బట్టలకోట్టు సత్యం



మగ్గలకు పగ్గాలేసి
 ముాలన పడేసి

ఆచారం సంచీలోపెట్టి
సామాను సర్దుకోని

పని కోసం బైలుదేరే బస్తీకి
"బట్టలకోట్టు సత్యం

చదువేమే అబ్బలేదు
చేతిలో డబ్బే లేదు

అమ్మకు జబ్బేమే గబ్బవుతుంది

అలోచనతో అడుగేసేన
 బట్టల కోట్టు సత్యం

ముంబయిలో పనికోసం
ముందస్తుగా అమ్మకు చెప్పి
బస్సులో బయలుదేరే
బట్టలకోట్టు సత్యం

చద్ది ముాట చప్పగా కొట్టే
చలేమే సంకను చేరే

అమ్మను తలుచుకు కనీరైయే
బట్టలకోట్టు సత్యం

గుండెమే బరువై పొయే
అమ్మ భాద్యత యాదికి వచ్చే
బస్సులోనే భగవంతుని చేరెన
బట్టలకోట్టు సత్యం
 
*************

**వెల్మజాల నర్సింహ. ..

No comments:

Post a Comment