జటాయువు

  చెట్టుతొ మనిషి బంధం ప్రాణం
వున్నంత వరకు వీడునా

గాలితో అనుబంధం
గడియ లేనిదే గడువున

అన్నంపెట్టె నీ జాతికి
ఆంగుళంలొ నైన గుడి వుందా

నీ ఆణువణువూ ఉపయోగం
మా ఆణువణువూ హాలహలం

కల్పవృక్షలు మీలో కర్కటకులు మాలో

మంచికి మంచై మందులుగ  మీరైతే

మానవత్వం మరచి
నరకడంలొ మేమైతిమి

పండ్లను ఇచ్చిన మీకు
రాళ్ళ దెబ్బలను  మేమి చ్చితిమి

అమ్మ కడుపులో తొమ్మిది నెలలె

నీతో సహవాసం చచ్చేవరకు

ఇంటికి కాపల నీతోనే
కైలస యాత్ర నీ పైనే

జీవులకు  రక్షణ నీతోటే
మృగ జీవాలకు ఆహారం
నీలోనే

వానా పిలువుకు ముత్తైదువులు మీలొనే

పరోపకారమే  మీ ధర్మం

మీ బతుకులను నాశనమే
మా కర్మం

మెుక్క నాటాని మనిషి
నేడు "నీను" జటాయువుగ మార్చేన.

**************
వెల్మజాల నర్సింహ.
7.12.19

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి