ఊరును మరిచినవ వలస బాట పట్టినవా
తల్లిని మరిచినవ కన్న పేగును వదిలినవా
భుజలపై నీను పెంచిన తండ్రి బారం విడిచినవా
బతుకు దెరువు కోసం బస్తీ కి వచ్చినవా
పొట్టకుటికే నీ పయనం
కట్టు బట్టలే నీ నయనం
కారు చీకటే నీ స్నేహం
కడలి అంచులే నీ కుటీరం
రెక్కలపై నీవు రొక్కం కోసం
పట్నం పనికి వచ్చితివా
బతిమాలే బంధువులండరు
భాధను పంచుకునే భాషా తెలువదు
సకలజనుల సమేళనం
సంపాదనకు సమారోహం
వారం వారంతం సందడి
బస్తీ జీవనం మనందరి
No comments:
Post a Comment