చిరుజల్లులు

 భూదేవికి స్నానాలంట పురుడు పోసుకోవడానికి 

గింజకు ప్రాణాలంట మొలకెత్తడానికి

వానామ్మకు చిరునామా ఎందుకు

 చిరుజల్లులు కురవడానికి



నేటి సమాజంలో

 నేటి సమాజంలో 

స్మార్ట్ ఫోన్ వున్న ప్రతివాడు

 గొర్రెల తయారయ్యాడు వచ్చిన

 ప్రతి మెసేజ్ ఫార్వర్డ్ చేయటమే.

 .జీవితంలో నిన్ను నీవు  నమ్ముకుంటే  

అ విజయానికి తొలి మెట్టు 

 ఒక మెుక్క నాటు అది నీకూ జీవితాంతము
 నీడనిస్తుంది 

అలాగే తోటివారికి
చేతనైన సహాయం చేయండి
 జీవితాంతము 
 
నిన్ను గుర్తుంచుకుంటాడు

జేతలబావి(జలతార బావి

 

సృష్టిలో పుట్టిన లేదా పుట్టించిన ప్రతి దానికి చరిత్ర వుండదు కొ

న్నింటికీ మాత్రమే వుంటుంది. 

పుట్టిన ఊరు కన్న తల్లితో సమానం

 కొన్ని గ్రామాలు కట్టడాల  వలన ఫేమస్ అవుతాయి. 

అలా దుప్పెల్లి గ్రామంలో వున్న జేతలబావి(జలతార బావి)  గురించి చెప్పాలంటే 

జలం అనగా నీరు 

తార అనగా నక్షత్రాలు 

స్వచ్చమైన నీటితో రాత్రిలో నక్షత్రాలు స్పష్టంగా కనిపించే విధంగా వుండేవి. 

అలాగే రాత్రి వేళలో దేవ కన్యాలు వచ్చి స్నానాలు 

చేసేవారేమెు శబ్ధాలు వచ్చేవి అని అక్కడ పని చేసిన పెద్దలు అంటుంటారు. ..

బావి గురించి చెప్పాలంటే కాకతీయుల 

చివరి రాజు ప్రతాప రుద్రడి కాలంలో తవ్వ

బడిన స్థానిక దొర గారిది 

అప్పటి కాలం సువర్ణ యుగామని చెప్పవచ్చు  ఎందుకంటే 

తిన్న డానికి సరైన ఆహారం లేకున్నా 

వ్యవసాయ క్షేత్రాలలో దొరికే పండ్లు కాయలతో 

హాయిగా జీవించేవారు. 

దొరగారు ఎంతో ఇష్టంగా తవ్వించి చుట్టూ బండాలపై దేవతా ప్రతిమలను వేయించారు.

నీరు చాలా తీయగా వుండి వ్యవసాయానికి వాడేవారు. 

చుట్టూ ప్రక్కల రావి మరియు పెద్ద ఊడలమర్రి చెట్టు వుండేది. 

ఇరవై ముప్ఫై మంది జీతాగాండ్ల తో నిత్యం 

కళకళలాడుతుండేది.

ప్రక్కనే పెద్ద పశువుల దొడ్డి తో సంతల రద్దీగా వుండేది. 

కానీ నేడు దొరలు లేరు బావులా శోభలేదు 

మా చిన్నతనంలో అని చెపే తాతయ్య తప్ప 


 *వెల్మజాల నర్సింహ*26.5.21

కామం కాదు లోకమనేది


 కామం కాదు లోకమనేది 

సృష్టిలో తీయనైనది 

సృష్టికే ముాలమైనది 

యవ్వనంలో పరుగులైనది 

యద లో పొంగే ప్రేమైనది 

క్షణ కాలం బొంగారమైనది

క్షణమీడని జీవన మైనది

రతి సతి తో  ఐక్యమైనది

 లోకమంతా మైకమైనది 

కామం గెలిచితే వీరుడనది 

ప్రపంచ శాంతికి 

మార్గ మనది

కామం కాదు లోకమనేది

యవత తెలుసుకుంటే భవితనది

బతుకే బతుకు

 బతుకులు బత్తాయి బతుకులు

బతుకులు బతుకుతున్నామనే

 సందేహం లో బతుకులు

బతుకులు మనవాళ్లు

 వున్నారని  భ్రమలో బతుకులు

బతుకులు చచ్చేదాక

 సంపాదన ధ్యేయం బతుకులు

బతుకులు ఏవరి కోసం, 

ఎందుకో బతుకులు

బతుకులు పుట్టామా

 గిట్టామా బతుకులు

బతుకులు భుక్తి కోసం

 పోరాట బ్రతకులు 

బతుకులు భుామికోసం

 బతకులు 

బతుకులు భయం 

 భయం బతుకులు 

కానీ  సంతృప్తి చెందిన

 బతుకే బతుకు కదా



అణగారిన జాతికే వెలుగంట

 ఎవరో రాసింది చరిత్రంట

 మీరు రాసింది మా తలరాతంట 

ప్రపంచ మేధావి మీరంట

మీరాతలే గీతాగ నేడంట

అక్షరమే ఆయుధం నీదంట 

అన్ని వర్గాలకు మేలంట 

దీపం వెలుగులో చదువంట 

అణగారిన జాతికే వెలుగంట

*********************

వెల్మజాల నర్సింహ 🙏🏻

ఉగాది @2021

 


వసంతాగమనం వచ్చింది 

ఉగాది పండగ తెచ్చింది 

చైత్ర మాసంలో వచ్చింది

 చెట్టుకొమ్మ చిగురించింది 

కాలగమనం మెుదలైంది

  కోయిలమ్మ గొంతు విపింది  

కొత్త సంవత్సరం వచ్చింది

 యుగాదిపండుగ తెచ్చింది 

కవులు కలాలు పట్టారు 

కవిత్వం తో స్వాగతించారు 

మామిడి కాయల సందడి 

వేప పువ్వుల పందిరి 

 తీపి వగరు చేదు పులుపు

 ఉగాది పచ్చడి చేయండి 

ఊరంత పంచండి 

పంచాంగాని వినండి

 పరిపూర్ణంగా జీవించండి

 ******************

(వెల్మజాల నర్సింహ చరవాణి.9867839147)


మా నాన్న రైతు



చుట్టూ పచ్చని పంట పొలాలు.  

వాటి మధ్య లో పిల్లకాలువలు 

పైన  చెరువు పచ్చని చీర 

కట్టిన బాపు బొమ్మల  వుంటుంది  దుప్పల్లి 

మా ఊరు. 

ఐదవ తరగతిలో అనుకుంటా ప్రారంభం

ఉదయం వేకువ జామున లేచి పుస్తకం 

చదువు కుంటు 

పొలం కాడికి పోయి ్య  

ఆవు పాలు పిండుకొన్ని

రావడం 

సాయంత్రం నాలుగు

గంటలకు మళ్లీ పోవడం 


నాన్నకు పొలం పనులో 

సహాయం చేసి 

నాన్నతో కబుర్లు కథలు చెపుతుంటే వింటూ 

రావడం జరిగేది. 

అప్పుడు పొలం పనులు 

చేయడం వలన బాడీ 

చాలా దృడంగా మారింది 

పంట పొలాలు మధ్య 

తిరగటం 

పచ్చివి పెసర మరియు 

వేరు సెనగ కాయలు 

తినడం సీతాఫలాలు 

రోజు వారి ఆహారమే అక్కడ. 

వరి వరం పై పిల్లి పెసరు కాయలు

రామయ్య తాత జొన్న 

కాంకులు .

పాలు కారే కాంకుల లో 

పలుగు రాళ్ళు వేడి చేసి 

వేస్తే వచ్చే రుచి బాగుండేది.

బాట వెంబడి కంది కాయలు 

వేసవిలో తాటి ముంజలు

తింటూ జీవితం గడిచేది 

దారి లో ఎవరైనా 

మనుషులు కనబడితే

బంధువుల వలే 

మనసు విప్పి మాట్లాడుకునే వారు 

మా నాన్న అంటుండేవాడు

దారి ఎంత  దుారం వున్న

గమ్యం గురించే ఆలోచి స్తాము అలాగే 

ప్రస్తుతం చేస్తున్నా పనిపై 

ఏకాగ్రత పెడితే విజయం తప్పకుండా వరిస్తుందాని.

