగ్రహాలు .



డా. xxxx రెడ్డి మొన్ననే తెలుగు లెక్చరర్ అయ్యిండు మరియు డా. xxxxxxx రెడ్డి  సార్ ఈరోజు కలెక్టర్ గా పదోన్నతి పొందుతున్నారు 

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉంటారు 

ప్రతి రోజూ వార్తలలో వారే! 

ఏ రిజర్వేషన్ లు నమ్ముకొని వారు ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. లేదా వారి స్వయం కృషితోనే

సాధించారా మనం గమనించాలి.


భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి దాదాపుగా 

70వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్నాం 

రిజర్వేషన్లు వాడుకోని మనలో ఎంత మంది ఉన్నంత పదవులు పొందారు. ఎంత మంది ప్రభుత్వ కొలువులో ఉన్నారు.

ఎంత మందికి  గెజిటెడ్ ఉద్యోగాలువచ్చాయి. ప్రతి ఊరిలో ఒక వర్గం వారు అంబేద్కర్ విగ్రహం పెడితే మరికొందరు జ్యోతిరావు ఫూలే విగ్రహం పెట్టాలి అంటుంటారు. వేరే వారికి ఇవ్వేమి ఉండావి.

గణతంత్ర దినోత్సవం నాడు దండలేసి నినాదాలు 

చేసి మరిచి పోతాము. వారు చేసిన పోరాటా సమయం వేరు ఇప్పుడున్న కాలం వేరు వారు గొప్పవారే ,కానీ వారి ఆయుధం అక్షరం  నేడు మన ఆయుధం వారి వారసులం అంతే తేడా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో దేశాలు తిరిగి  ఉన్నంత చదువులు చదివారు. వారి సగం జీవితం చదువులకే  మనం వారి పేరు చెప్పుకొని వారు మనకే సొంతం అనుకుంటున్నాం.' అక్షర పితా' కావాల్సిన వారిని అంటరాని వారికి దేవుడిగా చేసుకున్నాం.


ఊర్లలలో  మంచికి  చెడుకు మనమే ముందుంటాం 

కానీ చదువులో వెనుక ఉంటాం జెండాలు మోసేది మనమే నాయకుడు అయ్యేది మరో వాడు.

మనలో మనం తన్నుకు చస్తాం వాడు పైనుంచి  ఆనందిస్తాడు. మనలో మనమే శత్రువులవుతం.  మన ఇరుగుపొరుగు వాళ్ళం విరోధం మూడో వాడికి ఆనందం.


తప్పు ఎక్కడ ఉంది జెండాలు మోయడం లోన 

విగ్రహాలు పూజించడం లోన మన ఐక్యత ఎక్కడా లోపిస్తుంది.మనం ఎందుకు ముందుకు పోలేక పోతున్నం రిజర్వేషన్లు ఉన్నాయానే సోమరి తనం 

వలన లేదా పూర్తిగా అంబేద్కర్ గారిని అర్థం చేసుకోనందున లేదా చుట్టూ ఉన్న సమాజం వలన 

ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఇప్పుటి తరానికి ఉంది.



వెల్మజాల నర్సింహ.22.01.26.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి