మట్టి కవిత్వం !



వారి అక్షరాలలో
 తొలకరి జల్లుల మట్టి వాసన
వారి పదాలలో మొదటి సారి
దుక్కి దున్నిన సాల్ల వరుసలా

నిన్నటి  రాత్రి చినుకులకు
ఉదయం మొలిచిన మొక్కలా
అల్లంత దూరాన
పచ్చిక బయళ్లలలో
 పిచ్చుకల గానంలా
ఎర్ర దిబ్బలలో వేరుశేనగ సాగులా

మల్లి బావి కంచేలో పురుడు
 పోసుకున్న మా గంగాలా
గంతులేసే లేగ దూడలా

బదరిక వనంలో తియ్యని
 తాటి పండులా
రంగు వేయాని ఇంద్రధనుస్సులా

చెరువులలో గంతులేస్తున్న
చేప పిల్లలా

నిండు పున్నమిగా పూసిన
 తంగేడు చెట్టులా
ఊట సేలిమేలో తియ్యని నీరులా
బురద పొలంలో కొంగల గుంపులా

బంగారాన్ని సింగారించుకున్న
 సర్కారు వృక్షంలా
మామిడి పూత కోసం
 వచ్చిన వసంత కోయిలా
అంతా వారి అక్షరాలలో
 మట్టి వాసనే
అందుకే చదివిన వారు దానిని
 మట్టి కవిత్వం అన్నారు

వెల్మజాల నర్సింహ ✍🏻

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి