కాల కేళి "✍🏻

మనసున్న మహారాజుకు మగువలు ఆరుగురు

వంతుల వారిగా వచ్చిపోవుదురు
రాణులలొ మహా రాణి వసంత వయ్యారి
చైత్ర,, వైశాఖ మాసంలో
యవ్వన కేళి

నవయుగ ఆరంభ
ఉగాది రవళి

తెలుగు కవులకు
పోటీల పండగ

గ్రీష్మ రాణి రెండువదైన
ఎండలు మెండుగా మండేన

బండల గుండెలు అదిరేన

జ్యేష్ఠ, ఆషాఢ మాసంలో  పెండ్లి  భజా భజంత్రి మేగేన

సృష్టికి బీజం వేసేన

అన్నం పెట్టె రాణి పంటల పరికిణీ  వర్ష వర్షిణి

మేఘనికి గాలం వేసి
 వర్షని రప్పించేన

పడి పంటలతొ ప్రకృతి పులకించేన

శ్రావణ, భాద్రపద మాసంలో అన్న చెల్లల బంధం

చవితి పండగ మెుధం

నాల్గవ రాణి శరత్దృవు
ఆశ్వయుజ, కార్తీక మాసంలో

దసరా దీపావళి
పండుగలు తెచ్చేన

పంచవ రాణి హేమంత

మార్గశిర, పుష్య మాసంలో
చలితొ సరదా
సంక్రాంతి ముగ్గుల పరదా

పండిన పంటలు ఇంటికి చేరగ

కడపటి రాణి శిశిరం

మాఘం, ఫాల్గుణం మాసంలో

చెట్టు కొమ్మలు కొత్త బట్టలతొ

లేలేత రంగుల సిగ్గుతో

హొళీ ఆటలు  రంగుల పువ్వులతో

ఇలా దాగుడు ముాతల కాలంతో

సాగే మానవ "కాల కేళి"

No comments:

Post a Comment