పల్లవి:
నిప్పుకణం నిప్పు కణం నిప్పుకణం(2)
మనుస్మృతినే
తగులా పెట్టినమానవ రూపం నిప్పుకణం( 2)
చరణం:బడిలో గుడిలో అవమానం
బాల్యమంతా అతనికి బాధలమయం
అడుగడుగునా
అవరోధాల కు
చదువే
ఆయుధమని నమ్మిన చదువులకే
మహా మనిషి
:నిప్పుకణం:
చరణం: శంభుక వధ కథతో చలించిన
తరాల రాతలతో విసుగెత్తి
కులాల కురుక్షేత్రం లో నలిగిన పేదల
కై
మూక్ నాయక్ పత్రిక
తోజన
జాగృతి కై పోరాడిన
:నిప్పుకణం:
చరణం:
రాజ్యాంగ రచనల్లో మేటైనా వారు
తన జాతి జాగృతి
కోసం
తన పదవినే తృణ
ప్రాయంగా వదిలిన వారు
భారత
జాతి గుండెల్లో నిత్యం వెలుగు దీపమై
అతడే
మన నిప్పు కణం
:నిప్పుకణం:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి