ఎంత బాగుంటాయో ఊహాలు

 

 

 ఎంత బాగుంటాయో ఊహాలు
 అంతే చేదుంటాయి జీవితాలు
 మూడునాళ్ల జీవితానికి ఆరాటం
 నిత్యం ఆశల సాకారానికి పోరాటం


వెల్మజాల నర్సింహ ✍🏻

చదువుల శిఖరం (14 ఏప్రిల్ 1891)



అక్షరం అనే ఆయుధాన్ని నమ్ముకొని
దానితో కులమనే బలమైన రాక్షసి పై పొరాడి గెలిచిన వీరుడు

వ్యక్తి పూజ కంటే నీ పై నీకుండే నమ్మకమే నిన్ను గొప్ప వారిగా చెస్తుంది.

నేడు బాబాసాహెబ్ గారిని దేవుడిని చేశాం కొబ్బరి కాయలు కొట్టి పూలమాలలు 

వేసి రెండు ఫోటోలు దిగి పుట్టిన రోజులు జరుపుకొని మరిచిపోతున్నాం.
ప్రతి రాజకీయ నాయకుడికి ఈరోజు కావాలి  విగ్రహారాధనకు.

ఒక వర్గానికి దేవుడిని చేశారు ఆ వర్గం వారు కూడా సమర్థించుకుంటారు 

విగ్రహాలు పెట్టి పూజలు చేయడమే.

బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఎందుకు ఆదర్శం అంటే

 రాజ్యాంగం రాసిండు కదా అంటారు.

మా కులం అభ్యున్నతి కోసం పాటుపడాడు 

అని ఇంకొందరు అంటారు.

రిజర్వేషన్ల కారణంగానే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది 

అందుకే సంఘం పెడుతున్నాం అంటారు.

గుంపులు గుంపులుగా సంఘాలలో చేరడమే
జై భీమ్ అనడానికే పరిమితమా

పుట్టిన రోజు నాడు దండలేసినంత మాత్రాన 

అంబేడ్కర్ వారాసులం అయిపోతామా

కాదుకదా అతడి ఆయుధమైన అక్షరాన్ని 

పట్టుకోని ముందుకు సాగాడమే
నిరంతరం చదువడమే చదువులో ఎంతో 

ఉన్నత శిఖరాలకు చేరినా ఆ మహానీయుడి 

అడుగుల జాడలలో నడుస్తూ
ఆదర్శభారతాన్ని నిర్మించాలి
అందుకు చదువు మన ఆయుధం అవ్వాలి

చదువు.. చదువు ముందుకు సాగు
ఊపిరి ఉన్నంత వరకు శిఖరం చేరాలి.

వెల్మజాల నర్సింహ 14.04.24

హోలీ !



విశ్వవ్యాప్తమైన రంగుల హోలీ
మానవజీవిత కష్ట సుఖలా కేళీ
 అమ్మ తనం కనుమరుగైయే
 సృష్టికి భానుడి తాపం , పాపం
కామ దహనమే కాదు
మనిషి అహం కోపం నేడు
మంటలో కాలి బూడిదై
 మరలా మనందరి ఎదలో
మళ్ళీ చిగురిస్తుంది
ఆశల ఒరవడి
అదే  పచ్చని జీవితాలకు
 కాలమే వనమాలి
  


వెల్మజాల నర్సింహ ✍🏻25.03.24.

భావుకుడు



వారు కవితా నిర్మాణ కార్మికులు
 రాయడానికి నాలుగు అక్షరాలను వెతుక్కుంటున్నారు

చక్కగా కుదిరింది
కొందరు బాగుంది అన్నారు
మరికొందరు మీరే రాయగలరు
అన్నారు

లైకులు కొన్నింటిని మూటకట్టుకొని
ఆ రాత్రి హాయిగా నిద్ర పోయాడు
భావుకుడు

మట్టి కవిత్వం !



వారి అక్షరాలలో
 తొలకరి జల్లుల మట్టి వాసన
వారి పదాలలో మొదటి సారి
దుక్కి దున్నిన సాల్ల వరుసలా

నిన్నటి  రాత్రి చినుకులకు
ఉదయం మొలిచిన మొక్కలా
అల్లంత దూరాన
పచ్చిక బయళ్లలలో
 పిచ్చుకల గానంలా
ఎర్ర దిబ్బలలో వేరుశేనగ సాగులా

మల్లి బావి కంచేలో పురుడు
 పోసుకున్న మా గంగాలా
గంతులేసే లేగ దూడలా

బదరిక వనంలో తియ్యని
 తాటి పండులా
రంగు వేయాని ఇంద్రధనుస్సులా

చెరువులలో గంతులేస్తున్న
చేప పిల్లలా

నిండు పున్నమిగా పూసిన
 తంగేడు చెట్టులా
ఊట సేలిమేలో తియ్యని నీరులా
బురద పొలంలో కొంగల గుంపులా

బంగారాన్ని సింగారించుకున్న
 సర్కారు వృక్షంలా
మామిడి పూత కోసం
 వచ్చిన వసంత కోయిలా
అంతా వారి అక్షరాలలో
 మట్టి వాసనే
అందుకే చదివిన వారు దానిని
 మట్టి కవిత్వం అన్నారు

వెల్మజాల నర్సింహ ✍🏻

వేపచెట్టు!




 

 

 

 

 

 

 

 

సాయంత్రం వచ్చిన చుట్టం లా
చినుకులా వాన మొదలైంది
గుడిసె సురుకు గిజ్జిగాడి కూతలు
వచ్చిన వారంతా మా ఇంటి ఆడపడుచుకు తలంటు పోశారేమో
ముఖం నిగనిగలాడుతుంది పచ్చగా  ఉదయం వేళ!

ఈ పూట ఎక్కువే తిన్నట్లుంది
కోయిలమ్మ  పాట మొదలెట్టింది

బసవన్న అరుపులకు అర్థం ఏమిటో
అమ్మా కళ్ళాపి చల్లి ముగ్గు వేస్తుంది
ఇంటి ముంగిట వేప చెట్టు దగ్గర.

వెల్మజాల నర్సింహ ✍🏻

ఆకాశానికి నిచ్చెన వేసేంతా ఆలోచనలున్నా

 ఆకాశానికి నిచ్చెన వేసేంతా ఆలోచనలున్నా

 మొదలు పెట్టవలిసింది భూమి నుంచే
కావున చిన్న చిన్న ఆనందాలే
 ఆరోగ్యానికి సోపానాలు.


 

 

ప్రేమ!



దగ్గరగా ఉన్నప్పుడు ఏమి తోచక!
 లేదన్నట్లుగా ఉంటాం

అదే దూరమైతే!
అయినా వారితో కాసేపు మాట్లాడితే బాగుంటుండేది అనిపిస్తుంది .

బహుశా అదే నిజమైన ప్రేమ కావచ్చు .

వెల్మజాల నర్సింహ ✍🏻

మనసు ఉందని భావిస్తే మనశ్శాంతి

 మనసు ఉందని భావిస్తే మనశ్శాంతి 

ఉండదు జీవితంలో అంతా నటనే! 

కొందరు ఎక్కువగా నటనలో జీవిస్తారు అంతే

కొందరు డబ్బులు కూడా

 కొందరు డబ్బులు కూడా
 పెడతారు ఆనందం పొందుతారు
కొందరు ఆస్తులు సంపాదిస్తారు
 తన వారసులకు పంచుతారు

కానీ
నాలుగు అక్షరాలు పోగుచేసి
నలుగురికి పంచాలనే ఆలోచనతో ఇంటినే

 గ్రంథాలయం చేసిన మహానుభావులు 

ఇలా కొందరే ఉంటారు.





బాలికల దినోత్సవం


 నలుగురు కొడుకులు ఉన్నా
 ఇంటికంటే ఒక కూతురు వున్న
 ఇల్లే సందడిగా ఉంటుంది*

ఓ మనిషి!

 

అండ మో కణ మో కలయిక
అమ్మ గర్భ మో అంధకార మో
పిండ మో
శిశువో ప్రాణివో సకల జీవ ప్రాణులకు అధికారి

ఓ మనిషి!

  చివరకు పిడికెడు బూడిద అవుతావు
లేదా మట్టిలో కలిసిపోవడమే



వెల్మజాల నర్సింహ ✍🏻

దేవుడు!

 

కదలని బొమ్మకు బంగారు
వలువలు
 కటిక పేదరికంలో ఉండే
 అమ్మకు చిరిగిన చీర
తిన్నని రాయికి పరమాన్నాలు
తిండి లేని భిక్షగాడికి
 పావలా దానం
పూటగడవని ఇంట్లో
అన్నమే పరమాన్నం
కోట్లాది పతికి చక్కెర రోగం



వెల్మజాల నర్సింహ

మన అలిశెట్టి ప్రభాకర్ గారు

 ప్రకృతి పై కవిత్వం
రాయవచ్చు
నోబెల్ పొందవచ్చు
ప్రేమ పై కవితలు
రాయవచ్చు
సినిమాలో చూపించి
ఆనందం పొందవచ్చు

కానీ కాలే కడుపుతో
ఆకలినే ఆయుధంగా
పేదల కోసం కవిత్వం రాసి
వారిని నాడు నేడు ఉత్తేజ
పరుస్తున్న జన భాస్కరుడు
మన అలిశెట్టి ప్రభాకర్ గారు



వెల్మజాల నర్సింహ ✍🏻

నదికి ప్రవాహమే

 నదికి ప్రవాహమే ఇతరుల జీవనాధారం.
మనిషికిరోజువారి పనుల్లో కొత్తదనాన్ని వెతికే వాడు ముందుకు పోతాడు

సముద్రంలో అలలు

 సముద్రంలో అలలు
 సంసారంలో కష్ట సుఖాలు కాలానుగుణంగా 

మారుతుంటాయి వాటిని ఆహ్వానించడం

 తప్ప ఏమి చేయలేము