బస్తీకి పోతున్నా: Bastī ki pōtunnā


ఊరును మరిచినవ  వలస బాట పట్టినవా

తల్లిని మరిచినవ కన్న పేగును వదిలినవా

భుజలపై నీను పెంచిన తండ్రి  బారం విడిచినవా

బతుకు దెరువు కోసం బస్తీ కి వచ్చినవా

పొట్టకుటికే నీ పయనం
కట్టు బట్టలే నీ నయనం

కారు చీకటే నీ స్నేహం
కడలి అంచులే నీ కుటీరం

రెక్కలపై నీవు రొక్కం కోసం

 పట్నం పనికి వచ్చితివా

బతిమాలే బంధువులండరు

భాధను పంచుకునే భాషా తెలువదు

సకలజనుల సమేళనం

సంపాదనకు సమారోహం

వారం వారంతం సందడి
బస్తీ జీవనం మనందరి

చిన్న మాట. .

ఎంతటిగడ్డివాముయైన
 చిన్నపాటి నిప్పు మిణగురుకు 
బూడిదైనటు,అలాగే మనలోని ఆహం
 మంచి మిత్రుల సాంగత్యం 
 వలన మన దరి చేరదు.

చుక్క.

ఆకాశంలో ఒక చుక్క
ఆ చుక్కని చేరా సిర చుక్క
చక్కని రాతతో సిర చుక్క
అక్కున చెర్చెన అక్షర ముక్క
ముక్కల ముతిని చెక్కగ
చక్కగా కవితాగ  నిలిచేన
చక్కని చుక్కని కవితాని పొగిడేర

ననంద


తరగతిలో టీచర్ సరదాకి కొన్ని ప్రశ్న లు అడుగు తున్నాడు

అందరి సమాధానాలు ఇంచుమించు ఒకేతీరుగా వున్నాయి,కాని

ననంద 'అనే బాలుడి సమాధానాలు వేరుగా వున్నాయి .

టీచర్ :సృష్టిలో నీవు చుాసిన అందమైన వారెవరూ?

ననంద: మా అమ్మ గురువు గారు

టీచర్: విశాల ప్రదేశం ఏది?

ననంద: మానాన్న గారు.

టీచర్: మంచి మిత్రుడేవరు  ?

ననంద: కాలము గురువు గారు.

టీచర్: సుఖం అంటే ఏమిటి?

ననంద: ఆర్థం తొ వచ్చేదనుకొవడం .

టీచర్: మరి కష్టం అంటే?

ననంద: ఇష్టంగా లేనిది ఎదైనా.

టీచర్ :దేవుడేవరు

ననంద: నమ్మకామే దేవుడు గురువు గారు


 టీచర్ ననంద జవాబులకు సంతోషించాడు.

చివరకు గురువుగారు ఇలా సెలవిచ్చారు

"నలుగురు నడిచినా బాట నడక సులభం కానీ నీవు 
నడిచినా బాటలో నలుగురు నడవాలి అదే
 ప్రతేకాకర్షణగల మనిషి లక్షణం.

కాల కేళి "✍🏻

మనసున్న మహారాజుకు మగువలు ఆరుగురు

వంతుల వారిగా వచ్చిపోవుదురు
రాణులలొ మహా రాణి వసంత వయ్యారి
చైత్ర,, వైశాఖ మాసంలో
యవ్వన కేళి

