సాయంత్రం వచ్చిన చుట్టం లా
చినుకులా వాన మొదలైంది
గుడిసె సురుకు గిజ్జిగాడి కూతలు
వచ్చిన వారంతా మా ఇంటి ఆడపడుచుకు తలంటు పోశారేమో
ముఖం నిగనిగలాడుతుంది పచ్చగా ఉదయం వేళ!
ఈ పూట ఎక్కువే తిన్నట్లుంది
కోయిలమ్మ పాట మొదలెట్టింది
బసవన్న అరుపులకు అర్థం ఏమిటో
అమ్మా కళ్ళాపి చల్లి ముగ్గు వేస్తుంది
ఇంటి ముంగిట వేప చెట్టు దగ్గర.
వెల్మజాల నర్సింహ ✍🏻
No comments:
Post a Comment