చుట్టూ పచ్చని పంట పొలాలు.
వాటి మధ్య లో పిల్లకాలువలు
పైన చెరువు పచ్చని చీర
కట్టిన బాపు బొమ్మల వుంటుంది దుప్పల్లి
మా ఊరు.
ఐదవ తరగతిలో అనుకుంటా ప్రారంభం
ఉదయం వేకువ జామున లేచి పుస్తకం
చదువు కుంటు
పొలం కాడికి పోయి ్య
ఆవు పాలు పిండుకొన్ని
రావడం
సాయంత్రం నాలుగు
గంటలకు మళ్లీ పోవడం
నాన్నకు పొలం పనులో
సహాయం చేసి
నాన్నతో కబుర్లు కథలు చెపుతుంటే వింటూ
రావడం జరిగేది.
అప్పుడు పొలం పనులు
చేయడం వలన బాడీ
చాలా దృడంగా మారింది
పంట పొలాలు మధ్య
తిరగటం
పచ్చివి పెసర మరియు
వేరు సెనగ కాయలు
తినడం సీతాఫలాలు
రోజు వారి ఆహారమే అక్కడ.
వరి వరం పై పిల్లి పెసరు కాయలు
రామయ్య తాత జొన్న
కాంకులు .
పాలు కారే కాంకుల లో
పలుగు రాళ్ళు వేడి చేసి
వేస్తే వచ్చే రుచి బాగుండేది.
బాట వెంబడి కంది కాయలు
వేసవిలో తాటి ముంజలు
తింటూ జీవితం గడిచేది
దారి లో ఎవరైనా
మనుషులు కనబడితే
బంధువుల వలే
మనసు విప్పి మాట్లాడుకునే వారు
మా నాన్న అంటుండేవాడు
దారి ఎంత దుారం వున్న
గమ్యం గురించే ఆలోచి స్తాము అలాగే
ప్రస్తుతం చేస్తున్నా పనిపై
ఏకాగ్రత పెడితే విజయం తప్పకుండా వరిస్తుందాని.
ఒక రోజు సాయంత్రం
ఉరుములతో కుాడిన వర్షం
ఎల్లమ్మ కాలువ లో వానాకు నీరు జోరుగా
ప్రవహిస్తుంది.
కట్టపై వేప చెట్టుపై గిజిగాడు చాలా అందంగా
అలినా గుాడు లో చిన్న పిల్లలు
చలికి వణుకుతున్నాయి
చాలా బాధనిపించింది
వెళ్లి నాన్నకు చెపితే
వాటిని తీసుకొచ్చి
వెచ్చని గోగునార సంచిపై వుంచిండు
ఉదయం భానుడి
కిరణాల వేడికి
అవి ఎగురుతు గూటికి
చేరడం చూస్తే చాలా ఆనందం వేసింది.
వాటి తల్లి పిల్లల ఆనందానికి. ..
అప్పుడు మనసులో
అనిపించిన మాట. ..
ఆశలకు మరణంలేదు
అవకాశలకు కొదువే లేదు
ఆనందానికి హద్దులు వేసి
అవరోధాలను దాటేద్దాం
పేదతనం ధైర్యనిస్తుంది.
మంచి సంస్కారాన్ని నిస్తుంది.
అనడం లో సందేహం లేదు
వెల్మజాల నర్సింహ
(అగ్ని శిఖ రచయిత)
No comments:
Post a Comment