ఆది మానవుడు నిప్పును కనుగొన్న తరువాత
నాగరికతకు బీజం పడిందని చెప్పవచ్చు.
నిప్పుతో పాటు జీవించడానికి నీరు చాలా అవసరం
అందుకే అప్పటి మనుషులు నదులు లేదా
నీటి పరివాహక ప్రాంతంలో
జీవనం ప్రారంభించారు.
రామన్నపాడు ,తక్కల పాడు, దుబ్బలా,
ఎర్ర కాలువ, బొళ్ల మీద, చింతల చెరువు,
బొక్కొని గుాడెం వీటి కలయిక దుప్పల్లి.
రామన్నపాడు గురించి చెప్పాలంటే
కాకతీయుల చివరి రాజు పతాప రుద్రుడి నాటి కాలంలో
అక్కడ మనుషులు జీవనం సాగించారు
అనడానికి శిధిలమైన విగ్రహాలు,
మట్టి పాత్రలు నేటికీ కనిపిస్తాయి.
రామన్నపాడు నుండి తక్కల పాడు వరకూ
పక్కనే ముాసీనదీ ప్రవహిస్తుంది.
అప్పటి కాలంలో అంటు వ్యాధులు
(కలరా)వచ్చి చాలా మంది చనిపోయే వారు.
వారిని సమాధి చేసి
మిగిలినవారు ఆ నివాసం
వదిలి వేరే చోటుకు పోయి
నుాతన జీవితం కొనసాగించేవారు
అలా రామన్నపాడుని విడిచిపెట్టారు.
దుబ్బల అనే ప్రాంతం దట్టమైన చెట్లతో గుబురుగా
వుండేది అక్కడ దుబ్బల లో దుబ్బలు(లేళ్ళు)
వుండేవాని కొందరు చెపుతుంటారు.
రామన్నపాడుని విడిచిపెట్టిన జనం
దుబ్బలలో కొత్త జీవితం
ఆరంభించారు.
దుబ్బలలో వెలసిన పల్లె కావున
దుప్పల్లి గా మారింది
దుప్పల్లికి ముాడు చెరువులు,
పక్కనే ముాసీనదీ
ఊరు చుట్టూ పచ్చని పొలాలు వున్నాయి.
*******************
వెల్మజాల నర్సింహ✍🏻
Super
ReplyDeleteధన్యవాదములు
Deleteచాలా చక్కగా దుప్పల్లి గ్రామ చరిత్ర ను తెలియజేశారు.
ReplyDeleteమీకు హృదయపూర్వక ధన్యవాదములు 🙏
ధన్యవాదములు
Delete