నవయుగ ఆరంభ
ఉగాది రవళి

తెలుగు కవులకు
పోటీల పండగ

గ్రీష్మ రాణి రెండువదైన
ఎండలు మెండుగా మండేన

బండల గుండెలు అదిరేన

జ్యేష్ఠ, ఆషాఢ మాసంలో  పెండ్లి  భజా భజంత్రి మేగేన

సృష్టికి బీజం వేసేన

అన్నం పెట్టె రాణి పంటల పరికిణీ  వర్ష వర్షిణి

మేఘనికి గాలం వేసి
 వర్షని రప్పించేన

పడి పంటలతొ ప్రకృతి పులకించేన

శ్రావణ, భాద్రపద మాసంలో అన్న చెల్లల బంధం

చవితి పండగ మెుధం

నాల్గవ రాణి శరత్దృవు
ఆశ్వయుజ, కార్తీక మాసంలో

దసరా దీపావళి
పండుగలు తెచ్చేన

పంచవ రాణి హేమంత

మార్గశిర, పుష్య మాసంలో
చలితొ సరదా
సంక్రాంతి ముగ్గుల పరదా

పండిన పంటలు ఇంటికి చేరగ

కడపటి రాణి శిశిరం

మాఘం, ఫాల్గుణం మాసంలో

చెట్టు కొమ్మలు కొత్త బట్టలతొ

లేలేత రంగుల సిగ్గుతో

హొళీ ఆటలు  రంగుల పువ్వులతో

ఇలా దాగుడు ముాతల కాలంతో

సాగే మానవ "కాల కేళి"

నేటి రాజకీయ పోకడ:




ధనం వుంటే కుర్చేగదారా

గధలాగ జనమే కదరా

కుర్చీవుంటే ఖర్చేగదారా

కసాయి వాడిలా దోసేయ్ బ్రదరా

కుర్చీ పై మమకారమే కదరా
మంది పై కారం చల్లారా

మనోడిని మంత్రిని చేద్దాం కదరా

ఆడ పిల్లలా మానం దొచేద్దం పదరా

చెరసాల కృష్ణుడి
జననం కదరా

మనమే కాదోయ్ స్వామిలను తొడుకు పొద్దం పదరా

లంచాలను పంచుకు తిందాం సొదరా

 రాజుల బతుకేదం బ్రదరా

వాడి - వేడి


ఓటర్ దేవుళ్ళు అందరుా
కొటర్ మనుషులు కొందరు
సమానత్వం  రాతలలో
కులం కులం మని చేతలలో
ఓట్లా కోసం ఒక మాటా
గేలిచినంక మరొతుాట
తాతల పేర్లతో జపం జపం
నీతి మాటలతోనే   గఫ్పం గఫ్పం
 ఓటమి ఒక గుణపాఠం
గెలుపు ఒక గర్వం గౌరవం
కాలగామనంలో కొని రోజులు
చీకటి రోజులు మరువం
పరువం
న్యాయం జరిగేది నాలుకపై పైన
నిజం ఎప్పుడు నిజం కాదు
నీది నాది పిచ్చి వేదేనయే

నది -River

దిజ గంగ నదిగా మారి
భగీరథుడిని కోసం వచ్చే

జటాజుటం పైన చేరి
నాన్నటికి నదిగా వచ్చే

పాపలను తొలగించ
ప్రత్యక్షమై ప్రవేశించే

భీడుభుాముల
సస్యశ్యామలం చేయ

ధరణి పై ఆరుదేంచే

గంగ సింధు యమున బ్రహ్మపుత్ర సరస్వతై
మాము పవనం చేయా

సింధూ రావి బియాస్ సట్లెజ్ చీనాబ్ పేర్లతొ

 గోదావరి కృష్ణ పెన్న కావేరి నర్మద తపతై

లేడి పిల్లలా ఆడవి
 కన్యా లా నదిగాంచే

పరుగుల నది చివరకు
సాగరంలొ నిలిచే

భారతవాని నదుల ఆవనిగా మనం కొలిచే

నదియే నాభి కదా మనదేశాన్నికి
 
********************


దేవతలు

అదృశ్య రుాపం లో లేరు
దేవతలు
అడుగడున కుశలం మడుగుతుంటారు

ఆకలవుతుందాని ఆవుతొ అన్నాను
ఆది నాకు పాలిచ్చి ఆదరించింది

దప్పికేస్తుందాని చెప్పితే వాగుతొ
దోసిలతొ నీరు తాగి పొమ్మంది
ఆటలడుకొని ఆలసి పొయాను
కొమ్మ లో పండు చెట్టు కొసు కొమ్మంది

కొక్కొరొ కొ....




కంగీ కి అంగే లేదు
కాలానికి కళ్లేం లేదు
ఆకలికి పళ్లెం లేదు
ఆనందనికి అవధి లేదు
మనందరికీ సమయం లేదు
రాజకీయానికి విలువ లేదు
చట్టానికి  చుట్టం లేదు

క్షమాపనకు మించిన శిక్షే లేదు

తాగ్గిన వాడికి నరకం లేదు
ఇతరులను ఒర్వ లేనివాడికి సుఖం లేదు

జీవితమంటే ?

