రైలు ప్రయాణం ముంబయి నుండి
మా ఊరుకి పది సంవత్సరాల తరువాత
దసరాకు బయలు దేరాను ఎంతైనా
పుట్టిన ఊరంటే ఎవరికి ఇష్టం వుండదండీ.
విండో సీటు కిటికీ నుండి
మంచు కురిసిన ఉదయం పిల్ల గాలులు
వీస్తున్నాయి.
సుార్యడు తన కిరణాలను మంచు బిందువులతొ
మమేకం చేసి ప్రకృతి అందాలను రెంటింపు చేస్తున్నాడు.
పుాణె స్టేషన్ తరువాత చిన్న పల్లెలు వస్తున్నాయి .
కొంచెం బానుడి కిరణాలు తగులుతున్నట్లుగా వుంది.
దుారం నుండి బడి గంట వినబడుతుంది.
నేను చిన్నపుడు చదివిన బడి విషయాలు
ఒకసారిగా గుర్తుకు రా సాగాయి
మా ఊరు దుప్పల్లి పచ్చని చెట్లు వాటి మధ్య లో
నుండి రోడ్డు .
చుాడ ముచ్చటగా వుంది మెుదటి సారి నేను
చుాసిన మాబడి.
దేవుడు ఇచ్చిన వరం అమ్మ ఒడి మరో గుడి బడి.
బడి ఇప్పుడు స్కూల్ అంటేనే అర్ధం అయేంతా
దిగజారి పోతున్నాయి .
ఏమైనా అప్పటి చదువులు వాటి తాలుకా సంతోషలు
చాలా అమాయకంగా వుండేవి.
కొందరు చదువులో రాణీ స్తే మరి కొందరు కబడ్డీ
మరియు వాలీబాల్ వంటి వాటిల్లో చాలా చురుకుగా వుండేవారు.
డొక్కు సైకిల్ వుంటే వాడే
హీరో గా భవించి ఊరంతా కలియతిరిగే వాడు.
గొళ్లీల ఆటలు, బావులలో ఈతలతో పాటుగా సాయంత్రం
వ్యవసాయం పనులకై పొలం కాడికి చేరుకునే వాళ్లం.
సాయంత్రం పుటా శనగ చేను, రేగిపండ్లు, సీతా ఫలాల
తో పాటుగా
ఎనుగు వెంకటిగాని కుాతలు పచ్చని వేప చెట్టు
పై నుండి కోకిల పాటలు మట్టి వాసన
ఎతైనా గుబురుగా వుండే గడ్డి పొదలు
అమాయక మనుషులు
నేటికీ కనుమరుగయే.
మా బడికి మా ఊరే కాకుండా చిత్తాపురం,
నర్సాపురం,గోపరాజు పల్లి మరియు పాలడుగు
"దత్తప్ప గూడెం నుండి కుాడా చదువు
కోవడానికి వచ్చేవారు.
గురువులంటే గౌరవ భవం వుండేది .
నాలుగు ఊర్ల పిల్లలతో
బడి నిండుగా నెక్కర్ లాగులు,
పాత సైకిల్స్ మరియు ఎతైనా నునుగు
మీసాల విద్యార్ధులు వుండేవారు.
ఇంకావుంది..
No comments:
Post a Comment