మల్లన మల్లన
*************
పల్లవి:మల్లన మల్లన మల్లనో
మేము వేడుకునే దేవుడవు మల్లన
పచ్చని పల్లెలో మల్లన
నీవు స్వచ్చమైన దేవుడవు మల్లన
:మల్లన మల్లనో:
చరణం: పంట పొలాల మధ్య మల్లనో
నీకూ గుడి కట్టి కొలచు కుంటిమి మల్లన
గొడ్డు గొర్రె కాపాడమని మల్లన
మా గొడు నీకూ చెప్పుకుంటూమి మల్లన
:మల్లన మల్లనో:
చరణం: మీ కొర్రమీసం చుాసిమల్లన
మా పొరాగాళ్లు పెంచుతుండే మల్లన
నువ్వు అక్క కిచ్చే గౌరవంతొ మల్లన
మా అక్క చెల్ల లను చుాసు కుంటిమి మల్లన
:మల్లన మల్లనో:
చరణం: మా పల్లె సాలంగా చుాస్తావని మల్లన
మీకు పండుగ చేసి కొలచుకుంటాం మల్లన
మీ కమ్మనైనా కథ తోటి మల్లన
మా జీవితంలో అనుసరించితిమి మల్లన
మా పాపలు పొగొట్టామని మల్లన
నీకుా పట్నలేసి పండుగ జేసితిమి మల్లన
చరణం: మల్లన మల్లన
మల్లనో
మమ్ముల చలంగా చుాసేటి దేవుడవు మల్లన
మల్లన మల్లన మల్లనొ
నీకూ వెల వెల వందనాలు మల్లన (2)
****
వెల్మజాల నర్సింహ✍🏻
No comments:
Post a Comment