సముద్రానికి మానవ మనుగడకు 
చాలా దగ్గర పోలికలు వున్నాయి.

అలల లాగే మానవ జీవితం లో
 కష్టాలు వస్తు పోతు వుంటాయి.

కానీ మనిషి సుఖలా గురించే
 ఆలొచిస్తుంటాడు.

అలల లకు అలుపు లేదు 
జీవితాన్నికి గమ్యం లేదు. 
దారి వెతుక్కుంటూ ముందుకు సాగాలి.

సముద్రం లాగా శాంతిగ వుండాలని
 అనుకుంటే,
 దాని తర్వాత వచ్చే పరిమాణం
 తీవ్రంగా వుంటాయి.

పై పైకి వీర్ర వీగతే సముద్రం
 లాగా సమాజం అణచి వేస్తుంది.

కాలమే సమాధానం 
,అనుభవమే గుణపాఠం.
సముద్రం లో ఈదటం
 కష్టం కాని జీవితం లో ముందుకు  
సాగడం చాలా కష్టం 
దానికి ఒకటే
ఆయుధం సహనం. 


@వెల్మమజాల నర్సింహ.

అమ్మ పాట:

పచ్చని పచ్చని

చేనుపచ్చని కన్నయ్య

పంట చేల మధ్య టుంగు టుయాలా కన్నయ్య

ఎన్గుయేంకటమామ
వచ్చిపోతాడు కన్నయ్య

జోల చీరలొ నీను  జొ..... కొడుతాడు కన్నయ్య

కముజు పిట్ట తాత కలవరపేడితేకన్నయ్య

వడ్లపిట్ట మామ వంత పడేన కన్నయ్య

కోకిలమ్మ లా మధర గానమే కన్నయ్య

మైమరచి నీను నిద్ర పుచ్చేన కన్నయ్య


పచ్చ పచ్చని పచ్చిగడ్డి పరకలే
కన్నయ్య

పాట పాడుతుంటే వంత పడేన కన్నయ్య

తలరాత రాసిన బ్రహ్మ దేవుడే కన్నయ్య

అడివమ్మ ఒడిలొ పేరగమని రాసేన కన్నయ్య


నీ బొసి నవ్వులే నా కన్నయ్య

నా మధ్యాహ్న బువ్వ అయేరా కన్నయ్య

సి'గగన 'తార (Cinema Star)


ఆకాశం లో ఒక తార
 తన  గమ్యం మరచి
భుా లోకం వచ్చేన
మైమరచి
తిమిరంతొ విరహాం పొంది
రవి కిరణం పై మెాహం వలచి
తను మరిచేన యవ్వనం కవ్వించేన


రాజమహల్ విడిది  విడిచేన
రంగుల లోకంలో నడిచేన
తార ముచ్చట పడేన
మన దీప వెలుగులో
తార తారగా రాక
సినీతారగ వచ్చేన

******************

             వెల్మజాల నర్సింహ

వక్షోజాలపై వస్త్రం ధరిస్తే పన్ను.. వక్షోజాల పరిమాణం బట్టీ పన్ను





చరిత్ర పుటల్లోకి వెళ్తే ఎన్నో విషాధగాథలుంటాయి. అప్పట్లో కేరళ ట్రావెన్‌కోర్ రాజులు విధించిన పన్నులు చాలా దారుణంగా ఉండేవి. 18 వ శతాబ్దంలో ట్రావెన్కూర్ ( తిరువనంతపురం) ను పాలించిన రాజులు రకరకాల పన్నులను విధించారు. ట్రావెన్‌కోర్ రాజులు స్త్రీల రొమ్ములపై కూడా పన్ను విధించేవారు. ఈ పన్ను చాలా దారుణంగా ఉండేది. ఈ పన్ను చెల్లించడానికి మహిళలు చాలా ఇబ్బందులపడాల్సి వచ్చేది.

మార్తాండ వర్మ అవి కేరళను ట్రావెన్కోర్ మహారాజు మార్తాండ వర్మ పరిపాలిస్తున్న రోజులు. మార్తాండవర్మ వక్షోజాలపై పన్ను(ముళకరం)తో పాటు తలక్కారం అనే పన్ను కూడా విధించారు అంటే గడ్డాలు, మీసాలపై కూడా రాజు పన్ను విధించారు. అలాగే మహిళలు, పురుషులు ఆభరణాలు ధరించాలన్నా అప్పట్లో పన్ను కట్టాల్సిందే.

ఉన్నత వర్గాల వారు మాత్రమే

ఉన్నత వర్గాల వారు మాత్రమే ట్రావెన్కోర్ రాజ్యంలో అప్పట్లో కేవలం ఉన్నత వర్గానికి చెందిన మహిళలు మాత్రమే వక్షోజాలపై దుస్తులు ధరించాలి. సమాజంలో రాయల్టీ ఉన్న మహిళలు మాత్రమే వక్షోజాలను దాచుకోవచ్చు. దళిత , గిరిజన , బడుగు , బలహీన వర్గాల మహిళలు వక్షోజాలపై వస్త్రాల్ని ధరించకూడదు. బ్రాహ్మణ కుటుంబంతో పాటు కొన్ని అగ్రకులాలకు చెందిన స్త్రీలు లోన రవికె వేసుకుని, పైన చీర కొంగు కప్పుకునే అర్హత ఉండేది. ఇది రాజు ఆజ్ఞ.


కాడేద్దు ,ముల్లుకర్ర

 నేేలమ్మకు రైతు నేచిన చీర పచ్చని 
రంగుని పొందేనొయ్
కాడేద్దు ,ముల్లుకర్ర తొ కలిసి 
ముందుకు నడువాలొయ్
అడివమ్మ పేరంటానికి అడిగిందొ కొక్కా
నీలాంబరి యై కనువిందు చేయు
నిటారుగా నిలబడే నొయ్
పచ్చని పంటల నుండి
జీవి మనుగడ పొందేనొయ్

ముందడుగు





నీవు వేసే పతి అడుగు
పంకజమే కావొచ్చు

దానిలో నుండి పరమాన్నం పుట్టొచ్చు

కష్టంచి పనిచేస్తే ఫలితం వుండొచ్చు

తొందరగా కాకుండా సమయం పట్టొచ్చు

కాలంలో పాటు వయసు
పయనం లో

సంపద పైన ఆశ పేరుగావచ్చు


పుణ్యం పాపం మంటూ
కాలం గడుపవొచ్చు


చివరకు మిగిలేది
ఏమి లేదాని భాధ పడవచ్చు

"నీ ధైర్యంమే నీ భవిష్యత్తును
 నిర్ణయించవచ్చు

ఇదే నీ ఆయుధంగా
ముందడుగు వేయవచ్చు
********

వెల్మజాల నర్సింహ
10.12.19

కాలభైరవ

అర్థం లేని వార్తలతొ
పైసలే పరమార్ధం మని
రోజుకొ వార్తలొ  వుండాలని
వివిధ చానల్స్ కాలభైరవులే

పతి యాజమాన్యం
విలువలు లేవు

పాుమాణిక పటింపులులేవు

ముందుగా మేమే వుండాలని

టెలివిజన్లని కాలభైరవులే

రాసే రాతలు, చెప్పె  మాటలు

చేసే చేతలు చెత్తేగా

రాజకీయ రణరగంలొ
కాలకూట కాలభైరవులే

నీతికి నిలబడి నేటికీ
నిజమే చెప్పుతుా

నిజమైన జర్నలిస్ట్ కొందరు

మరుగున పడిర వారు
పోరాడే పటిమ లేక

జటాయువు

  చెట్టుతొ మనిషి బంధం ప్రాణం
వున్నంత వరకు వీడునా

గాలితో అనుబంధం
గడియ లేనిదే గడువున

అన్నంపెట్టె నీ జాతికి
ఆంగుళంలొ నైన గుడి వుందా

నీ ఆణువణువూ ఉపయోగం
మా ఆణువణువూ హాలహలం

కల్పవృక్షలు మీలో కర్కటకులు మాలో

మంచికి మంచై మందులుగ  మీరైతే

మానవత్వం మరచి
నరకడంలొ మేమైతిమి

పండ్లను ఇచ్చిన మీకు
రాళ్ళ దెబ్బలను  మేమి చ్చితిమి

అమ్మ కడుపులో తొమ్మిది నెలలె

నీతో సహవాసం చచ్చేవరకు

ఇంటికి కాపల నీతోనే
కైలస యాత్ర నీ పైనే

జీవులకు  రక్షణ నీతోటే
మృగ జీవాలకు ఆహారం
నీలోనే

వానా పిలువుకు ముత్తైదువులు మీలొనే

పరోపకారమే  మీ ధర్మం

మీ బతుకులను నాశనమే
మా కర్మం

మెుక్క నాటాని మనిషి
నేడు "నీను" జటాయువుగ మార్చేన.

**************
వెల్మజాల నర్సింహ.
7.12.19

నేటి ఆయుధం

సొషల్ మీడియా మాయ
సొల్లుతొ గడిచే గడియ

ప్రపంచమంతా సేల్ లో

పక్కవాడితొ పనేముంది గల్లీలొ

మన తెలివాంత నెట్ లో

 ఫేమస్ మాత్రం ఫేస్ బుక్ లో

ఫబ్ గేమ్స్ లో ముందుటాము

పై చదువులు వెనుకంజ లో

విత్తం ఆర్జన కోసం వుండదు ఎక్కడ

పైస ఖర్చు చేయడం లో  ఆఫర్లులేనొ

పెద్దకు విలువ మరిచాము ఎప్పుడొ

పెద్ద ఫొన్ పతి ఒకరి  చేతిలో

సినిమా, ఆట పాట దీనిలో

కుాడు, గుాడు,గుడ్డ,
మరిచే దీనితో

మహావిష్ణుకు సుదర్శన చక్రం నేడు

సేల్ లేని చెయ్యి లేదు లోకంలో నాడు

**********************
వెల్మజాల నర్సింహ

చదువే నా ఆయుధం :


చదువే నా ఆయుధమని
సాగించిన జీవన సమరంలో

రక్తం మరిగే అవమానాని
రాజ్యంగాం తొనే  సమాధానమని

గరళం మింగిన శివుడిలా
మంచి  గ్రంథాలనే రచించావు

కత్తి వైరంతొ కాదని కలంతో సమాధానం చెప్పావు

నేటి యువత చదువే ఒక ఆయుధంగా
ముందుకు సాగాలంటు

మీ సందేశంగా భవిస్తే

అంబేడ్కర్ ఒకరు కాదు
మరేందరొ మహానీయులురారా

భారతరత్నలుగా ఎదగరా
 


వెల్మజాల నర్సింహ. 6.12.19

మా ఊరి దేవుళ్ళు. ..


అయోధ్యలో రాముడంట
 అగ్ర వర్ణాలకు దేవుడంట

సామాన్య మనుషుడంట
 చాడిల మాట వినే నంట

రాయిని తాకే నంట
నాతిగ మర్చేనంట

ద్వారకా లో కృష్ణుడంట
చూడాలంటే కులమడుగుతారంట

పదహారువేల  బార్యలంట

పక్కింట్లో వెన్న దొంగాంట

ఏడు కొండల వేంకనంట
చూడాలంటే డబ్బులుండలంట

కొండాలపై వుంటడంట
కోరిన దిగిరాడంట

గరీబొళ్ల దేవుడంట
గట్టు పొచ్చమ్మంట

ఊరుని కాపాడేందుకు
ఊరి
బయట వుండునంట

మావురాల ఏల్లమ్మంట
మన చేను పక్క వుండునంట

మైసమ్మ ,ముత్యాలమ్మంట

మాఊరి దేవులంట.
 
 
********************

వెల్మజాల నర్సింహ. .

మహా బుుషులు వారు"

యాదాద్రి భువనగిరి జిల్లా,తెలంగాణ.రాష్ట్రం,
వేములకొండ
 ప్రాంతంలో  గుట్ట పై

జై... శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహా  స్వామి
కొలువుదిరారు.గుట్టకు
క్షేత్రపాలకుడిగ హనుమంతుడు కాపలా
కస్తుంటాడు. పతిదినం తెల్లవారక ముందే ఒక ముసలి మనిషి 
గుట్ట దిగి పోవడం .నడిరేయి  కాగానే పైకి రావడం 
గమనించినా హనుమ మారువేషం లో యువకుడిగ మారి. .

ఒక రోజు జామురాతిరి లో నడుచుకుంటూ వస్తున్న 
పెద్ద మనిషిని  ఆపి.


....తాత గుట్ట పైకేన పయనం.

హ....అన్నటు తల ఉపాడు.

హనుమ దగ్గరకు పొయి
ఎందకు తాత అన్నాడు .

దానికి తాత చిన్న చిరునవ్వు తొ. .

స్వామికి ఎదురుగా వున్న కొలనులో
వున్న మహా రుషులు
నీటి పై జపం చేస్తుంటారు

వారితో పాటుగా నేను కుడా. ..
  స్వామీ ని ధాన్యించాటనికి


ఒం. ..నమో నారాయణ. ఒం. ..నమో నారాయణ.

అంటు స్వామి సన్నిధి లొ  కాలం గడుపుతున్న అనగా.

మారు వేషంలొ వున్న హనుమ. ..కోపం తొ

పైన కొలనులో నామాల

మీనాలున్నాయ్  కాని
బుుషులేక్కడ .

పైగా పతిరోజు నేను గర్భా గుడి, కొలనులో చేపలను
 గమనిస్తూ వుంటాను అన్నాడు హనుమ.

వాదోపవాదాల తరువాత హనుమ. ..
ముసలివారి వెనుకా నడుచుకుంటూ పైకి వెళ్ళుతునా 
సమయంలో ముసలి. .అడుగు అడుగుకి

ఒం. ..నమో నారాయణ
జపం చేస్తూ పోతుంటే

అంజనీ పుత్రుడు కుడా
రామా రామా అంటు
అనుసరించాడు.

పైకి వెళ్ళిన హనుమకు
ముాల విరాట్ లో రాముడుగాను ఎదురుగా
 కొలనులో చేపలు మహా రుషులుగా కనిపించసాగారు.



"నీ దృష్టి దేని పై వుంటే
సృష్టి అలాగే కనబడుతుంది.

నీవు రాయిగా బావించినది మరొకరికి
దేవుడిలా కనిపించ వచ్చు.

జై... శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహా  స్వామి.
 
 
 
***************


*వెల్మజాల నర్సింహ. .
05.12.19

పాట పుట్టుక :

మాదిగ డప్పు పై మనసైయే దేవునికీ
మనువడ మల్లన్న
మాదిగ డప్పులకు కబురంప
డప్పు పై దరువుతొ
చిందేయేగ జనమంతా
డప్పు డప్పుల చప్పుడుతొ...
ఒళ్లంతా పులకరించి
కుని రాగంతొ పాటకు
తొలినంది పలికేనా
ఆట పాటకు డప్పే ఆది గురువైయేన
మాదిగ డప్పే శుభ కార్యం కు 
ముందడుగైయేన

మచ్చిక లేని మనుషులతో ..

మచ్చిక లేని మనుషుల మధ్య 
మనదైన జీవనంలో

స్పందన తప్ప సమాజాన్ని  మార్చడం కోసం

సమాజంలో నీ. ..నా.. పాత్ర ప్రేక్షక పాత్రేగ

మృగాలను మచ్చిక చేసే మనిషి

 మానవ మృగాల మధ్య
జీవిస్తున్నాడు

ఆర్థరాత్రి స్వాతంత్ర్యం మని
ఆంధకార బంధురంతొ

ఆగాంగం దోపిడైన నేటి
 స్త్రీ జీవితం

రక్తపు ముద్ద ల పొంగులపై కామక్షణికంతొ

 కనబడదే మానవత్వం మరచి

మానవ మృగాల వేటకు

బలియైన ఆడ పడుచుల వేదనతొ

ఘొషిస్తుంది భారతమాత

ఇంకాన ఇకపై సాగదాని
మనమంతా శపథం చేద్దాం.


(ప్రియాంకరెడ్డి సంఘటన పై నా మనో వేదన)