మా ఊరి దేవుళ్ళు. ..


అయోధ్యలో రాముడంట
 అగ్ర వర్ణాలకు దేవుడంట

సామాన్య మనుషుడంట
 చాడిల మాట వినే నంట

రాయిని తాకే నంట
నాతిగ మర్చేనంట

ద్వారకా లో కృష్ణుడంట
చూడాలంటే కులమడుగుతారంట

పదహారువేల  బార్యలంట

పక్కింట్లో వెన్న దొంగాంట

ఏడు కొండల వేంకనంట
చూడాలంటే డబ్బులుండలంట

కొండాలపై వుంటడంట
కోరిన దిగిరాడంట

గరీబొళ్ల దేవుడంట
గట్టు పొచ్చమ్మంట

ఊరుని కాపాడేందుకు
ఊరి
బయట వుండునంట

మావురాల ఏల్లమ్మంట
మన చేను పక్క వుండునంట

మైసమ్మ ,ముత్యాలమ్మంట

మాఊరి దేవులంట.
 
 
********************

వెల్మజాల నర్సింహ. .

No comments:

Post a Comment