కవిత్వం -II

ఊటబావిలా ఉరిస్తావు

ఉహకందని నీరిస్తావు

కలలో నువ్వే  కవ్విస్తావు

 కనిపించక మురిపిస్తావు

మస్తిష్కంలొ కల్లోలం సృష్టిస్తావు

పదిమందిలో మెప్పిస్తావు

నలుగురిని నవ్విస్తావు

చదువుల బడినె

వలెస్తావు

పిల్లల కోసం తల్లి వౌతావు

తెలుగు కవుల సరిగమలౌవుతావు

కవిత్వమా కాసేపు కవ్వించుమా. .

రాగాలలో గానమౌతావు

రాసే యువకుల ప్రేమౌవుతావు

విరసం, సరసాలాలతొ

సాదిస్తావు

అవధానలతొ అలరిస్తావు

అష్ట దిగ్గజాలనే ఆటాడిస్తావు

కవిత్వమా కాసేపు లాలించుమా

బాధల లో నువ్వే  కనిపిస్తావు 

పోరాట వీరుల తొడుంటావు 

వయసుతొ పని లేదంటావు 

అక్షరమే ఆయుధమై

ప్రశ్నిస్తావు 

 కవిత్వమా నీతోనే 

పోరాటం సాగించనా

 *****************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి