కరోనా(వలస కూలీలు) పాట






పల్లవి:ఒక్కరా  ఇద్దరా వలస కూలీలు

భవన నిర్మాణా పనులో బతికే  అన్నలు (2)

చరణం : ఊరిలో తల్లి దండ్రులు తన వెంటే భార్య  పిల్లలు

సమిష్టి కష్టమే రోజు భోజనం

రోజు రొక్కమే వారి జీవనం

  ఆస్తి అంతస్థుల ఆలోచన లేదు


        :ఒక్కరా  ఇద్దరా:

చరణం: ఎండలు వానలు చుట్టాలు
కష్టాలు కన్నీళ్లు పక్కలు

ప్రపంచంతో పనిలేదు
రోజు పని వుంటే పదివేలు

పూరి గుడిసెలలో నివాసం

అందమైన భవనాల కోసం సాహసం

      :ఒక్కరా  ఇద్దరా:

చరణం:వారి శ్రమ దోచుకునే పెద్దలు

వారి కష్టాలు పట్టించుకోని నేతలు

వారి తల రాసిన దేవుళ్ళు

వారి కుటికేసరు పెట్టిన కరోనా వైరస్..
     :ఒక్కరా  ఇద్దరా:

చరణం.లాక్ డౌన్ వెలా
కాలం
రోజు గడువని కాయం

కనబడాని నేతల సహకారం
పూటా గడువని వైనం
  హలహాలమే శరణ్యం

 :ఒక్కరా  ఇద్దరా:


వెల్మజాల నర్సింహ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి