జీవితం

మావిలో జీవం పోసుకొని 

బయట ప్రపంచంలోకి 

రావడానికి తన శక్తినంతా కుాడా గట్టుకొని మావి ప్

రపంచం నుండి మరో ప్రపంచం లోకి వచ్చిన జీవి 

తన జీవిత పోరాటం ఆనందంతొ ప్రారంభించి 

అబద్దాల జీవితానికి అలవాటు పడి మెాసపొతు 

మెాసం చేస్తు

జీవితమంటే ఏమిటొ తెలుసుకోకుండా 

ముగిస్తుంటాడు.

కొందరి జీవితాలు చాలా 

ల విచిత్రంగా వుంటాయి 

కొంతమందే ఇతరులకు చాలా ప్రేరణగా నిలుస్తారు 

మానవ మెదడులు అందరివి దాదాపుగా ఒకే 

నిర్మాణం. కానీ కొందరే చరిత్ర వీరులౌవుతారు.

చిన్నపుడు మా అమ్మ 

ఒక మాట అంటుండేది

ఒక ఊరి లో దొర గారికి 

పుత్రుడు జన్మించాడు 

అక్కడే చెట్టు పై కాకి కూడా అదే రోజు 

ఐదు పిల్లలకు పొదిగి జీవం పోసింది. 

కాకి పిల్లల పెద్దవై ఎగిరి

పొాయ్యాయి

దొర కొడుకు పెద్ద వాడై 

తన తాత ముత్తాతల 

ఆస్తి అనుభవిస్తు

మరణించాడు 

కాకి పిల్లలకు 

దొర కొడుకు పెద్ద తేడా 

లేదు పుట్టడం గిట్టడం .

 ప్రకృతిలో సృష్టి ధర్మం,

కానీ మనిషిగా ఆలొచించే శక్తి వుండి 

దైవమిచ్చిన నీ కళను గుర్తుంచుకోకుండ జీవించి 

జీవిత చరమాంకంలో 

బాధ పడితే 

చేతులు కాల్చుకున తరువాత 

ఆకుల పట్టుకుంటే ప్రయోజనం లేదు. 

నిన్ను నీవు గుర్తుంచుకో

గౌరవించుకో .

సామాజిక స్పృహ, 

ఇతరులకు సహాయం చేయడం, వున్న దానితో

ఆనందంగా గడపడం 

ఇదే కదా జీవితం 

*******************

వెల్మజాల నర్సింహ✍🏻

No comments:

Post a Comment