ఒక రోజు సాయంత్రం 

ఉరుములతో కుాడిన వర్షం 

ఎల్లమ్మ కాలువ లో వానాకు నీరు జోరుగా 

ప్రవహిస్తుంది. 

కట్టపై వేప చెట్టుపై గిజిగాడు చాలా అందంగా 

అలినా గుాడు లో చిన్న పిల్లలు 

చలికి వణుకుతున్నాయి

చాలా బాధనిపించింది

వెళ్లి నాన్నకు చెపితే 

వాటిని తీసుకొచ్చి 

వెచ్చని గోగునార సంచిపై వుంచిండు 

ఉదయం భానుడి 

కిరణాల వేడికి 

అవి ఎగురుతు గూటికి 

చేరడం చూస్తే చాలా ఆనందం వేసింది. 

వాటి తల్లి పిల్లల ఆనందానికి. ..

అప్పుడు మనసులో 

అనిపించిన మాట. ..

ఆశలకు మరణంలేదు 

అవకాశలకు కొదువే లేదు 

ఆనందానికి హద్దులు వేసి 

అవరోధాలను దాటేద్దాం

పేదతనం ధైర్యనిస్తుంది.

మంచి సంస్కారాన్ని  నిస్తుంది.

అనడం లో సందేహం లేదు 



వెల్మజాల నర్సింహ

(అగ్ని శిఖ రచయిత)

ఆశలకు మరణంలేదు అవకాశలకు కొదువే లేదు ఆనందానికి హద్దులు వేసి అవరోధాలను దాటేద్దాం


 

జీవితం

మావిలో జీవం పోసుకొని 

బయట ప్రపంచంలోకి 

రావడానికి తన శక్తినంతా కుాడా గట్టుకొని మావి ప్

రపంచం నుండి మరో ప్రపంచం లోకి వచ్చిన జీవి 

తన జీవిత పోరాటం ఆనందంతొ ప్రారంభించి 

అబద్దాల జీవితానికి అలవాటు పడి మెాసపొతు 

మెాసం చేస్తు

జీవితమంటే ఏమిటొ తెలుసుకోకుండా 

ముగిస్తుంటాడు.

కొందరి జీవితాలు చాలా 

ల విచిత్రంగా వుంటాయి 

కొంతమందే ఇతరులకు చాలా ప్రేరణగా నిలుస్తారు 

మానవ మెదడులు అందరివి దాదాపుగా ఒకే 

నిర్మాణం. కానీ కొందరే చరిత్ర వీరులౌవుతారు.

చిన్నపుడు మా అమ్మ 

ఒక మాట అంటుండేది

ఒక ఊరి లో దొర గారికి 

పుత్రుడు జన్మించాడు 

అక్కడే చెట్టు పై కాకి కూడా అదే రోజు 

ఐదు పిల్లలకు పొదిగి జీవం పోసింది. 

కాకి పిల్లల పెద్దవై ఎగిరి

పొాయ్యాయి

దొర కొడుకు పెద్ద వాడై 

తన తాత ముత్తాతల 

ఆస్తి అనుభవిస్తు

మరణించాడు 

కాకి పిల్లలకు 

దొర కొడుకు పెద్ద తేడా 

లేదు పుట్టడం గిట్టడం .

 ప్రకృతిలో సృష్టి ధర్మం,

కానీ మనిషిగా ఆలొచించే శక్తి వుండి 

దైవమిచ్చిన నీ కళను గుర్తుంచుకోకుండ జీవించి 

జీవిత చరమాంకంలో 

బాధ పడితే 

చేతులు కాల్చుకున తరువాత 

ఆకుల పట్టుకుంటే ప్రయోజనం లేదు. 

నిన్ను నీవు గుర్తుంచుకో

గౌరవించుకో .

సామాజిక స్పృహ, 

ఇతరులకు సహాయం చేయడం, వున్న దానితో

ఆనందంగా గడపడం 

ఇదే కదా జీవితం 

*******************

వెల్మజాల నర్సింహ✍🏻

కవిత్వం -II

ఊటబావిలా ఉరిస్తావు

ఉహకందని నీరిస్తావు

కలలో నువ్వే  కవ్విస్తావు

 కనిపించక మురిపిస్తావు

మస్తిష్కంలొ కల్లోలం సృష్టిస్తావు

పదిమందిలో మెప్పిస్తావు

నలుగురిని నవ్విస్తావు

చదువుల బడినె

వలెస్తావు

పిల్లల కోసం తల్లి వౌతావు

తెలుగు కవుల సరిగమలౌవుతావు

కవిత్వమా కాసేపు కవ్వించుమా. .

రాగాలలో గానమౌతావు

రాసే యువకుల ప్రేమౌవుతావు

విరసం, సరసాలాలతొ

సాదిస్తావు

అవధానలతొ అలరిస్తావు

అష్ట దిగ్గజాలనే ఆటాడిస్తావు

కవిత్వమా కాసేపు లాలించుమా

బాధల లో నువ్వే  కనిపిస్తావు 

పోరాట వీరుల తొడుంటావు 

వయసుతొ పని లేదంటావు 

అక్షరమే ఆయుధమై

ప్రశ్నిస్తావు 

 కవిత్వమా నీతోనే 

పోరాటం సాగించనా

 *****************

అమ్మ

 అమ్మ ను పుాజించు 

ఆలి నీ గౌరవించు 

అక్క చెల్లెలును ప్రేమించు 

సమాజంలో ఆడవారిని 

 అమ్మ గా చుాడు

మల్లన మల్లన : SONG



 మల్లన మల్లన 

*************

పల్లవి:మల్లన మల్లన మల్లనో

మేము వేడుకునే దేవుడవు మల్లన


పచ్చని పల్లెలో మల్లన 

నీవు స్వచ్చమైన దేవుడవు మల్లన 


:మల్లన మల్లనో:


చరణం: పంట పొలాల మధ్య మల్లనో


నీకూ గుడి కట్టి కొలచు కుంటిమి మల్లన 



గొడ్డు గొర్రె కాపాడమని మల్లన 

మా గొడు నీకూ చెప్పుకుంటూమి మల్లన  

 :మల్లన మల్లనో:

చరణం: మీ కొర్రమీసం చుాసిమల్లన 

మా పొరాగాళ్లు పెంచుతుండే మల్లన 

నువ్వు అక్క కిచ్చే  గౌరవంతొ మల్లన 

మా అక్క చెల్ల లను చుాసు కుంటిమి మల్లన 

                                            :మల్లన మల్లనో:

 

చరణం: మా పల్లె సాలంగా చుాస్తావని మల్లన 

మీకు పండుగ చేసి కొలచుకుంటాం మల్లన 

మీ కమ్మనైనా కథ తోటి మల్లన 

మా జీవితంలో అనుసరించితిమి మల్లన

మా పాపలు పొగొట్టామని మల్లన 

నీకుా పట్నలేసి పండుగ జేసితిమి మల్లన 

                                            చరణం: మల్లన మల్లన


 మల్లనో

మమ్ముల చలంగా చుాసేటి దేవుడవు మల్లన 

మల్లన మల్లన మల్లనొ 

నీకూ వెల వెల వందనాలు మల్లన (2)

 

****

వెల్మజాల నర్సింహ✍🏻

నుాతన సంవత్సరం@2021. (New Year)

 మనసా నీతో ఒక మాట 

మరేందుకు తొందర బయట 

నీలో నువ్వే ఈపుాట 

గడుపుమా కొత్త సంవత్సరం పుాట 

ఆనందం లేదు బయట 

అమ్మ నాన్న లతో 

ఈపుాట 

గడుపుమా నేడే వారి కనుల పంట

గడిచినా కాలం పెంటా 

వర్తమానం పసిడి పంట

భవిష్యత్తు కాలం వెంటా 

నిన్ను  నువ్వు నమ్మకుంటే

సిరుల పంట 

నుాతన సంవత్సరంమంటా

కలగాలి శుభాలు ప్రతి ఇంటా

 

***************

 

 వెల్మజాల నర్సింహ✍🏻


సరదాకి వొడ్కా



రాత్రిరి తాగినా వొడ్కా

పొగలెక్కింది కిక్కు తడాఖా

మత్తులో వెతికినా పడక 


మాగురుడు ముందే గురక 


పక్కకు జరిగిన వారి పిలక 


మాటల యుద్ధం కొడుకా

మౌనం మరిచితి చిలకా


ఫొన్ లో వెతికినా బొమ్మలు 


మత్తెక్కిన చుాపుల  కొమ్మలు 


అతి తాగుడు చేసేన నష్టం


ఉదయం తెలిసేనా కష్టం 


 వెల్మజాల నర్సింహ

భవి భారత పౌరులం -Future citizens of India

ఆరుద్ర పురుగులం 
ఆటలాడు బాలలం 
అమ్మ నాన్నల నందులం 
అమాయక పిల్లలం 

సీతాకోకచిలుకలం 
చెట్టు కింద కోతులం 
అమ్మవడి లో కుానలం
ఆనందపు నిధులం

స్నేహమేర జీవితం 
చెలిమిచేసే సాహసం 
భవిష్యత్తు పునాదులం 
భవి భారత పౌరులం 
 **
 *వెల్మజాల నర్సింహ✍🏻

ఉపాధ్యాయుడు -Teacher

 ఆ మనిషి  కొట్టినా దెబ్బలు గుర్తుకు లేవు

నేర్పించిన అక్షరం గుర్తుతుంది 

అమనిషి తిట్టినా తిట్లూ గుర్తులేవు 

నాలో తీసుకొచ్చిన మార్పులు గుర్తుతుంది 

నాన్న తరువాత అతనే 

ఆ.. మనిషి. ..టీచర్

.*_

కలివిడి మనిషికి కష్టం లేదు



ఆకాశాన్నికి హద్దులు లేవు 

కోర్కెలకు మరణం లేదు 

కాలాన్నికి కల్లెం లేదు 

సంపాదనకు  పోటీ లేదు  

సంసారంలో సుఖం లేదు

 జీవి లో గుండెకు ఆలుపే లేదు 

కలుపు మెుక్కకు విలువే లేదు 

కలివిడి మనిషికి కష్టం లేదు

***************

వెల్మజాల నర్సింహ✍🏻**

చిన్నప్పటి మిత్రుడు

 మధ్యాహ్నం ఒంటి గంట

కావస్తోంది కడుపులో ఎలుకల పరుగులు  మెుదలైనవి.

అప్పుడే వచ్చిన ఫొన్ మీరు మా ఆఫీసుకు రాగలరా పది 

నిముషాలలో.

సరే తొందరగా పని ముగించుకుని వచ్చి లంచ్ బాక్స్ 

తినవచ్చు లే అని 

నాలో నేను అనుకొని 

బయటకు వెళ్ళాను. 


లాక్ డౌన్ వచ్చి ఆరు నెలలు కావస్తోంది. 

మాస్క్ పెట్టుకొని  బయటకు 

పోయి

 ఆటో కోసం వేచి వున్నాను 

ఆటో మన సమయానికి రాదు. 

 *నీవ్వు ఎక్కవలసిన బస్సు  అది నీజీవిత కాలం 

మీస్సు అని ఆరుద్ర గారి మాట 

అనుకుంటు వుండగా ప్రక్క జేబులో 

ఫొన్ కుదురుగా వుండదు. 

ఎక్కడ వున్న ప్రక్కనే నువ్వే పాట ఫొన్ లో

 రింగ్ టోన్ మ్రెాగుతుంది

చూస్తే బాస్. 

యస్ బాస్, ఒకే బాస్ 

సాయంత్రం వరకూ ఇ-మెల్ పంపుతా అని  

చెప్పి ఫొన్ కట్ చేసి

వెంటనే జేబులో వేసుకున్నాను. 


రాదు- రాదుగా ఆటో అనుకుంటునే తడవుగా 

ఆటో వచ్చింది. 

ఎమ్. ఐ.డి.సి.అదానీ ఆఫీసుకు ' చలో అన్నాను. 

ఆటో వాడు గేట్ ముందు 

ఆటో ఆపిండు, వారికి డబ్బులు ఇచ్చి 

గేట్ దాటి లోనికి ప్రవేశించిన నాకు

చుాస్తే చాలా పెద్ద భవంతి 

అద్దలతొ ఎండకు తళ తళ మెరుస్తుంది .

ముంగిట వాచ్ మెన్ దగ్గర రిజిస్టర్ లో పేరు 

మొబైల్ నెంబర్ రాసి 

మెుదటి అంతస్తు లోకి

 

వెళ్ళినా నాకు ఎవరు మనుషులు కనిపించ లేదు. 

వరండా విశాలంగా పెద్ద పెద్ద కుర్చీలతొ వుంది 

రెండవ అంతసు నుండి 

గుసగుసల శబ్దాలు వినబడుతున్నాయి 

కొంచెం భయం గా అనిపించింది

అటు ఇటు చుాస్తే ఎవరు కనిపించారే 

అని మనసులో అనుకుంటునా. 

రెండవ అంతస్తు పైకి

పోయే ద్వారం దగ్గర 

నిలువెత్తు అంబేడ్కర్ 

ఫొటో ఒకటి కనిపించింది.

మనసుకు ప్రశాంతంగా 

అనిపించింది. 

చిన్నప్పటి మిత్రుడుని 

చుాసిన అనుభుతి కలిగింది.  

ఎవరు లేకుంటే ఏమిటి 

 అని చిన్నప్పటి ఙ్ఞాపకాలు నెమరేసుకుంటూ 

కుర్చీ లో సాఫీగా కూర్చున్నాను. 

నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఊరి మధ్య లో వున్న 

అంబేడ్కర్ విగ్రహం చుట్టూ పిల్లలంతా కూర్చొని ఉదయం,

 సాయంత్రం కబుర్లు చెప్పుకునే వాళ్లం. 

అలా అంబేడ్కర్ విగ్రహం కానీ ఫొటో కానీ చుాస్తే 

 చిన్నప్పటి మిత్రుడులా ధైర్యం వస్తుంది. 


**********************

వెల్మజాల నర్సింహ.10.10.20

 

దుప్పల్లి గ్రామ చరిత్ర

 ఆది మానవుడు నిప్పును కనుగొన్న తరువాత

నాగరికతకు బీజం పడిందని చెప్పవచ్చు. 

నిప్పుతో పాటు జీవించడానికి నీరు చాలా అవసరం

 అందుకే అప్పటి మనుషులు నదులు లేదా

 నీటి పరివాహక ప్రాంతంలో 

జీవనం ప్రారంభించారు. 

రామన్నపాడు ,తక్కల పాడు, దుబ్బలా, 

ఎర్ర కాలువ, బొళ్ల మీద, చింతల చెరువు, 

బొక్కొని గుాడెం వీటి కలయిక దుప్పల్లి. 

రామన్నపాడు గురించి చెప్పాలంటే 

కాకతీయుల చివరి రాజు పతాప రుద్రుడి నాటి కాలంలో 

అక్కడ మనుషులు జీవనం సాగించారు

 అనడానికి శిధిలమైన విగ్రహాలు,

 మట్టి  పాత్రలు నేటికీ కనిపిస్తాయి. 

రామన్నపాడు నుండి తక్కల పాడు వరకూ

 పక్కనే ముాసీనదీ  ప్రవహిస్తుంది. 

అప్పటి కాలంలో అంటు వ్యాధులు

 (కలరా)వచ్చి చాలా మంది చనిపోయే వారు.

వారిని సమాధి చేసి

మిగిలినవారు ఆ నివాసం 

వదిలి వేరే చోటుకు పోయి 

నుాతన జీవితం కొనసాగించేవారు 

అలా రామన్నపాడుని విడిచిపెట్టారు.

దుబ్బల అనే ప్రాంతం దట్టమైన చెట్లతో గుబురుగా 

వుండేది అక్కడ దుబ్బల లో  దుబ్బలు(లేళ్ళు)

 వుండేవాని కొందరు చెపుతుంటారు. 

రామన్నపాడుని విడిచిపెట్టిన జనం 

దుబ్బలలో కొత్త జీవితం 

ఆరంభించారు. 

దుబ్బలలో  వెలసిన పల్లె కావున

 దుప్పల్లి గా మారింది

దుప్పల్లికి ముాడు చెరువులు,

 పక్కనే ముాసీనదీ

 ఊరు చుట్టూ పచ్చని  పొలాలు వున్నాయి. 

*******************

వెల్మజాల నర్సింహ✍🏻



దుప్పల్లి@ బడి 1999 బ్యాచ్

రైలు ప్రయాణం ముంబయి నుండి 

మా ఊరుకి పది సంవత్సరాల తరువాత 

దసరాకు బయలు దేరాను ఎంతైనా 

పుట్టిన ఊరంటే ఎవరికి ఇష్టం వుండదండీ.

విండో సీటు కిటికీ నుండి 

మంచు కురిసిన ఉదయం పిల్ల గాలులు 

వీస్తున్నాయి. 

సుార్యడు తన కిరణాలను  మంచు బిందువులతొ

 మమేకం చేసి ప్రకృతి అందాలను రెంటింపు చేస్తున్నాడు. 

పుాణె స్టేషన్ తరువాత చిన్న పల్లెలు వస్తున్నాయి .

కొంచెం బానుడి కిరణాలు తగులుతున్నట్లుగా వుంది. 

దుారం నుండి బడి గంట వినబడుతుంది. 

నేను చిన్నపుడు చదివిన బడి  విషయాలు

 ఒకసారిగా గుర్తుకు రా సాగాయి 

మా ఊరు దుప్పల్లి పచ్చని చెట్లు వాటి మధ్య లో

 నుండి రోడ్డు .

చుాడ ముచ్చటగా వుంది మెుదటి సారి నేను 

చుాసిన మాబడి.

దేవుడు ఇచ్చిన వరం అమ్మ ఒడి  మరో గుడి బడి. 

బడి ఇప్పుడు స్కూల్  అంటేనే అర్ధం అయేంతా 

దిగజారి పోతున్నాయి .

ఏమైనా అప్పటి చదువులు వాటి తాలుకా  సంతోషలు 

చాలా అమాయకంగా వుండేవి. 

కొందరు చదువులో రాణీ స్తే మరి కొందరు కబడ్డీ 

మరియు వాలీబాల్ వంటి వాటిల్లో చాలా చురుకుగా వుండేవారు.

డొక్కు సైకిల్ వుంటే వాడే

హీరో గా భవించి  ఊరంతా కలియతిరిగే వాడు. 

గొళ్లీల ఆటలు, బావులలో ఈతలతో పాటుగా సాయంత్రం

 వ్యవసాయం పనులకై పొలం కాడికి చేరుకునే వాళ్లం. 

సాయంత్రం పుటా శనగ చేను, రేగిపండ్లు, సీతా ఫలాల

 తో పాటుగా 


ఎనుగు వెంకటిగాని కుాతలు పచ్చని వేప చెట్టు

 పై నుండి కోకిల పాటలు మట్టి వాసన 

ఎతైనా గుబురుగా వుండే గడ్డి పొదలు 

అమాయక మనుషులు 

నేటికీ కనుమరుగయే. 

మా బడికి మా ఊరే కాకుండా చిత్తాపురం,

 నర్సాపురం,గోపరాజు పల్లి మరియు పాలడుగు

 "దత్తప్ప గూడెం నుండి కుాడా చదువు

 కోవడానికి వచ్చేవారు.

గురువులంటే గౌరవ భవం వుండేది .


నాలుగు ఊర్ల పిల్లలతో 

బడి నిండుగా నెక్కర్ లాగులు,

 పాత సైకిల్స్ మరియు ఎతైనా నునుగు 

మీసాల విద్యార్ధులు వుండేవారు. 


ఇంకావుంది..