గుడ్డి దీపం

తాటాకు పై గంటాతో

తాపత్రయ పడ్డారు

రాయడానికి

వారు రాశారు ఎన్నో

 గొప్ప పురాణాలు

రాతి పై ఎక్కేన శాసనాలు

ఇంకు బాటిల్ పెన్ను

గుడ్డి దీపం కన్ను

రాశారు ఎన్నో గొప్ప కావ్యాలు

తెల్ల పేపర్ వచ్చే

 సులభమైన కలం

ప్రేమ పాటలు రాసినా

 కవులకు సలాం

కంప్యూటర్ కాలం

 కావ్య

ముద్రణ రాజ్యం


లక్షలో పుస్తకాలు,

 చదవడం లేదుగా

ఓప్పిక లేని జనం

కానరాని కవులూ ,

ఇదే నేటి తరం

సొంతంగా ఆలోచనలు

 లేని జనం.

చరవాణి పెత్తనం

 నేడు

 నడిపించే గుడ్డి దీపం

*****************

వెల్మజాల నర్సింహ✍🏻

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి