వక్షోజాలపై వస్త్రం ధరిస్తే పన్ను.. వక్షోజాల పరిమాణం బట్టీ పన్ను





చరిత్ర పుటల్లోకి వెళ్తే ఎన్నో విషాధగాథలుంటాయి. అప్పట్లో కేరళ ట్రావెన్‌కోర్ రాజులు విధించిన పన్నులు చాలా దారుణంగా ఉండేవి. 18 వ శతాబ్దంలో ట్రావెన్కూర్ ( తిరువనంతపురం) ను పాలించిన రాజులు రకరకాల పన్నులను విధించారు. ట్రావెన్‌కోర్ రాజులు స్త్రీల రొమ్ములపై కూడా పన్ను విధించేవారు. ఈ పన్ను చాలా దారుణంగా ఉండేది. ఈ పన్ను చెల్లించడానికి మహిళలు చాలా ఇబ్బందులపడాల్సి వచ్చేది.

మార్తాండ వర్మ అవి కేరళను ట్రావెన్కోర్ మహారాజు మార్తాండ వర్మ పరిపాలిస్తున్న రోజులు. మార్తాండవర్మ వక్షోజాలపై పన్ను(ముళకరం)తో పాటు తలక్కారం అనే పన్ను కూడా విధించారు అంటే గడ్డాలు, మీసాలపై కూడా రాజు పన్ను విధించారు. అలాగే మహిళలు, పురుషులు ఆభరణాలు ధరించాలన్నా అప్పట్లో పన్ను కట్టాల్సిందే.

ఉన్నత వర్గాల వారు మాత్రమే

ఉన్నత వర్గాల వారు మాత్రమే ట్రావెన్కోర్ రాజ్యంలో అప్పట్లో కేవలం ఉన్నత వర్గానికి చెందిన మహిళలు మాత్రమే వక్షోజాలపై దుస్తులు ధరించాలి. సమాజంలో రాయల్టీ ఉన్న మహిళలు మాత్రమే వక్షోజాలను దాచుకోవచ్చు. దళిత , గిరిజన , బడుగు , బలహీన వర్గాల మహిళలు వక్షోజాలపై వస్త్రాల్ని ధరించకూడదు. బ్రాహ్మణ కుటుంబంతో పాటు కొన్ని అగ్రకులాలకు చెందిన స్త్రీలు లోన రవికె వేసుకుని, పైన చీర కొంగు కప్పుకునే అర్హత ఉండేది. ఇది రాజు ఆజ్ఞ.


No comments:

Post a Comment